Breaking News
  • కడప: వివేకా హత్యపై సీబీఐ విచారణ జరపాలి. బీజేపీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారు. సీఏఏకు వ్యతిరేకంగా డిప్యూటీ సీఎం అంజద్‌ రాజీనామా చేయాలి. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడుతారు-ఆదినారాయణరెడ్డి.
  • రేపు పవన్‌ కల్యాణ్ ఢిల్లీ పర్యటన. కేంద్రీయ సైనిక్‌ బోర్డు కార్యాలయం సందర్శించనున్న పవన్‌. అమరవీరుల సంక్షేమానికి రూ.కోటి అందించనున్న పవన్‌.
  • కృష్ణాజిల్లా: చందర్లపాడు తహశీల్దార్‌ ఆఫీస్‌ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం. పక్కా ఇళ్ల స్థలాలకు తన పొలంలో మట్టి తవ్వుతున్నారని మనస్తాపం. పురుగులమందు తాగబోయిన రైతు, అడ్డుకున్న సిబ్బంది.
  • ప.గో: తాడేపల్లిగూడెం శశి ఇంజినీరింగ్‌ కాలేజ్ విద్యార్థి మృతి. బైక్‌పై నుంచి పడి మృతిచెందాడంటున్న తండ్రి. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు.
  • హైదరాబాద్: మిస్టరీగా మారిన ఆయుష్‌ చాన్‌ బే మృతి, ఈనెల 16న స్నేహితుడి పుట్టిన రోజు అని వెళ్లిన ఆయుష్‌, నిన్న రక్తపు మడుగులో శవమై తేలిన ఆయుష్‌, ఆయుష్‌పై మృతిపై అనుమానాలు.
  • విజయవాడ: అక్రమ కట్టడాలపై ఏసీబీ అధికారుల దాడులు. అనధికారిక అనుమతులపై లోతైన విచారణ. అక్రమంగా నిర్మించిన భవన యజమానులపై చర్యలకు సిఫారసు.

“లవ్ జిహాద్‌”పై బిషప్ సంచలన వ్యాఖ్యలు.. జై కొట్టిన వీహెచ్‌‌పీ..!

Kerala Church says 'Love Jihad is real'.. claims Christian women being lured into IS trap, “లవ్ జిహాద్‌”పై బిషప్ సంచలన వ్యాఖ్యలు.. జై కొట్టిన వీహెచ్‌‌పీ..!

కేరళకు చెందిన కేథలిక్ బిషప్ లవ్ జిహాద్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేరళలో నిజంగానే లవ్ జిహాద్ కొనసాగుతోందన్నారు. సెక్యులరిజానికి, సామాజిక ప్రశాంతతకు భంగం కల్గించే స్థాయిలో “లవ్ జిహాద్” పెరుగుతోందని ఆరోపించారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలపై కేథలిక్ బిషప్‌లు ఏర్పాటు చేసిన వేదిక..‘సైరో మలబార్‌ కేథలిక్‌’ చర్చ్‌ ఈ సంచలన ఆరోపణలు చేసింది. క్రైస్తవ యువతులను టార్గెట్ చేస్తూ.. ఐఎస్‌ ఉచ్చులోకి లాగుతున్నారన్నారు. అంతేకాకుండా పలు సందర్భాల్లో సదరు యువతులను హతమారుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇటీవలికాలంలో ఐఎస్‌లో చేరిన 21 మంది యువతుల్లో.. సగానికి సగం క్రిస్టియన్ మహిళలే ఉన్నారని.. ఇప్పటికైనా క్రైస్తవ సమాజం కళ్లు తెరవాలంటూ బిషప్‌లు పేర్కొన్నారు. కోజికోడ్‌కు చెందిన ఓ యువతి ఈ లవ్ జిహాద్ ఘటనపై ఫిర్యాదు చేసిందని.. తనను లైంగిక వేధింపులకు గురిచేస్తూ.. ఇస్లాంలోకి మారాలంటూ బలవంతం చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే.. “సైరో మలబార్‌ చర్చ్‌” మూడు రోజులపాటు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటుచేసింది. అనంతరం ఓ ప్రకటనను విడుదల చేసింది. కాగా ఈ కేథలిక్ బిషప్‌లు విడుదల చేసిన ప్రకటనకు వీహెచ్‌పీ స్వాగతించగా.. ఇస్లామిక్‌ సంస్థ ‘పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా’ మాత్రం ఖండించింది.

Related Tags