ఆర్టీసీ కార్మికులపై కేసీఆర్ బ్రహ్మాస్త్రం..

టీఎస్ఆర్టీసీ కార్మికుల సమ్మె నిరవధికంగా 43వ రోజుకు చేరుకుంది. అటు కార్మికులు.. ఇటు ప్రభుత్వం ఒక్క మెట్టు కూడా దిగట్లేదు. అంతేకాకుండా ఆర్టీసీ సమ్మెకు పరిష్కారం దొరుకుంటుందనే సూచనలు కూడా కనిపించట్లేదు. ఇదిలా ఉండగా.. ప్రత్యేక రాష్ట్రం కోసం గతంలో 42 రోజుల సకల జనుల సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దాన్ని టీఎస్ఆర్టీసీ స్ట్రైక్ అధిగమించింది. అంతేకాకుండా ఆర్టీసీ చరిత్రలోనే ఇదే అతి పెద్ద సమ్మెగా కూడా నిలిచింది. మరోవైపు ఆర్టీసీ జేఏసీ అశ్వత్థామరెడ్డి.. […]

ఆర్టీసీ కార్మికులపై కేసీఆర్ బ్రహ్మాస్త్రం..
Follow us

|

Updated on: Nov 17, 2019 | 2:54 PM

టీఎస్ఆర్టీసీ కార్మికుల సమ్మె నిరవధికంగా 43వ రోజుకు చేరుకుంది. అటు కార్మికులు.. ఇటు ప్రభుత్వం ఒక్క మెట్టు కూడా దిగట్లేదు. అంతేకాకుండా ఆర్టీసీ సమ్మెకు పరిష్కారం దొరుకుంటుందనే సూచనలు కూడా కనిపించట్లేదు. ఇదిలా ఉండగా.. ప్రత్యేక రాష్ట్రం కోసం గతంలో 42 రోజుల సకల జనుల సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దాన్ని టీఎస్ఆర్టీసీ స్ట్రైక్ అధిగమించింది. అంతేకాకుండా ఆర్టీసీ చరిత్రలోనే ఇదే అతి పెద్ద సమ్మెగా కూడా నిలిచింది.

మరోవైపు ఆర్టీసీ జేఏసీ అశ్వత్థామరెడ్డి.. ‘ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం’ చేయాలనే డిమాండ్‌పై వెనక్కి తగ్గామని.. ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలకు పిలవాలని కోరిన సంగతి విదితమే. కానీ సీఎం కేసీఆర్ మాత్రం ఎక్కడా కూడా స్పందించలేదు. ఇక ఈ సమ్మె ఎటువైపు దారి తీస్తుందన్న ఆందోళన ప్రగతి భవన్ వర్గాల్లో కనిపిస్తోంది.

ఇదిలా ఉండగా కేసీఆర్ మరో అస్త్రాన్ని ఆర్టీసీ కార్మికులపై సంధించడానికి సిద్దమైనట్లు వినికిడి. అదే వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్(వీఆర్‌ఎస్). ఉద్యోగంపై ఆసక్తి లేని వారిని.. 50 ఏళ్ళ పైబడిన వారికి వీఆర్ఎస్ ఇచ్చి పూర్తిగా సెటిల్‌‌ చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోందట. అటు ఇప్పటికే ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడానికి పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్న కేసీఆర్.. వీఆర్ఎస్‌తో దాదాపు 27వేల మందిని సాగనంపాలని ప్లాన్ చేస్తున్నారట.

అయితే సమ్మె యధావిధిగా కొనసాగుతుండటం… అటు హైకోర్టులో విచారణ ఉండడంతో.. వీఆర్‌ఎస్‌ను ఇప్పట్లో అమలు చేసే అవకాశం లేదు. ఇక ఫ్యూచర్‌లో కేసీఆర్ ఒకవేళ దీన్ని అమలు చేస్తే.. ఎఫెక్ట్ ఏమేరకు ఉంటుందో వేచి చూడాలి.