హస్తిన వైపు కేసీఆర్ చూపు.. కార్యాచరణ ఇదే

జాతీయ రాజకీయాలపై గులాబీ బాస్ దృష్టి సారించినట్లు విశ్వసనీయ సమాచారం. తాజాగా బయటకు తెలియకుండా జరుగుతున్న కొన్ని పరిణామాలను పరిశీలిస్తే ఇది నిజమని తేలుతోంది. గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తాను అంటూ, ఫెడరల్ ఫ్రంట్ వేదికను ఏర్పాటు చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే కొన్ని రాష్ట్రాల్లో పర్యటించి పలువురు ప్రాంతీయ నేతలను కలుసుకున్నారు. ఇక తాజాగా జాతీయ పౌరసత్వ అంశాన్ని వ్యతిరేకిస్తూ…. అవసరమైతే జాతీయస్థాయిలో పోరాటానికి రెడీ అన్న కేసీఆర్ అందుకు […]

హస్తిన వైపు కేసీఆర్ చూపు.. కార్యాచరణ ఇదే
Follow us

|

Updated on: Feb 05, 2020 | 5:57 PM

జాతీయ రాజకీయాలపై గులాబీ బాస్ దృష్టి సారించినట్లు విశ్వసనీయ సమాచారం. తాజాగా బయటకు తెలియకుండా జరుగుతున్న కొన్ని పరిణామాలను పరిశీలిస్తే ఇది నిజమని తేలుతోంది. గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తాను అంటూ, ఫెడరల్ ఫ్రంట్ వేదికను ఏర్పాటు చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే కొన్ని రాష్ట్రాల్లో పర్యటించి పలువురు ప్రాంతీయ నేతలను కలుసుకున్నారు. ఇక తాజాగా జాతీయ పౌరసత్వ అంశాన్ని వ్యతిరేకిస్తూ…. అవసరమైతే జాతీయస్థాయిలో పోరాటానికి రెడీ అన్న కేసీఆర్ అందుకు అనుగుణంగానే అంతర్గతంగా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

పార్లమెంట్‌ ఎన్నికల ముందు ఫెడరల్‌ ప్రంట్‌ వేదికపై కేసీఆర్ పలు సార్లు ప్రకటనలు చేశారు. పలు రాష్ట్రాల రాజధానులను సందర్శించి అక్కడి నేతలను కలుసుకున్నారు. ఇప్పుడు మరోసారి పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జాతీయ పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు కేసీఆర్‌ మొదలుపెట్టారు. ఇందుకోసం హైదరాబాద్‌లో సీఏఏను వ్యతిరేకించే పార్టీలతో భారీ బహిరంగసభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇప్పటికే కేసీఆర్ దేశంలో ఉన్న అనేక ప్రాంతీయ పార్టీల నేతలతో టచ్‌లో వున్నట్లు సీఎంవో వర్గాలు చెప్పుకుంటున్నాయి. సీఏఏపై కనిపిస్తున్న వ్యతిరేకతను కేసిఆర్ తన జాతీయ రాజకీయాల్లో ఎంట్రీకి అనుకూలంగా వాడుకోవాలని భావిస్తున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అంఛనా వేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా కొన్ని ఏర్పాట్లు కూడా సిద్ధమవుతున్నాయి. సీఏఏని వ్యతిరేకించే ప్రాంతీయ రాజకీయ పార్టీలతో ఇప్పటికే కేసీఆర్ ఒక దఫా మాట్లాడినట్లు సమాచారం. మమతా బెనర్జీతో పాటు, కుమారస్వామి, స్టాలిన్, ప్రశాంత్ కిషోర్, మాయావతి, అఖిలేష్ యాదవ్‌తో పాటు చాలా మంది నేతలుహైదరాబాద్‌లో కేసీఆర్‌ సమావేశం ఏర్పాటు చేస్తే వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. మరోవైపు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా కొంతమంది జాతీయ నేతలతో ఇదే అంశంపై మాట్లాడుతున్న ట్లు సమాచారం.

పౌరసత్వ చట్టంపై కాంగ్రెస్ పోరాటం చేస్తోంది. అయితే బిజెపి బలం ముందు సరిపోవడం లేదు. మరోవైపు కొద్దికాలంగా రాహుల్ గాంధీపై వస్తున్న నెగిటివ్ టాక్ కాంగ్రెస్ చేస్తున్న ఉద్యమాలకు అడ్డంకిగా మారింది. ఎటు చూసినా కేసీఆర్‌ ఈ అంశాన్ని కేంద్రం తో పోరాడి డీల్ చేస్తారని నమ్ముతున్న వారే ఎక్కువ. కేవలం పౌరసత్వ చట్టం పైనే కాకుండా రాష్ట్రాలపై కేంద్రం చూపిస్తున్న వివక్ష, ఆర్థిక పరమైన అంశాల్లో చేస్తున్న తప్పిదాలు, ఒంటెద్దు పోకడలపై కూడా కేసీఆర్‌ పోరాటానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఫిబ్రవరి చివరి వారం, లేదా మార్చి మొదటి వారంలో కేసీఆర్ జాతీయ సమావేశం నిర్వహిస్తారని సమాచారం. మరి ఆలస్యం చేసిన హిట్ తగ్గుతుందని గులాబీ అధినేత భావిస్తున్నారు. అందుకే బయటకి హడావుడి కనిపించకుండా జాతీయ సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లు కొనసాగిస్తున్నారని అంటున్నారు.