తెలంగాణలో సెప్టెంబర్ 6వ తేదీ నుంచి తొలిదశ పల్లె కార్యాచరణ!

సెప్టెంబర్ 6 నుంచి అన్ని గ్రామాల్లో 30 రోజుల పాటు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కార్యాచరణపై మార్గదర్శకం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని పంచాయతీరాజ్ శాఖ అధికారులతో వచ్చే నెల 3న మద్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ లోని తెలంగాణ అకాడమీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలలో తక్కువ వేతనాలతో పనిచేస్తున్న 36వేల […]

తెలంగాణలో సెప్టెంబర్ 6వ తేదీ నుంచి తొలిదశ పల్లె కార్యాచరణ!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 31, 2019 | 7:28 AM

సెప్టెంబర్ 6 నుంచి అన్ని గ్రామాల్లో 30 రోజుల పాటు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కార్యాచరణపై మార్గదర్శకం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని పంచాయతీరాజ్ శాఖ అధికారులతో వచ్చే నెల 3న మద్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ లోని తెలంగాణ అకాడమీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలలో తక్కువ వేతనాలతో పనిచేస్తున్న 36వేల మంది సఫాయి కర్మచారుల వేతనాన్ని రూ.8,500కు పెంచాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. పంచాయతీరాజ్ శాఖలో అన్ని ఖాళీలను భర్తీ చేయడంతో పాటు, కేంద్ర ఆర్థిక సంఘం నిధులకు రాష్ట్ర ప్రభుత్వ నిధులు జత చేసి, నెలకు రూ.339 కోట్ల చొప్పున గ్రామ పంచాయతీలకు విడుదల చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలును పర్యవేక్షించేందుకు గ్రామానికి ఒకరు చొప్పున మండల స్థాయి అధికారులను ఇంచార్జులుగా నియమించాలని కలెక్టర్లను సిఎం ఆదేశించారు. మండల, జిల్లా పరిషత్ లను క్రియాశీలకంగా మార్చేందుకు అవసరమైన సిఫారసులను కలెక్టర్ల నుంచి స్వీకరించి, నిబంధనలు రూపొందించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.

పచ్చదనం, పరిశుభ్రతతో గ్రామాలు వెల్లివిరియాలని, ప్రణాళికా పద్థతిలో గ్రామాల అభివృద్ధి జరగాలని, నియంత్రిత పద్ధతిలో నిధులు వినియోగం జరగాలని, మొత్తంగా విస్తృత ప్రజా భాగస్వామ్యంతో గ్రామాల రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ బృహత్తర లక్ష్యం నెరవేర్చడానికి అవసరమైన ఒరవడి అవడడానికి 30 రోజుల కార్యాచరణ నాంది పలకాలని సిఎం ఆకాంక్షించారు. మొదట 60 రోజుల ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని నిర్ణయించినప్పటినీ, అధికారుల నుంచి వచ్చిన సూచన మేరకు మొదటి దశలో 30 రోజుల పాటు నిర్వహించి, మరో దశ కొనసాగించాలని నిర్ణయించారు. గ్రామాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా చేస్తున్న ఈ ప్రయత్నాన్ని నిరంతరం కొనసాగించాలని నిర్ణయించినట్లు కూడా సిఎం వెల్లడించారు. గ్రామాల్లో అమలు చేయాల్సిన ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికపై శుక్రవారం ప్రగతి భవన్ లో 7 గంటల పాటు సమీక్ష జరిగింది. పలువురు మంత్రులు, కలెక్టర్లు, డిపిఓలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

2 బంతుల్లోనే ఖతం.. కట్‌చేస్తే.. టిక్కెట్ డబ్బులివ్వని పీసీబీ
2 బంతుల్లోనే ఖతం.. కట్‌చేస్తే.. టిక్కెట్ డబ్బులివ్వని పీసీబీ
టీడీపీలో ఆ సీట్లు మార్పున‌కు నిర్ణ‌యం.. బీ ఫారంలు అందజేత అప్పుడే
టీడీపీలో ఆ సీట్లు మార్పున‌కు నిర్ణ‌యం.. బీ ఫారంలు అందజేత అప్పుడే
ఆల్కహాల్‌ ఒక్కటే కాదు.. ఇవి కూడా లివర్‌ను పాడు చేస్తాయి
ఆల్కహాల్‌ ఒక్కటే కాదు.. ఇవి కూడా లివర్‌ను పాడు చేస్తాయి
స్కాట్లాండ్‌లో నీటిలో మునిగి ఇద్దరు తెలుగు స్టూడెంట్స్ మృతి..
స్కాట్లాండ్‌లో నీటిలో మునిగి ఇద్దరు తెలుగు స్టూడెంట్స్ మృతి..
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ కావాలా? ఈ బ్యాంకులు ట్రై చేయండి
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ కావాలా? ఈ బ్యాంకులు ట్రై చేయండి
మీరు సకాలంలో గృహ రుణం చెల్లించకపోతే మీ ఇంటిని ఎన్ని రోజులకు సీజ్‌
మీరు సకాలంలో గృహ రుణం చెల్లించకపోతే మీ ఇంటిని ఎన్ని రోజులకు సీజ్‌
ప్రియదర్శి, నభా నటేష్ మధ్య డార్లింగ్ పంచాయితీ. రీతూవర్మ రియాక్షన్
ప్రియదర్శి, నభా నటేష్ మధ్య డార్లింగ్ పంచాయితీ. రీతూవర్మ రియాక్షన్
వ్యాపారంలో ఇబ్బందులా.. ఈ రోజు సాయంత్రం ఈ చిన్న పరిష్కారం చేయండి
వ్యాపారంలో ఇబ్బందులా.. ఈ రోజు సాయంత్రం ఈ చిన్న పరిష్కారం చేయండి
కేఏ పాల్ ఆస్తులు మరీ అంత తక్కువా..
కేఏ పాల్ ఆస్తులు మరీ అంత తక్కువా..
ఇట్స్ అఫీషియల్.. టిల్లు స్క్వేర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
ఇట్స్ అఫీషియల్.. టిల్లు స్క్వేర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు