హోం క్వారంటైన్‌లోకి కేరళ సీఎం

కేరళ సీఎం పినరయ్ విజయన్ హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. ఇటీవల కోజికోడ్‌ విమానాశ్రయంలో జరిగిన విమాన ప్రమాదం అనంతరం..సీఎం విజయన్‌ సంఘటనాస్థలికి చేరుకుని పరీశిలించారు. అయితే ఈ..

హోం క్వారంటైన్‌లోకి కేరళ సీఎం
Follow us

| Edited By:

Updated on: Aug 14, 2020 | 5:51 PM

కేరళ సీఎం పినరయ్ విజయన్ హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. ఇటీవల కోజికోడ్‌ విమానాశ్రయంలో జరిగిన విమాన ప్రమాదం అనంతరం..సీఎం విజయన్‌ సంఘటనాస్థలికి చేరుకుని పరీశిలించారు. అయితే ఈ దుర్ఘటనలో పద్దెనిమిది మంది చనిపోయిన సంగతి తెలిసిందే. వీరిలో పలువురు కరోనా బారినపడ్డారు. అంతేకాదు.. ఈ విమానంలో వచ్చిన పలువురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అంతేకాదు.. ఈ ఘటనలో సహాయ చర్యల్లో పాల్గొన్న పలువురి అధికారులకు, జిల్లా కలెక్టర్‌తో పాటు ఇతర పోలీస్ అధికారులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో కేరళ సీఎం పినరయ్ విజయన్‌ కూడా ముందస్తుగా హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. మరోవైపు శనివారం జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కదకంపల్లి సురేంద్రన్‌ జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. ఈ విషయాన్ని కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.

Read More :

దంతేవాడలో పెద్ద ఎత్తున లొంగిపోయిన మావోలు

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం