బీజేపీలోకి చేరికలు.. అంతా మన మంచికే అంటోన్న కేసీఆర్..?

KCR not afraid of leaders joining BJP, బీజేపీలోకి చేరికలు.. అంతా మన మంచికే అంటోన్న కేసీఆర్..?

పాలిటిక్స్ లో ఇతర పార్టీల్లో చేరికలు పెరిగుతుంటే పక్క పార్టీల వాళ్లు భయపడుతుంటారు. అయితే ఇందుకు సీన్ రివర్స్ గా కనిపిస్తోంది టీఆర్ఎస్ నేతల వ్యూ. కమలం పార్టీలో చేరికలను పట్టించుకోవద్దని కొత్త థియరీచెప్పారట కేసీఆర్. దీంతో ఇప్పుడు వాళ్ల లెక్కలు వాళ్లకుంటే తమ లెక్కలు తమకున్నాయంటున్నారట గులాబీ పార్టీ లీడర్లు.ఇంతకీ జంప్ జిలానీలపై గులాబీ బాస్ చెప్పిన థియరీ ఎంటీ..?

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ప్లాన్ లో ఉంది బీజేపీ. వరుసగా రెండు సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన కమలం నేతలు తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ చేశారు. పార్టీ చేరికలతో అటు ఏపీ ఇటు తెలంగాణలో బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అసెంబ్లీ ఫలితాలు నిరాశపరిచినా..తెలంగాణ నలుగురు ఎంపీలు గెలవడంతో తెలంగాణపై చాలా ఆశలు పెట్టుకుంది కమలం పార్టీ హైకమాండ్.

అయితే బీజేపీలో చేరికలు గులాబీ పార్టీ నేతలను కొంత కలవరానికి గురిచేస్తున్నాయి. గులాబీబాస్ మాత్రం ఏం జరిగినా అది మన మంచికేనంటున్నారట.సిద్దాంతపరమైన పార్టీలో ఇమ్మడలేక మళ్లీ వాళ్లంతా బయటకు వస్తారని అన్నారట కేసీఆర్. అంతేకాదు గతంలో వెళ్లిన నాగం జనార్ధన్ రెడ్డి పరిస్థితి అంతేనని…అందేకే చేరికలపై టెన్షన్ పడకుండా మున్సిపాలిటీ ఎన్నికలపై ఫోకస్ చేయాలని సూచించారట కేసీఆర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *