ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ స్టేజ్ మీద మైకును వదిలేసి కుప్పకూలిపోయి హఠాన్మరణం చెందిన బీజేపీ అభ్యర్థి

ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ బీజేపీ అభ్యర్థి స్వామినాథన్ స్టేజ్ మీదే మైకును వదిలేసి కుప్పకూలిపోయి హఠాన్మరణం చెందారు. కేరళలోని కొల్లాం జిల్లాలో నెలకొన్న ఈ హఠాత్ పరిణామంతో స్థానికంగా విషాదచాయలు అలముకున్నాయి. సంస్థల ఎన్నికల నేపథ్యంలో కొల్లాంలో పోటీ చేస్తున్నారు బీజేపీ నేత విశ్వనాథన్. ప్రచారంలో భాగంగా అప్పటికే పలు ప్రాంతాల్లో జోరుగా ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో మరో సభలో ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలి పోయారు. మాట్లాడుతూ మాట్లాడుతూనే మైకును వదిలేసి స్టేజిపై […]

  • Venkata Narayana
  • Publish Date - 7:33 pm, Sun, 22 November 20

ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ బీజేపీ అభ్యర్థి స్వామినాథన్ స్టేజ్ మీదే మైకును వదిలేసి కుప్పకూలిపోయి హఠాన్మరణం చెందారు. కేరళలోని కొల్లాం జిల్లాలో నెలకొన్న ఈ హఠాత్ పరిణామంతో స్థానికంగా విషాదచాయలు అలముకున్నాయి. సంస్థల ఎన్నికల నేపథ్యంలో కొల్లాంలో పోటీ చేస్తున్నారు బీజేపీ నేత విశ్వనాథన్. ప్రచారంలో భాగంగా అప్పటికే పలు ప్రాంతాల్లో జోరుగా ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో మరో సభలో ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలి పోయారు. మాట్లాడుతూ మాట్లాడుతూనే మైకును వదిలేసి స్టేజిపై పడిపోయారు. దాంతో వెంటనే ఆయన అనుచరులు, పక్కనున్న కార్యకర్తలు స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. అయితే విశ్వనాథన్ అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.