‘కొత్త అసెంబ్లీ’ కోసం.. సుప్రీంకోర్టుకు కేసీఆర్..!

KCR to approach Supreme Court for new assembly in Erramanzil, ‘కొత్త అసెంబ్లీ’ కోసం.. సుప్రీంకోర్టుకు కేసీఆర్..!

‘కొత్త అసెంబ్లీ’ నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ.. సుప్రీంకి వెళ్లాలని ఆలోచిస్తోంది. ఎర్రమంజిల్‌ భవనాలను కూల్చొద్దని.. అది.. వారసత్వ ఆస్తి కట్టడాలని భావించిన హైకోర్టు ఇటీవలే.. ఆ కేసు కొట్టి వేసింది. పాత అసెంబ్లీనే.. కొనసాగించుకోవాలని.. కేసీఆర్‌కు చురకలంటించింది. కొత్త అసెంబ్లీకి సంబంధించి రాష్ట్ర కేబినెట్ తీర్మానాన్ని కూడా రద్దు చేసింది. కాగా.. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్.. నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఈ తీర్పు ఇవ్వడంతో.. ఫుల్ బెంచ్‌కు వెళ్లినా ప్రయోజనం ఉండదని తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయపడింది. దీంతో.. సుప్రీంకోర్టుకు వెళ్లాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఈ విషయంపై నిపుణులతో సీఎం కేసీఆర్ సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం.

KCR to approach Supreme Court for new assembly in Erramanzil, ‘కొత్త అసెంబ్లీ’ కోసం.. సుప్రీంకోర్టుకు కేసీఆర్..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *