మోదీతో కెసీఆర్ భేటీ… కోర్కెల జాబితాలో ఏముందో తెలుసా ?

దాదాపు తొమ్మిది నెలల తర్వాత భారత ప్రధాని నరేంద్రమోదీని కలిశారు తెలంగాణ సీఎం కె.సీ.ఆర్. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత బిజెపితో దూరం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో బిజెపి అధిష్టానంతో ఒకింత దూరం మెయింటేన్ చేసిన గులాబీ బాస్.. ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర ప్రయోజనాల కోసం సుదీర్ఘ కాలం తర్వాత నరేంద్ర మోదీతో భేటీ అవడంపై చర్చ జోరుగానే సాగింది. గురువారం సాయంత్రం ఢిల్లీ వెళ్ళిన కెసీఆర్.. శుక్రవారం సాయంత్రం మోదీతో  ఒక గంటకు పైగా కెసిఆర్ […]

మోదీతో కెసీఆర్ భేటీ... కోర్కెల జాబితాలో ఏముందో తెలుసా ?
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 04, 2019 | 10:12 PM

దాదాపు తొమ్మిది నెలల తర్వాత భారత ప్రధాని నరేంద్రమోదీని కలిశారు తెలంగాణ సీఎం కె.సీ.ఆర్. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత బిజెపితో దూరం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో బిజెపి అధిష్టానంతో ఒకింత దూరం మెయింటేన్ చేసిన గులాబీ బాస్.. ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర ప్రయోజనాల కోసం సుదీర్ఘ కాలం తర్వాత నరేంద్ర మోదీతో భేటీ అవడంపై చర్చ జోరుగానే సాగింది. గురువారం సాయంత్రం ఢిల్లీ వెళ్ళిన కెసీఆర్.. శుక్రవారం సాయంత్రం మోదీతో  ఒక గంటకు పైగా కెసిఆర్ భేటీ అయ్యారు.

ఇటీవలి  అమెరికా పర్యటన సందర్భంగా మోదీ చూపిన దౌత్య విధానాన్ని కెసీఆర్ ప్రశంసించారని సమాచారం. అనంతరం తెలంగాణ ప్రయోజనాల దృష్ట్యా 23 అంశాలతో కూడిన వినతి పత్రాన్ని ప్రధానికి కెసీఆర్ అందజేసి.. సత్వర న్యాయం చేయాలని మోదీని కోరారు. కెసీఆర్ అందజేసిన వినతి పత్రంలోని ముఖ్యాంశాలు :

1. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణలో వెనుకబడిన జిల్లాలకు 450 కోట్లు – 5 వ విడత సహాయం విడుదలకు వినతి.

2. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సహాయంతో ఆదిలాబాద్ జిల్లా సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పునరుద్ధరించాలని వినతి.

3. తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 24 నుండి 42 వరకు పెంచాలన్న గత అభ్యర్థనపై సత్వరం స్పందించాలని వినతి.

4. తెలంగాణలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) ఏర్పాటు చేయాలని వినతి.

5. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER)కు అనుమతినివ్వాలని వినతి.

6. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ జిల్లాల్లో 23 జవహర్ నవోదయ విద్యాలయాల (జెఎన్‌వి) మంజూరు చేయాలని వినతి.

7. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టుల పనులు పూర్తి చేసేందుకు నిధుల విడుదలలో వేగం పెంచాలని వినతి.

8. ఎన్‌ఐటిఐ ఆయోగ్ సిఫారసు చేసిన మిషన్ కాకతీయకు రూ .5000 కోట్లు, మిషన్ భగీరథిలకు రూ. 19205 కోట్ల ఆర్థిక సహాయం చేయాలని వినతి.

9. ఖమ్మం జిల్లాలోని బయ్యారం వద్ద స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని వినతి.

10. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ వద్ద జాతీయ పెట్టుబడి మరియు తయారీ జోన్ (నిమ్జెడ్) కోసం నిధుల విడుదల చేయాలని వినతి.

11. హైదరాబాద్‌లో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్‌ఐడి) ఏర్పాటు చేయాలని వినతి.

12. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీల ఉప వర్గీకరణ జరపాలని వినతి.

13. కరీంనగర్‌లో పిపిపి మోడల్ కింద ఐఐఐటి మంజూరు చేయాలని వినతి.

14. ఉపాధి మరియు విద్యలో BC లకు రిజర్వేషన్లు (బిసి 37%, ఎస్సీ 15%, ఎస్టీ 10%) పెంచాలని వినతి.

15. పార్లమెంటు, శాసనసభలలో OBCలకు, మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని వినతి.

16. హైదరాబాద్ అభివృద్ధి – నాగ్‌పూర్ & వరంగల్-హైదరాబాద్ పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేయాలని వినతి.

17. పిఎమ్‌జిఎస్‌వై (ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన) కింద వెనుకబడిన ప్రాంతాల్లో మెరుగైన కనెక్టివిటీ కోసం 4000 కిలోమీటర్ల మేర అప్‌గ్రేడ్ చేయడానికి నిధుల కేటాయించాలని వినతి.

18. లెఫ్ట్ వింగ్ తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ వర్క్స్: 60:40 నిష్పత్తికి బదులుగా పూర్తి ఖర్చును కేంద్రమే భరించాలని వినతి.

19. వరంగల్ గిరిజన విశ్వవిద్యాలయాన్ని సెంట్రల్ యూనివర్శిటీగా అప్ గ్రేడ్ చేసి పూర్తి నిధులు కేంద్రమే భరించాలని వినతి.

20. వరంగల్ టెక్స్‌టైల్ పార్కుకు ఒక సారి గ్రాంట్-ఇన్-ఎయిడ్ రూ .1000 కోట్లు మంజూరు చేయాలని వినతి.

21. రామప్ప ఆలయం- ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించి అభివృద్ది చేయాలని వినతి.

22. వరద ప్రవాహ కాలువ – సవరించిన వ్యయాన్ని ఆమోదించాలని వినతి.

23. కంటోన్మెంట్ ప్రాంతంలో సెక్రటేరియట్ భవనం మరియు రహదారుల వెడల్పు కోసం రాష్ట్ర ప్రభుత్వ భూములతో రక్షణ భూముల మార్పిడికి అమోదం తెలిపాలని వినతి.

ముఖ్యమంత్రి కెసీఆర్ ఇచ్చిన వివరణలతో సంతృప్తి చెందిన ప్రధాని మోదీ.. వాటిని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు తెలంగాణ సీఎంవో తెలిపింది.

తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
రాత్రుల్లో రావి చెట్టుపై దుష్టశక్తులు నివసిస్తాయా.. నిజం ఏమిటంటే.
రాత్రుల్లో రావి చెట్టుపై దుష్టశక్తులు నివసిస్తాయా.. నిజం ఏమిటంటే.
సందీప్ హీరోయిన్లను మెచ్చుకున్న మానుషి చిల్లర్.! రష్మిక vs కియారా.
సందీప్ హీరోయిన్లను మెచ్చుకున్న మానుషి చిల్లర్.! రష్మిక vs కియారా.
అవన్నీ బోగస్‌.. అప్పులు తెచ్చుకోవడం బడ్జెట్‌లో భాగమే: కేసీఆర్‌..
అవన్నీ బోగస్‌.. అప్పులు తెచ్చుకోవడం బడ్జెట్‌లో భాగమే: కేసీఆర్‌..
బాబోయ్.. ఫరియా ఆలోచనకు హాట్యాఫ్ చెప్పాల్సిందే..
బాబోయ్.. ఫరియా ఆలోచనకు హాట్యాఫ్ చెప్పాల్సిందే..
కొన్నిదేశాల్లో విచిత్ర నియమాలు.. సమోసా, కెచప్ తినలేరు..
కొన్నిదేశాల్లో విచిత్ర నియమాలు.. సమోసా, కెచప్ తినలేరు..