కీర్తికి అబార్షన్ చేయించిన ‘బాల్‌రెడ్డి’ ఎక్కడ..?

తెలుగు రాష్ట్రాల్లో తాజాగా.. సంచలనం సృష్టించిన కేసులో.. కీర్తి కేస్ ఒకటి. ఈ కేసులో రివీల్ అవుతోన్న ట్విస్ట్‌లకు పోలీసులే షాక్ తిన్నారు. ప్రేమ వలలో పడి.. తల్లిని చంపినందుకు కీర్తి.. ఇప్పుడు జైలు ఊచలు లెక్కపెడుతోంది. ఆమెతో పాటు ఇద్దరు ప్రియుళ్లను అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు. కానీ.. కీర్తి మొదటి.. బాయ్‌ ఫ్రెండ్ బాల్‌రెడ్డి మాత్రం జైలులో కనిపించడం లేదు. కీర్తిని గర్భవతిని చేసి.. అబార్షన్ చేయించిన బాల్ రెడ్డి ఏమైపోయాడు..? జైల్లోనే ఉన్నాడు […]

కీర్తికి అబార్షన్ చేయించిన 'బాల్‌రెడ్డి' ఎక్కడ..?
Follow us

| Edited By:

Updated on: Nov 03, 2019 | 12:57 PM

తెలుగు రాష్ట్రాల్లో తాజాగా.. సంచలనం సృష్టించిన కేసులో.. కీర్తి కేస్ ఒకటి. ఈ కేసులో రివీల్ అవుతోన్న ట్విస్ట్‌లకు పోలీసులే షాక్ తిన్నారు. ప్రేమ వలలో పడి.. తల్లిని చంపినందుకు కీర్తి.. ఇప్పుడు జైలు ఊచలు లెక్కపెడుతోంది. ఆమెతో పాటు ఇద్దరు ప్రియుళ్లను అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు. కానీ.. కీర్తి మొదటి.. బాయ్‌ ఫ్రెండ్ బాల్‌రెడ్డి మాత్రం జైలులో కనిపించడం లేదు. కీర్తిని గర్భవతిని చేసి.. అబార్షన్ చేయించిన బాల్ రెడ్డి ఏమైపోయాడు..? జైల్లోనే ఉన్నాడు అనుకుంటే.. అది పొరబాటే. ఇప్పుడు ఈ అనుమానం తీవ్ర కలకలం రేపుతోంది. బాల్‌రెడ్డి చర్లపల్లి జైలుకు పోలేదని.. చంచల్ గూడా జైలుకు కూడా రాలేదని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. కేవలం శశికుమార్ మాత్రమే జైలులో ఉన్నాడు. అతన్ని మానస బ్యారక్‌కి తరలించారు పోలీసులు. మరి ఇద్దర్నీ అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. ఇందులో ఎంత నిజముందో తేలాలి.

అసలు ఎవరీ బాల్‌రెడ్డి..? కీర్తిని అతను మహబూబ్‌ నగర్‌ హాస్పిటల్‌కే ఎందుకు తీసుకెళ్లాడు. అతని వెనుక ఎవరున్నారు..? అనే సందేహాలన్నీ కలుగుతున్నాయి. కీర్తిపై అత్యాచారం చేసినందుకు గాను పోక్సో కేసులో అరెస్టయిన కీర్తి మొదటి ప్రియుడు నిందితుడు బాల్‌రెడ్డిని రిమాండులో భాగంగా చర్లపల్లికి జైలుకు తరలించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్నేహితుడు శశికుమార్‌తో పాటు బాల్‌రెడ్డిని కూడా చర్లపల్లికి, కీర్తిని చంచల్‌గూడ జైలుకు పంపించామని పోలీసులు చెప్పారు. కానీ.. రెండు జైళ్లలోనూ.. బాల్‌రెడ్డి కనిపించడం లేదు. అసలు బాల్ రెడ్డి ఎక్కడున్నాడు..? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అయితే.. అటు చంచల్‌గూడ మహిళా జైల్లో ఉన్న కీర్తి ప్రవర్తన జైలు అధికారులకు షాక్‌ని ఇస్తుంది. ఆమె అందరితోనూ.. సాధారణంగా మాట్లాడుతూ.. ఏ మాత్రం భయం, బెరుకు లేకుండా వ్యవహరిస్తుందట. అంతేకాకుండా.. జైలు సిబ్బంది, తోటి ఖైదీలతో కూడా కీర్తి.. మామూలుగానే మాట్లాడుతుందట. జైలులో ఎవరేమడిగినా.. ఏమాత్రం తడుముకోకుండా.. వెంటనే సమాధానమిస్తుందట. కీర్తి ప్రవర్తనతో.. పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. దీంతో.. ఆమె మానసిక పరిస్థితిని తెసుకునేందుకు ప్రత్యేక పర్యవేక్షణలో పెట్టారట. ఏదైనా.. తేడాగా అనిపిస్తే.. ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రికి తరలిస్తారని.. జైలు సిబ్బంది చెబుతున్నారు.