బేక‌రీ ఓనర్‌కు క‌రోనా పాజిటివ్‌… 300 మందికి వైద్య‌ప‌రీక్ష‌లు..!

ఓవైపు కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. రోజోరోజుకు రూపాంతరం చెందుతూ మరింత బలంగా తయారవుతోంది. దీని కట్టడికోసం ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉండిపోయింది. కేరళలోని ఇడుక్కిలో 39 ఏళ్ల బేకరీ యజమానికి మే 14న

బేక‌రీ ఓనర్‌కు క‌రోనా పాజిటివ్‌... 300 మందికి వైద్య‌ప‌రీక్ష‌లు..!
Follow us

| Edited By:

Updated on: May 17, 2020 | 1:29 PM

Community Spread: ఓవైపు కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. రోజోరోజుకు రూపాంతరం చెందుతూ మరింత బలంగా తయారవుతోంది. దీని కట్టడికోసం ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉండిపోయింది. కేరళలోని ఇడుక్కిలో 39 ఏళ్ల బేకరీ యజమానికి మే 14న కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో జిల్లాలోని రెండు గ్రామ పంచాయతీలను కంటైన్‌మెంట్ జోన్లుగా మార్చారు. బేకరీ నిర్వాహ‌కునితో సంబంధం ఉన్న‌ వ్యక్తులను గుర్తించడానికి ర్యాండ‌మ్ టెస్టులు నిర్వ‌హిస్తున్నారు. ఆయ‌న కుటుంబాన్ని క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా ఆదేశించారు.

కాగా.. గ‌త వారం రోజులుగా వంద‌లాది జ‌నాలు స‌ద‌రు బేక‌రీ షాపుకు వ‌చ్చారు. వీరిలో సాధార‌ణ ప్ర‌జ‌ల‌తోపాటు జ‌ర్న‌లిస్టులు, పోలీసులు కూడా ఉన్నారు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన అధికారులు శ‌నివారం నాడు అత‌నితో స‌న్నిహితంగా మెలిగిన 300 మంది వ్య‌క్తుల జాబితాను త‌యారు చేశారు. బేక‌రీలో ఐదు నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉన్న‌వారు కూడా ఈ లిస్టులో ఉన్నారు. వీరికి క‌రోనా ల‌క్ష‌ణాలు లేక‌పోయిన‌ప్ప‌టికీ ప‌రీక్ష‌ల నిమిత్తం న‌మూనాల‌ను సేక‌రించి ల్యాబ్‌కు పంపిన‌ట్లు అధికారులు తెలిపారు.

Also Read: తెలంగాణలో కొండెక్కిన చికెన్.. ‘కోత’కు రంగం సిద్ధం..