ఢిల్లీ.. మాకు ఆర్మీ డాక్టర్లు కావాలి.. సీఎం అరవింద్ కేజ్రీవాల్

ఢిల్లీలో అతి పెద్ద కోవిడ్-19 సెంటర్ లో పని చేసేందుకు తమకు ఆర్మీ డాక్టర్లు కావాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు. ముఖ్యంగా ఆర్మీతో బాటు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసు శాఖలో పని చేసే అనుభవజ్ఞులైన హెల్త్ వర్కర్లు కూడా ఆవసరమని ఆయన అన్నారు. 10 వేల పడకలతో..

ఢిల్లీ.. మాకు ఆర్మీ డాక్టర్లు కావాలి.. సీఎం అరవింద్ కేజ్రీవాల్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 23, 2020 | 8:13 PM

ఢిల్లీలో అతి పెద్ద కోవిడ్-19 సెంటర్ లో పని చేసేందుకు తమకు ఆర్మీ డాక్టర్లు కావాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు. ముఖ్యంగా ఆర్మీతో బాటు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసు శాఖలో పని చేసే అనుభవజ్ఞులైన హెల్త్ వర్కర్లు కూడా ఆవసరమని ఆయన అన్నారు. 10 వేల పడకలతో ఈ పెద్ద కోవిడ్ కేంద్రం ఈ నెల 26 న ప్రారంభం కావచ్ఛునని భావిస్తున్నారు. కేజ్రీవాల్ అభ్యర్థనపై స్పందించిన హోమ్ మంత్రి అమిత్ షా.. ట్వీట్ చేస్తూ .. ఈ కేంద్రానికి సంబంధించిన పనులు చాలావరకు పూర్తి అయ్యాయని, ఈ నెల 26 కల్లా ఇందులో చాలా భాగం పని చేయడం ప్రారంభించవచ్చునన్నారు. ఇక సైనిక డాక్టర్ల నియామకం గురించి ఆలోచిస్తామని హామీ ఇచ్చారు. ఢిల్లీ లో కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్న సంగతి తెలిసిందే.