Breaking News
  • ఈఎస్‌ఐ స్కామ్‌పై స్పందించిన మంత్రి గుమ్మనూరు జయరాం. చంద్రబాబు ప్రభుత్వం కార్మికులను కూడా దోచుకుంది. గత ప్రభుత్వంలో ఈఎస్‌ఐలో భారీ అవినీతి జరిగింది-జయరాం. అవినీతిపై విజిలెన్స్‌ విచారణకు ఆదేశించాం. అవినీతిపై విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం-జయరాం. అక్రమంగా చెల్లించిన బిల్లుల సొమ్ము రికవరీ చేస్తాం. అవినీతికి పాల్పడిన వారినెవ్వరినీ వదిలిపెట్టం-మంత్రి జయరాం
  • వారిస్‌ పఠాన్‌ వ్యాఖ్యలను వక్రీకరించారు-ఇంతియాజ్‌ జలీల్‌. అలాంటి వ్యాఖ్యలను పార్టీ సమర్ధించదు. వారిస్‌ పఠాన్‌ వ్యాఖ్యలను ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారు. -టీవీ9తో మహారాష్ట్ర ఎంఐఎం ఎంపీ ఇంతియాజ్‌ జలీల్‌.
  • తూ.గో: అన్నవరం ఆలయానికి కొత్త పాలక మండలి నియామకం. 16 మందితో కొత్త పాలక మండలిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.
  • ఏపీ ఈఎస్‌ఐ స్కాంలో వివాదాస్పదమైన అప్పటి మంత్రి పితాని వ్యవహారం. మందుల సరఫరా బిల్లుల చెల్లింపులో మొదట సరఫరా చేసిన వాళ్లకే.. బిల్లులు చెల్లించాలని ఆదేశించిన అప్పటి కార్మికశాఖ కార్యదర్శి. కార్మికశాఖ కార్యదర్శి ఆదేశాలను అడ్డుకున్న పితాని సత్యానారాయణ. తమకు నచ్చిన వాళ్లకే ఇచ్చేలా వ్యవహరించారని పితానిపై ఆరోపణలు.
  • ప్రకాశం: ఒంగోలులో ఏఎన్‌ఎం హైమావతి ఆత్మహత్యాయత్నం. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించిన హైమావతి. హైమావతి పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు. విధుల నుంచి తొలగించడంతో ఆత్మహత్యకు యత్నించిందన్న స్థానికులు. తనను పర్మినెంట్‌ చేస్తామంటూ అపోలో ఏజెన్సీకి చెందిన.. ప్రదీప్‌, గణేష్‌లు రూ.3 లక్షలు తీసుకున్నారని హైమావతి ఆరోపణలు.

కేసీఆర్ పెట్ డాగ్ ‘ హస్కీ ‘ మృతి కేసు.. పోలీసులు ఏమంటున్నారంటే ?

kcr s pet dog death.. police deny rti query because it will impede investigation, కేసీఆర్ పెట్ డాగ్ ‘ హస్కీ ‘ మృతి కేసు.. పోలీసులు ఏమంటున్నారంటే ?

తెలంగాణ సీఎం కేసీఆర్ పెట్ డాగ్ ‘ హస్కీ ‘ మృతి కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ సర్టిఫయిడ్ కాపీ ఇవ్వాలని కోరుతూ ఆర్టీఐ యాక్టివిస్టు ఒకరు చేసిన అభ్యర్థనను బంజారాహిల్స్ పోలీసులు తోసిపుచ్చారు. ఈ వివరాలను వెల్లడిస్తే అది ఈ కేసు దర్యాప్తును నీరు గారుస్తుందని, లేదా ‘ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ ‘ ను ప్రభావితం చేయవచ్చునని వారంటున్నారు. ఇంకా దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రగతిభవన్ లో ఇటీవల హస్కీ అనే పెంపుడు కుక్క మృతికి వెటర్నరీ డాక్టర్ నిర్లక్ష్యమే కారణమని పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. 11 నెలల వయసున్న ఈ శునకం ‘ హల్క్ ‘ బ్రీడ్ కు చెందినది. పిట్ బుల్ కు, బుల్ డాగ్ కు మధ్య బ్రీడ్ వల్ల పుట్టింది ఇది.. గత సెప్టెంబర్ 11 న ఓ వెటర్నరీ డాక్టర్ ఇఛ్చిన ఇంజెక్షన్ కారణంగా ఈ శునకం మృతి చెందినట్టు తెలుస్తోంది. ప్రగతి భవన్ లో పెట్ డాగ్స్ బాగోగులు చూసే ఆసిఫ్ అలీ అనే వ్యక్తి ఇఛ్చిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ డాక్టర్ తో బాటు ప్రయివేటు వెటర్నరీ క్లినిక్ డాక్టర్ ఇంచార్జి నిర్లక్ష్యం కూడా హస్కీ మరణానికి కారణమని ఆయన పేర్కొన్నారు.(ఇంజెక్షన్ వికటించి ఆ కుక్క మరణించినట్టు తెలుస్తోంది). ఈ కేసులో రంజిత్ అనే వెటర్నరీ డాక్టర్ పైన, సంబంధిత క్లినిక్ ఇన్-ఛార్జి డాక్టర్ లక్ష్మీ శీనివాసన్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కేసుకు సంబంధించి వివరాలను వెల్లడించడానికి పోలీసులు ఎందుకు నిరాకరిస్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది.

Related Tags