మన్మధుడితో మహానటి..!

Keerthi Suresh, మన్మధుడితో మహానటి..!

అక్కినేని నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మన్మధుడు 2’. ఈ సినిమా పోర్చుగల్ షెడ్యూల్ పూర్తి చేసుకుని ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ చిత్రంలో సమంతా‌తో పాటుగా కీర్తి సురేష్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వస్తున్నా.. అవి ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యాయి. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన సీన్స్‌ను షూట్ చేస్తున్నాడట దర్శకుడు. అన్నపూర్ణ స్టూడియోస్, వయాకామ్ 18 మూవీస్, ఆనంది ఆర్ట్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *