Breaking News
  • భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 22,252 కేసులు, 467 మంది మృతి. దేశవ్యాప్తంగా7,19,665 కేసులు,19,693 మంది మృతి. దేశ వ్యాప్తంగా 2,59,557 యాక్టీవ్ కేసులు4,39,948 మంది డిశ్చార్జ్. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది.  హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎల్‌జీ పాలిమర్స్ సీఈవో, ఇద్దరు డైరెక్టర్లు సహా 12 మందిని అరెస్ట్ చేశారు.  ఘటనకు సంబంధించిన ఉన్నతస్థాయి కమిటీ మంగళవారం సీఎం జగన్​కు నివేదికను  అందజేసింది. ఘటనపై అధ్యయనం చేసిన నీరబ్‌ కుమార్‌ నేతృత్వంలోని కమిటీ యాజమాన్యం నిర్లక్ష్యం ఉందని తేల్చింది.
  • అమరావతి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. కరోనా నేపథ్యంలో 13 జిల్లాల్లో స్పెషల్‌ సబ్‌జైళ్లు ఏర్పాటు. 13 ప్రత్యేక జైళ్లు ఏర్పాటుచేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు. ఇకపై నేరస్తులందరినీ కోర్టు ఆదేశాల అనంతరం. స్పెషల్‌ జైలుకు తరలించే విధంగా ఆదేశాలు. కరోనా టెస్టులు, ఇతర శానిటైజేషన్ ప్రొటోకాల్ పాటించనున్న సబ్‌జైళ్లు. కరోనా నెగెటివ్‌ ఖైదీని మాత్రమే సాధారణ జైలుకు తరలించేలా ఆదేశాలు. జైలు సిబ్బందికి ప్రత్యేక రక్షణ కిట్లు.
  • జివికే గ్రూప్ ఫై ఈడి కేసు నమోదు . ముంబాయి ఎయిర్ పోర్ట్ అభివృధి పేరుతో 705 కోట్ల రూపాయల కుంభకోణం కు పాల్పడిన జీవీకే సంస్థ. మనీలాండరింగ్ కింద ఈడీ ఈసీఐఆర్ నమోదు . జి వి కృష్ణారెడ్డి, సంజీయిరెడ్డి లతో పాటు నిందితులకు ఈడీ నోటీసులు . 305 కోట్ల రూపాయల బదలాయియింపుల ఫై ఈడీ ఆరా . విదేశీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ అనుమానాలు . జూన్ 27 న జీవీకే సంస్థ తో పాటు 13 మంది పై సీబీఐ కేసు నమోదు . గత వారంలో హైదరాబాద్ ,ముంబై లో నీ జీవీకే కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన సిబిఐ.
  • పంచాయతీరాజ్ ఎల్ ఈ డీ స్ట్రీట్ లైటింగ్ ప్రాజెక్ట్ పేరు మార్పు. ప్రాజెక్టుకు "జగనన్న పల్లె వెలుగు" గా పేరు మార్చిన ప్రభుత్వం . ఆదేశాలు జారీ చేసిన పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేదీ . ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ కు ఆదేశం.
  • తెలంగాణ లో 27వేల మార్కు దాటిన కరోనా కేసులు. హైదరాబాద్ లో 20వేలకు చేరవలో కేసులు. రాష్ట్రంలో ఈరోజు కరోనా పాజిటివ్ కేసులు 1879. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కేసులు- 27612. జిహెచ్ఎంసి పరిధిలో -1422. Ghmc లో 12,633 కు చేరుకున్న కేసులు. ఈరోజు కరోనా తో 7 మృతి . 313కి చేరిన మరణాలు. చికిత్స పొందుతున్న వారు- 11,012. డిశ్చార్జి అయిన వారు -16287. ఈ రోజు వరకూ రాష్ట్రంలో టెస్టింగ్స్ 128438.
  • రెండో రోజు కొనసాగుతున్న సచివాలయం కూల్చివేత పనులు. భారీ బందోబస్తు మధ్య పనులు.. దారులన్నీ మూసివేత. ఇప్పటికే సీ, హెచ్, జీ బ్లాకులతో పాటు పాత భవనాలు నేలమట్టం. సమాంతరంగా ఇతర బ్లాకుల్లో కూల్చివేత పనులు. మరో మూడు రోజుల్లో కూల్చివేత పూర్తి. శిథిలాల తొలగింపునకు కొన్ని వారాలు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు రూట్ మ్యాప్ ఖరారు. వారం పాటు సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.

‘మహానటి’ కొత్త స్కెచ్.. ‘మిస్ ఇండియా’ అవుతుందా..!

Keerthy Suresh Miss India movie, ‘మహానటి’ కొత్త స్కెచ్.. ‘మిస్ ఇండియా’ అవుతుందా..!

సావిత్రి బయోపిక్‌ పుణ్యమా అని నిన్నటిదాకా మహానటి అని పిలిపించుకునేది కీర్తి సురేశ్‌. కానీ రేపట్నించి తనను మిస్‌ ఇండియా అని పిలవాల్సిందే అనే ధీమా ఇప్పుడు కనబరుస్తోంది ఈ భామ. తాజా సమాచారం ప్రకారం కీర్తి ఖాతాలో ఖతర్నాక్‌ మూవీగా తయారవుతోంది మిస్‌ ఇండియా. కొత్త దర్శకుడు నరేంద్ర నాథ్ దర్శకత్వంలో వస్తున్న మిస్ ఇండియా ఒక మోడల్‌ లైఫ్‌ సర్కిల్‌ నేపథ్యంతో తెరకెక్కుతోందట.

ఇక ఈ సినిమా కోసం ఏకంగా పదికిలోల బరువు తగ్గిందట కీర్తి. ఒక పల్లెటూరి అమ్మాయిగా జర్నీ మొదలై.. తాను అనుకున్న గోల్ రీచ్ అయ్యేవరకూ.. ఐదు విభిన్న పాత్రలలో కీర్తి కనిపించనుందట. మోడల్‌గా ఒకమ్మాయి ప్రొఫెషనల్ గ్రోత్ ఎలా వుంటుంది.. ఆ జర్నీలో భాగంగా
ఆమెలో కనిపించే షేడ్స్‌ ఏంటి..? అనే థీమ్‌తో మిస్ ఇండియా తయారవుతోందట. లుక్స్‌ పరంగా, యాక్టింగ్‌ పరంగా ఇది నెక్ట్స్ లెవల్‌ మూవీ అని నమ్మిన కీర్తి.. అందుకే దర్శకుడు స్క్రిప్ట్ చెప్పిన వెంటనే ఓకే చెప్పి.. అందుకోసం శరీరాన్ని కూడా తగ్గించిందట. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే.. ఈ సినిమాలో భాగంగా ఏకంగా 52 లుక్స్‌ కోసం కీర్తి కసరత్తు షురూ చేసిందట.

ఇక మిస్‌ ఇండియా సినిమా మేజర్‌ పార్ట్‌ షూటింగ్ ఇటీవల యూరప్‌లో పూర్తి అయ్యింది. కేవలం 7 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉండగా.. దాన్ని కూడా హైదరాబాద్‌ సెట్‌లో పూర్తి చేస్తామని యూనిట్ క్లారిటీ నిచ్చేసింది. ఇక ఈ సినిమాను డిసెంబర్‌ మొదటి, రెండు వారాల్లో రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్‌. మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇందులో నవీన్ చంద్ర, జగపతిబాబు, నరేష్, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ మూవీతో పాటు కీర్తి చేతిలో మరిన్ని చిత్రాలున్నాయి. మైదాన్‌ అనే బాలీవుడ్ మూవీలో… నగేష్‌కుకునూర్ డైరెక్షన్‌లో సఖి.. కార్తీక్ సుబ్బరాజ్ సమర్పణలో పెంగ్విన్ మూవీతో పాటు మలయాళ్ మూవీలో నటిస్తోంది ఈ మహానటి.

Related Tags