Breaking News
  • భారత్ లో కరోనా కల్లోలం 18 లక్షల 55 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 1855746 దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 586298 కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 1230510 దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 38938 దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటలలో 52050 కరోనా కేస్ లు, 803 మంది మృతి
  • తెలంగాణ బీజేపీ కార్యాలయానికి కరోనా ఎఫెక్ట్. కార్యాలయాన్ని సోమవారం వరకు మూసి ఉంచాలని నిర్ణయించిన రాష్ట్ర నాయకత్వం. జాతీయ పార్టీ కీలక నేతలు కరోనా బారిన పడటంతో రాష్ట్ర కార్యాలయంలోకి ఎవరినీ అనుమతించ కూడదని నిర్ణయం.
  • అమరావతి : ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం. 3రాజధాని అంశంపై హైకోర్టు విచారణ. రాజధాని తరలింపుపై స్టే ఇచ్చిన హైకోర్టు. గవర్నర్ గెజిట్ పై స్టే ఇచ్చిన ఏపీ హైకోర్ట్.
  • రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు చట్టాలపై స్టేటస్‌ కో విధించిన హైకోర్టు. యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించిన హైకోర్టు. 10 రోజులపాటు స్టేటస్‌ కో ఉత్తర్వులు కొనసాగుతున్న హైకోర్టు. రెండు బిల్లులకు సంబంధించి ఇదివరకే గెజిట్‌ విడుదల. తదుపరి కార్యకలాపాలపై స్టేటస్‌ కో విధించిన హైకోర్టు.
  • అమరావతి: విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు. కొరియాకు చెందిన సీఈఓ, డైరెక్టర్ సహా మొత్తం 12 మందికి కండిషన్ బెయిల్ ఇస్తూ ఆదేశాలు. స్టెరైన్ గ్యాస్ నిల్వ లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని నమోదైన కేసులో వీరిని అరెస్టు చేసిన విశాఖ పోలీసులు.
  • Ccmb డైరెక్టర్ రాకేష్ మిశ్రా . జర్నల్స్ పై ఫార్మాకంపెనీల వత్తిడిపై ట్విట్టర్లో స్పందించిన Ccmb డైరెక్టర్. సైంటిస్టులు, జర్నల్స్ పై వివిధ ఫార్మాకంపెనీలు వత్తిడి చేయడం సరి కాదు. దైవంలా భావించే జర్నల్స్ మీద ఒత్తిడి సిగ్గుచేటు. ఆర్థికంగా బలమైన ఫార్మా కంపెనీలు తమ పరిశోథన పత్రాలను ప్రచురించమని వత్తిడిచేయడం సరైందికాదు . తమ పరిశోధనలను అంగీకరించమని జర్నల్స్ పై వత్తిడి మంచిది కాదు. ది లాన్సేంట్, ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లు వివిధ కంపెనీల వత్తిడిని బయటపెట్టడం ఆందోళన కల్గిస్తోంది.
  • మరో మూడు కార్పొరేట్‌ ఆస్పత్రులకు కోవిడ్ సేవలు కట్...! హైదరాబాద్ లో కరోనా ట్రీట్ మెంట్ చేస్తున్న మరికొన్ని ఆస్పత్రులకు ఆరోగ్య నోటీసులు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై ప్రభుత్వం యాక్షన్ .

మందుబాబులకు త్వరలో షాక్.. కెసీఆర్ ఏం చేయబోతున్నారంటే ?

kcr shocks liquor babus, మందుబాబులకు త్వరలో షాక్.. కెసీఆర్ ఏం చేయబోతున్నారంటే ?

మందుబాబులకు షాకిచ్చేందుకు కెసీఆర్ ప్రభుత్వం రెడీ అవుతోంది. ఇందుకు గ్రౌండ్ ప్రిపరేషన్ కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. కాకపోతే మునిసిపల్ ఎన్నికల నిర్వహణ ముందుండడంతో నిర్ణయం తీసుకునేందుకు ముఖ్యమంత్రి కెసీఆర్ వెనుకంజ వేస్తున్నట్లు చెబుతున్నారు. ఇంతకీ కెసీఆర్ ఏ విషయంలో మందుబాబులకు షాకివ్వబోతున్నారు ? రీడ్ దిస్ స్టోరీ

తెలంగాణలో ఎక్సైజ్ ఆదాయం బాగానే వుంది. దాన్ని మరింతగా పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే కొత్తగా ఏర్పడిన 73 మునిసిపాలిటీల్లో బార్లకు అనుమతిస్తూ ఉత్తర్వులు రెడీ అయ్యాయి. దాంతో పాటు మరో నిర్ణయం తీసుకోవడం ద్వారా అదనంగా 1300 నుంచి 1700 కోట్ల రూపాయల మేరకు ప్రభుత్వ రాబడిని పెంచడానికి ఎక్సైజ్ శాఖ కసరత్తు చేసింది. దీంట్లో భాగంగా సిద్దమైన ఫైల్ ఇప్పుడు కెసీఆర్ ముందున్నట్లు చెబుతున్నారు.

రాష్ట్రంలో మద్యం ధరలు పెంచే దిశగా ఎక్సైజ్ శాఖ కసరత్తు పూర్తి చేసింది. ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నాలలో భాగంగా మద్యం ధరలను పెంచే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. దీనికి సంబంధించి ముగ్గురు మంత్రులతో కూడిన కేబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేసి మద్యం ధరలను నిర్ధారించే బాధ్యతలను అప్పగించాలని కెసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. సబ్‌కమిటీ ఏర్పాటు త్వరలోనే ఉంటుందని, ఈ కమిటీ సిఫారసులతో సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.

అయితే మద్యం ధరల పెంపు ప్రతిపాదనపై నిర్ణయానికి, మునిసిపల్ ఎన్నికలకు ముడిపడి వుందని తెలుస్తోంది. కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చిన వెంటనే మద్యం ధరల పెంపుపై కొంత కసరత్తు చేసిన ఎక్సైజ్‌ శాఖ అధికారులు ఇప్పటికే పలు రకాల లిక్కర్ ధరలను పది శాతం వరకు పెంచే ప్రతిపాదనలు సిద్ధం చేశారని తెలుస్తోంది. ఈ ప్రతిపాదనను ఆమోదిస్తే ఏటా 1300-1700 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వ ఖజానాకు అదనంగా ఆదాయం వస్తుందని అంచనా. మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలను బట్టి మద్యం ధరల సవరణపై సీఎం నిర్ణయం తీసుకుంటారని ఎక్సైజ్ వర్గాలు అంటున్నాయి. త్వరలోనే ఎన్నికలు వస్తే అవి ముగిసిన తర్వాత లిక్కర్ ధరలను పెంచాలని, మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీలో ఆలస్యం జరిగితే వీలున్నంత త్వరలో నిర్ణయం తీసుకోవాలని కెసీఆర్ యోచిస్తున్నట్టు సమాచారం.

మరోవైపు కొత్త మున్సిపల్‌ చట్టం ద్వారా తెలంగాణలో ఏర్పాటైన 73 కొత్త మున్సిపాలిటీల పరిధిలో కూడా బార్ల ఏర్పాటుకు త్వరలో నోటిఫికేషన్‌ రానుంది. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. కొత్త మునిసిపాలిటీల్లో బార్ల ఏర్పాటు ద్వారా లైసెన్సు ఫీజు రూపంలో ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. సో.. మొత్తానికి ఆర్థికంగా ఇబ్బందుల్లో వున్న తెలంగాణ ఖజానాకు మద్యం ద్వారా ఆదాయం రానుందన్నమాట.

Related Tags