కొత్త సెక్రెటేరియట్‌పై కేసీఆర్ సరికొత్త ప్లాన్..ఏంటో తెలుసా?

కొత్త రాష్ట్రంలో సరికొత్త అసెంబ్లీ, క్రొంగొత్త సచివాలయం.. ఇలా అత్యంత సుందరంగా హైదరాబాద్ నగరంలో కొత్త పరిపాలనా భవనాలు నిర్మించాలని తలపెట్టిన ముఖ్యమంత్రి కెసీఆర్ ఇప్పుడు ఈ నిర్మాణాలపై కొత్త వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. పాత సచివాలయానికి వాస్తు లేకపోవడం, అదే సమయంలో భవనాలు ఒక ఆర్డర్‌లో లేకపోవడంతో కొత్త సచివాలయ నిర్మాణానికి కెసీఆర్ సర్కార్ పూనుకుంది. అదే సమయంలో అసెంబ్లీ భవనం కూడా పురాతనమైపోయింది. అసెంబ్లీలోను రకరకాల సమస్యలు తాండవిస్తూనే వున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త […]

కొత్త సెక్రెటేరియట్‌పై కేసీఆర్ సరికొత్త ప్లాన్..ఏంటో తెలుసా?
Follow us

|

Updated on: Nov 28, 2019 | 5:55 PM

కొత్త రాష్ట్రంలో సరికొత్త అసెంబ్లీ, క్రొంగొత్త సచివాలయం.. ఇలా అత్యంత సుందరంగా హైదరాబాద్ నగరంలో కొత్త పరిపాలనా భవనాలు నిర్మించాలని తలపెట్టిన ముఖ్యమంత్రి కెసీఆర్ ఇప్పుడు ఈ నిర్మాణాలపై కొత్త వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. పాత సచివాలయానికి వాస్తు లేకపోవడం, అదే సమయంలో భవనాలు ఒక ఆర్డర్‌లో లేకపోవడంతో కొత్త సచివాలయ నిర్మాణానికి కెసీఆర్ సర్కార్ పూనుకుంది.

అదే సమయంలో అసెంబ్లీ భవనం కూడా పురాతనమైపోయింది. అసెంబ్లీలోను రకరకాల సమస్యలు తాండవిస్తూనే వున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త అసెంబ్లీ, కొత్త సచివాలయ నిర్మాణాలకు కెసీఆర్ ప్లాన్ చేశారు. అనుకున్నదే తడవుగా.. ఎర్రమంజిల్‌లోని చీఫ్ ఇంజనీర్ కార్యాలయం వున్న హెరిటేజ్ భవన స్థలంలో కొత్త సచివాలయానికి శంకుస్థాపన కూడా చేసేశారు. ఇక్కడి దాకా దూకుడు ప్రదర్శించిన కెసీఆర్ ప్రభుత్వం ఆ తర్వాత ఆగిపోయింది. కొత్త సచివాలయానికి భూమి పూజ చేసి ఐదు నెలలైంది. కానీ ఇప్పటివరకూ ఒక్క ఇటుక పడలేదు. గుంత తవ్వలేదు. దీంతో సచివాలయ నిర్మాణం ఆగినట్లేనా? అనే ప్రచారం మొదలైంది.

కొత్త సచివాలయం, కొత్త అసెంబ్లీ అనగానే…..వీటికి వ్యతిరేకంగా కొంత మంది కోర్టులో పిటీషన్లు వేశారు. ఎలాంటి కమిటీలు వేయకుండానే ప్రభుత్వం ఆ బిల్డింగ్‌ను హెరిటేజ్ హోదా నుంచి తొలగించడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఓ కమిటీ వేసి నిబంధనల ప్రకారం.. హెచ్ఎండీఏ యాక్ట్ అనుసరించి ఆ హెరిటేజ్ భవనాన్ని తొలగించే అవకాశం ఉంది… అయినా ఇంతవరకూ దానిపై ప్రభుత్వం ముందడుగు వేయలేదు. హెరిటేజ్ భవనంపై కేసులు ఇప్పట్లో తేలేవి కావని కెసీఆర్‌కు తెలుసు. అందుకే తాజాగా కెసీఆర్ మరో ఆలోచన చేస్తున్నారని సమాచారం.

సచివాలయం, అసెంబ్లీ, కౌన్సిల్ నిర్మాణాలన్నీ బెంగుళూరు మాదిరిగా ఒకేచోట కడితే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. సికింద్రాబాదులోని పరేడ్ గ్రౌండ్స్, బైసన్ పోలో గ్రౌండ్స్ కావాలని ఇంకా కేంద్రాన్ని కోరుతూ ఉంది తెలంగాణ ప్రభుత్వం. కేంద్రం రక్షణ శాఖ భూములను కేటాయిస్తే అక్కడే నిర్మాణాలన్నీ చేయాలని ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అందుకోసమే అసెంబ్లీ నిర్మాణంలో ముందడుగు వేయడం లేదని సమాచారం.

రక్షణశాఖ భూములు ఇస్తే అక్కడే నిర్మాణం చేయాలని తాజాగా ఆలోచిస్తోంది. ఈ కార్యాచరణతోనే ఇటీవల రాష్ట్ర మంత్రి కెటీఆర్ ఢిల్లీలో నాలుగు రోజుల పాటు మకాం వేసి, పలువురు కేంద్ర మంత్రులను కలిసినట్లు చెబుతున్నారు. ఏదిఏమైనా ఎక్కడ నిర్మాణం జరిగినా కొత్త అసెంబ్లీ, కొత్త సచివాలయాలను చూడాలంటే మరికొన్ని ఏళ్లు ఆగాల్సిందే అంటున్నాయి అధికార వర్గాలు.