తగ్గనంటోన్న కేసీఆర్.. ఆర్టీసీ తరువాత ఆ విభాగంలో ప్రక్షాళన మొదలు

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ.. తెలంగాణాలోని ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. వారి సమ్మె ఇవాళ్టితో నాలుగోరోజుకు చేరుకుంది. దీంతో పలు బస్టాప్‌లు నిర్మానుష్యంగా మారగా.. ప్రయాణికుల ఇక్కట్లు కొనసాగుతున్నాయి. అయితే  కార్మికుల సమ్మెపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేసీఆర్.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేది లేదని కుండబద్ధలు కొట్టి చెప్పారు. అలాగని ప్రైవేటీకరణ కూడా చేయబోమని కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే మొదటి సారి అధికారంలోకి వచ్చినప్పుడు ఎవరు […]

తగ్గనంటోన్న కేసీఆర్.. ఆర్టీసీ తరువాత ఆ విభాగంలో ప్రక్షాళన మొదలు
Follow us

| Edited By:

Updated on: Oct 08, 2019 | 11:02 AM

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ.. తెలంగాణాలోని ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. వారి సమ్మె ఇవాళ్టితో నాలుగోరోజుకు చేరుకుంది. దీంతో పలు బస్టాప్‌లు నిర్మానుష్యంగా మారగా.. ప్రయాణికుల ఇక్కట్లు కొనసాగుతున్నాయి. అయితే  కార్మికుల సమ్మెపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేసీఆర్.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేది లేదని కుండబద్ధలు కొట్టి చెప్పారు. అలాగని ప్రైవేటీకరణ కూడా చేయబోమని కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే మొదటి సారి అధికారంలోకి వచ్చినప్పుడు ఎవరు ఏం అడిగినా కాదనకుండా ఇచ్చిన కేసీఆర్.. రెండోసారి టర్మ్‌లోకి వచ్చినప్పుడు మాత్రం కఠినంగా వ్యవహరిస్తున్నారు. 2014లో ఆర్టీసీ సిబ్బంది అడిగిన దాని కంటే ఎక్కువగా 44 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిన సీఎం.. ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెను తీవ్రంగా పరిగణిస్తున్నారు.

కాగా ఆర్టీసీని లాభాల్లోకి తీసుకురావాలని, సంస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలని కేసీఆర్ ఫిక్స్ అయ్యారట. దీంతో ఎవరి మాట వినేందుకు కేసీఆర్ సిద్ధంగా లేరని ఆయన తీరును చూస్తే అర్థం అవుతోంది. ఈ క్రమంలోనే విధులకు రాని ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించేలా ఆయన కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు కేసీఆర్ నెక్ట్స్ టార్గెట్ రెవెన్యూ విభాగం, వీఆర్వోలేనని తెలుస్తోంది. వీఆర్వోల వ్యవస్థపై సీఎం చాలా సార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. అవసరమైతే వీఆర్వీలను లేకుండా చేస్తామని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ఓ ప్రకటన చేశారు. ఈ క్రమంలో రెవెన్యూ వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్న కేసీఆర్.. ఆర్టీసీ సమస్య ఓ కొలిక్కి వచ్చాక.. ఆ విభాగంపై ఫోకస్ పెట్టే అవకాశాలున్నాయి. అలాగే కొత్త మున్సిపల్ చట్టం ద్వారా మున్సిపల్ సిబ్బందికి కూడా సీఎం షాకిచ్చే అవకాశాలు ఉన్నాయని కొందరి అభిప్రాయం. మొత్తానికి ప్రజలకు మేలు చేకూర్చడం కోసం, వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయడం కోసం త్వరలో కేసీఆర్ కఠిన నిర్ణయాలు తీసుకోవడం మాత్రం ఖాయమని ఆయన తాజా చర్యల వలన అర్థమవుతోంది.

30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు