Breaking News
  • విజయవాడ: ఢిల్లీ అల్లర్ల బాధితుల కోసం సీపీఎం విరాళాల సేకరణ. మార్చి 2, 3 తేదీల్లో విరాళాలు సేకరించాలని పార్టీ శాఖలకు పిలుపు. సహృదయులైన దాతలు ఆదుకోవాలని కోరుతున్నాం-సీపీఎం ఏపీ కార్యదర్శి మధు.
  • చెన్నై: వేలూరు డిప్యూటీ కలెక్టర్‌ దినకరన్‌ అరెస్ట్‌. అవినీతి ఆరోపణలతో అరెస్ట్‌ చేసిన ఏసీబీ అధికారులు. ఏసీబీ తనిఖీల్లో భారీగా నగదు లభ్యం. తిరువన్నామలైకి చెందిన రంజిత్‌ కుమార్‌ భూముల విక్రయంలో ఆరోపణలు. ఏసీబీ సోదాల్లో ఇప్పటి వరకు రూ.76 లక్షల నగదు లభ్యం.
  • తెలంగాణ అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్‌ ఖరారు. మార్చి 6 నుంచి తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్‌ సమావేశాలు. మార్చి 8న బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం.
  • నోరు తెరిస్తే 14 ఏళ్లు సీఎంగా చేశా అంటారు. మమ్మల్నే అడ్డుకుంటారా అంటూ పోలీసులపై చిందులేయడం.. మీ మానసిక దౌర్భల్యాన్ని బయటపెడుతోంది. మీరు జీతాలిచ్చే హెరిటేజ్‌ స్టాఫ్‌ కూడా మాటలు పడరు.
  • ఢిల్లీలో 14 విమానాల దారి మళ్లింపు. వాతావరణం అనుకూలించక విమానాల దారి మళ్లింపు. లక్నో, అహ్మదాబాద్‌, జైపూర్‌ ఎయిర్‌పోర్టులకు మళ్లించిన అధికారులు.

కోల్ బెల్ట్ లో ఏం జరుగుతోంది…?

Kengarla Mallaiah to quit TBGKS?, కోల్ బెల్ట్ లో ఏం జరుగుతోంది…?

కోల్ బెల్ట్ లో టీఆర్ఎస్ బలమైన పునాదులు ఏర్పడటానికి కారణం సింగరేణి కార్మికులే. ఉద్యమ సమయంలో ధర్నాలు, ఆందోళనలతో ఈ ప్రాంతం అట్టుడుకేది. ఇదే సమయంలో పురుడుపోసుకున్నదే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం. 2002లో ఏర్పడిన ఈ సంఘం సింగరేణిలో బలమైన యూనియన్ గా ఎదిగింది. ఇందులో ఉద్యమకారుడు, సింగరేణి కార్మికుడు కెంగెర్ల మల్లయ్య కీలక భూమిక పోషించాడు. అయితే ఇన్నాళ్ల అనుంబంధాన్ని తెంచుకునేందుకు రెడీ అయ్యారు మల్లయ్య. టీబీజీకేఎస్ గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయ్యాడట. ఇవాళో రేపో రాజీనామా చేస్తారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.

కార్మిక సంఘం గెలుపు కోసం ఎంతో క్రుషి చేసినా…తగిన గుర్తింపు ఇవ్వలేదనే బాధలో ఉన్నారట మల్లయ్య. సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నా..తన మాట ఎక్కడా చెల్లడం లేదని..దీంతో బొగ్గుగని కార్మిక సంఘానికి దూరం కావాలనే ప్లాన్ లో ఉన్నారట. అందుకోసమే గత కొంత కాలంగా టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలతో పాటు యూనియన్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట మల్లయ్య. టీజీబీకేఎస్ కు గుడ్ చెప్పి తెలంగాణ మజ్దూర్ యూనియన్ లో చేరుతారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ ప్రాంతానికి చెందిన కొందరు టీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరడంతో మల్లయ్య కూడా అదే వేలో ఉన్నారనే మాట కోల్ బెల్ట్ లో ఆనోటా ఈ నోటా వినిపిస్తోంది.

గత ఐదారేళ్లుగా టీబీజీకేఎస్ లో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయట. సంఘంలో వలస నాయకులకు ప్రాధాన్యం పెరగడంతో ఉద్యమ సమయంలో ఉన్న వాళ్లకు న్యాయం జరగడం లేదన్నది మల్లయ్య వెర్షనట. మల్లయ్య యూనియన్ ను వీడితే మరికొంత మంది నేతలు కూడా గుడ్ బై చెప్పే అవకాశం ఉందట. ఇదే జరిగితే టీబీజీకేఎస్ లో చీలిక తప్పకపోవచ్చంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Related Tags