Breaking News
  • వినియోగదారులను మోసం చేస్తున్న అమెజాన్ డెలివరీ బాయ్ అరెస్ట్. ఆన్ లైన్ లో మొబైల్ ఫోన్ బుక్ చేసుకున్న వినియోగదారుడిని మోసగించే యత్నంలో దొరికిపోయిన డెలివరీ బాయ్. ఆర్డర్ క్యాన్సిల్ అయ్యిందని, రిఫండ్ వస్తుందని వినియోగదారుడి చెప్పిన డెలివరీ బాయ్. ఖాతాలో చూస్తే సెల్ ఫోన్ డెలివరీ అయినట్టుగా చూపించడంతో ఫిర్యాదు చేసిన కస్టమర్. డెలివరీ బాయ్ ను అరెస్టు చేసి సెల్ ఫోన్ రికవరీ చేసుకున్న ఢిల్లీ పోలీసులు.
  • డేంజర్‌లో ఫాక్స్‌ సాగర్‌: కట్ట తెగితే 70 వేల కుటుంబాలకు ముప్పు. ప్రమాదంలో మిరాలం: చెరువు తెగితే జూపార్క్‌కు పొంచివున్న ముప్పు. ఫిర్జాదిగూడ: నగరంలో అత్యధికంగా నీట మునిగిన కాలనీ ప్రాంతం. వంద చెరువులు నిండాయి: 185 చెరువుల్లో వందకుపైగా చెరువుల్లో గరిష్టస్థాయికి చేరిన నీరు. నీటి ముంపులో వంద కాలనీలు: ఇంకా నీటి ముంపులో వంద కాలనీలు, 800 కాలనీలకు వరద ఎఫెక్ట్. మూసీ పుట్టుక స్థానం: వికారాబాద్‌ బుగ్గ రామలింగేశ్వరస్వామిలో మూసి శాంతించాలంటూ పూజలు. కొండెక్కిన కూరగాయలు: పండుగ పూట పెరిగిన కూరగాయల ధరలు. వ్యాక్సిన్‌ వచ్చేది ఎప్పుడు: వ్యాక్సిన్‌ వచ్చేదాకా జాగ్రత్తలు అవసరమన్న ప్రధాని, ఏ వ్యాక్సిన్‌ ఏ దశలో ఉంది. రోగ్‌ ప్లానెట్‌: విశ్వంలో సంచారగ్రహం భూమి కంటే పెద్దది, మరింత లోతుగా అధ్యయనం. ఆధిక్యంలో ట్రంప్‌: జో బిడెన్‌పై 2 శాతం పైగా ఆధిక్యతను ప్రదర్శిస్తున్న డొనాల్డ్ ట్రంప్‌.
  • విజయవాడ : ఏపీ నుంచి హైదరాబాద్‌కు ఆర్టీసీ బస్సులు ఇప్పట్లో లేనట్లే. రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదరకపోవడంతో దసరాకు నో సర్వీసు. సంక్రాంతికి నాటికైనా ఒప్పందం కుదిరేనా?. హైద్రాబాద్ నుండి ఆంధ్రకు రేట్లు పెంచి దండుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు. ప్రజా రవాణా లేక ఇక్కట్లు పడుతున్న పబ్లిక్.
  • 76 లక్షల 51 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య . గడచిన 24 గంటలలో 54,044 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. .గడచిన 24 గంటలలో దేశంలో “కరోనా” వల్ల మొత్తం 717 మంది మృతి . గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్ఛార్జ్ అయిన వారి సంఖ్య 61,775 .దేశంలో ఇప్పటివరకు నమోదయిన “కరోనా” పాజిటివ్ కేసుల సంఖ్య 76,51,107 .దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 7,40,090 .“కరోనా” కు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 67,95,103 .“కరోనా” వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,15,914 . దేశంలో 88.81 శాతం కరోనా రోగుల రికవరీ రేటు . దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 9.67 శాతం . దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.51 శాతానికి తగ్గిన మరణాల రేటు . గడచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా టెస్ట్ ల సంఖ్య 10,83,608 . ఇప్పటి వరకు దేశంలో నిర్వహించిన మొత్తం కరోనా టెస్ట్ ల సంఖ్య 9,72,00,379.
  • విజయవాడ : ఏపీలో సంచలనం సృష్టించిన మహేష్ హత్య కేసులో ముగ్గురి అరెస్ట్. హైదరాబాద్ కు చెందిన సాకేత్ రెడ్డి, గంగాధర్, విజయవాడకు చెందిన ఓ ఆటో డ్రైవర్ కలిసి హత్య చేసినట్లుగా గుర్తింపు. తెనాలిలో ఒక చిన్నారిని కిడ్నాప్ చేసేందుకు స్కెచ్ వేసిన తెనాలికి చెందిన సందీప్ అనే యువకుడు. డబ్బు కోసం చిన్నారిని కిడ్నాప్ చేసేందుకు హైదరాబాదు నుండి విజయవాడ వచ్చిన సాకేత్ రెడ్డి. విజయవాడలో సాకేత్ రెడ్డి రెండు రోజుల బస. మద్యం తాగేందుకు గంగాధర్ తో కలిసి ఒక ఆటో డ్రైవర్ సహాయంతో నున్న వెళ్లిన సాకేత్ రెడ్డి. నున్నలో నిర్మాణుష ప్రాంతంలో అక్కడే మహేష్, అతని స్నేహితులు మద్యం తాగుతుండగా ఇరు గ్రూపుల మధ్య తలెత్తిన వివాదం. గొడవకు ముందు సాకేత్ రెడ్డి అనే వ్యక్తిపై పోలీస్ డిపార్ట్మెంట్ అంటూ దురుసుగా ప్రవర్తించిన మహేష్. మహేష్ దూకుడుతో రెచ్చిపోయిన సాకేత్ రెడ్డి, మరో ఇద్దరు. గొడవ పడుతుండగా పిస్టల్ తో మహేష్ కాల్పులు జరిపిన సాకేత్ రెడ్డి. కాల్పుల ఘటనలో స్పాట్లో మహేష్ మృతి, మహేష్ స్నేహితుడు హరికృష్ణకు, సాకేత్ రెడ్డి స్నేహితుడు గంగాధర్ కు స్వల్ప గాయాలు. మహేష్ మృతి తర్వాత గుంటూరుకు పరారైన నిందితులు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి కీలక విషయాలు రాబట్టిన పోలీసులు. ఈ ఘటనపై ఇంకా విచారణ కొనసాగుతుందన్న సీపీ శ్రీనివాసులు. ఇంకొందరినీ ఈ ఘటనలో అరెస్టు చేసే అవకాశం. ఈ ఘటనలో పిస్టల్ స్వాధీనం. హైదరాబాదులో ఒక హోటల్ యజమానిని హత్య చేసేందుకు బీహార్ నుండి సాకేత్ రెడ్డి పిస్టల్ ‌కొనుగోలు చేసినట్లుగా గుర్తించిన పోలీసులు.
  • విజయ్‌ సేతుపతి నువ్వు చాలా ధైర్యవంతుడివి.. అలాగే ఉండూ. నీ కుటుంబానికి బెదిరింపులు రావటం దారుణం. ఈ పని చేసిన వారిని పట్టుకొని కఠినంగా శిక్షించాలి. ఈ సమయంలో మేం నీకు అండగా ఉంటాం: ఖుష్బూ.
  • ఎఫ్‌ 2 సినిమాకు జాతీయ స్థాయి అవార్డ్‌. ఫీచర్‌ ఫిలిం కేటగిరిలో అవార్డు సాధించిన ఎఫ్‌ 2. వెంకటేష్‌, వరుణ్‌ తేజ్ హీరోగా తెరకెక్కిన కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌. దిల్ రాజు నిర్మాత, అనిల్ రావిపూడి దర్శకుడు. 50వ ఇండియన్‌ పనోరమాలో ప్రదర్శించిన 'ఎఫ్ 2'.

యాసంగి పంటలపై కేసీఆర్ కీలక సందేశం

KCR message on Rabi crops, యాసంగి పంటలపై కేసీఆర్ కీలక సందేశం

KCR message on Rabi crops:  తెలంగాణవ్యాప్తంగా వచ్చే యాసంగిలో ఏ ఏ పంటలు వేయాలనే విషయంపై ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు కీలక సందేశం విడుదల చేశారు. ఖరీఫ్ సీజన్‌లో ప్రభుత్వం చెప్పిన పంటలనే వేసి రైతాంగం చక్కటి ఫలితాలు సాధించిందని, వచ్చే యాసంగి సీజన్‌లోను అదే ఒరవడిని కొనసాగించాలని ఆయన రైతులకు సూచించారు. 2020-21 యాసంగి సీజన్‌లో 50 లక్షల ఎకరాల్లో వరిపంట, మరో 15 లక్షల ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేయాలని ముఖ్యమంత్రి రైతులకు నిర్దేశించారు. జిల్లాల వారీగా, మండలాల వారీగా, క్లస్టర్ల వారీగా ఏ పంటలు వేయాలనే విషయంలో వ్యవసాయ అధికారులు స్థానికంగా రైతులకు సూచించాలని కోరారు.

యాసంగిలో అమలు చేయాల్సిన నిర్ణీత పంటల సాగు విధానంపై ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఇటీవల జరిగిన వ్యవసాయాధికారుల సమావేశంలో నిర్ణీత పంటల సాగుపై జిల్లాల వారీగా ప్రతిపాదనలు ఇవ్వాలని సీఎం కోరారు. ఆయన ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ అధికారులు క్లస్టర్లు, మండలాలు, జిల్లాల వారీగా యాసంగిలో సాగు చేసే పంటల సాగుపై అంచనాలు రూపొందించారు. దీనిపై గురువారం నాటి సమావేశంలో విస్తృతంగా చర్చించి, ఏ పంట ఎంత మేరకు సాగు చేయాలనే విషయంలో తుది నిర్ణయం తీసుకున్నారు.

వరి పంటను 50 లక్షల ఎకరాల్లో, శనగ 4.5 లక్షల ఎకరాల్లో, వేరుశనగ 4 లక్షల ఎకరాల్లో, మిరపతో పాటు ఇతర కూరగాయలు లక్షన్నర నుంచి రెండు లక్షల ఎకరాల్లో, జొన్న లక్ష ఎకరాల్లో నువ్వులు లక్ష ఎకరాల్లో, పెసర్లు 50 నుంచి 60 వేల ఎకరాల్లో, మినుములు 50 వేల ఎకరాల్లో, పొద్దు తిరుగుడు 30-40 వేల ఎకరాల్లో, ఆవాలు-కుసుమలు-సజ్జలు లాంటి పంటలు మరో 60 నుంచి 70 వేల ఎకరాల్లో సాగు చేయాలని నిర్ణయించారు. ఈ పంటలకు సంబంధించిన విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉంచినట్లు సీఎం వెల్లడించారు.

వ్యవసాధికారులు సూచించిన మేరకు రైతులు పంటలు సాగు చేయాలని, తద్వారా మంచి ధర పొందాలని సీఎం పిలుపునిచ్చారు. నిర్ణీత పంట సాగు విధానం నిరంతర ప్రక్రియగా జరగాలని సీఎం చెప్పారు. క్లస్టర్ల వారీగా, మండలాల వారీగా, జిల్లాల వారీగా పంట సాగు లెక్కలతో కార్డులు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఒక సీజన్ లో విత్తనాలు వేయడం ముగియగానే, వ్యవసాయ శాఖ మరో సీజన్ లో ఏ పంటలు వేయాలనే విషయంలో కార్యాచరణ ప్రారంభించాలని కేసీఆర్ నిర్ధేశించారు. ఈ విషయంలో రైతుబంధు సమితులు క్రియాశీల పాత్ర పోషించాలని కోరారు.

దసరా పండుగ నాటికి చాలా వరకు రైతు వేదికల నిర్మాణం పూర్తవుతుందని, వాటి ద్వారా రైతులను సంఘటిత పరిచి, సమన్వయ పరచడం సులభం అవుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. ‘‘ ఏ కొత్త విధానమయినా, ఎవరికయినా ఒక్క రోజుతో, ఒక్క ప్రయత్నంతో అలవాటుకాదు.. నిరంతర ప్రక్రియ ద్వారా మాత్రమే నూతన విధానం అలవడుతుంది.. రైతులకు కూడా, వారికి లాభం జరుగుతుందనే విషయాన్ని ఒకటికి నాలుగు సార్లు అర్థం చేయిస్తే అవగాహన, చైతన్యం పెరుగుతాయి ’’ అని సమీక్షలో సీఎం వ్యాఖ్యానించారు.

మక్కల సాగు వద్దే వద్దు

మక్కల ధర, మార్కెట్ విషయంలో అనిశ్చితి నెలకొన్నందున మక్క పంట వేయకపోవడమే శ్రేయస్కరమని సమావేశంలో అధికారులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పరంగా కూడా మక్కల సాగు వద్దనే రైతులకు సూచన చేయడం ఉత్తమమని అధికారులు చెప్పారు. మక్కలకు 900 రూపాయలకు మించి ధర వచ్చే అవకాశం లేదని వారు అంచనా వేశారు. మక్కలు వేస్తే మంచి ధర వచ్చే అవకాశం లేదు కాబట్టి, మక్కల సాగు విషయంలో రైతులే నిర్ణయం తీసుకోవాలని సీఎం కోరారు. మక్కల సాగు వద్దు అనేదే ప్రభుత్వ సూచన అని, అయినప్పటికీ ఎవరైనా రైతులు మక్కలు సాగు చేయాలని భావిస్తే అది వారి రిస్క్ అని సీఎం స్పష్టం చేశారు. ఎంత ధర వస్తే అంతకే అమ్ముకుంటామనుకునే రైతులే మక్కలు పండించుకోవాలన్నారు.

Also read: తెలంగాణ వాతావరణంపై తాజా బులెటిన్

Also read:    నవంబర్ 2 నుంచి ఏపీలో స్కూళ్ళు రీ-ఓపెన్

Also read: ఎట్టకేలకు ముహూర్తం.. రేపే ప్రారంభం

Also read: 15 ఏళ్ళ అమ్మాయిపై 22 రోజులపాటు అఘాయిత్యం

Also read: ఆసియాలో అతిపొడవైన టన్నెల్: తొలి బ్లాస్టింగ్ చేసిన గడ్కరీ

Also read: సోనుసూద్‌కు అరుదైన అవకాశం.. దానికి గుర్తింపుగానే!

Also read: కరోనా వాక్సిన్… క్లినికల్ ట్రయల్స్‌లో కీలక మార్పు

Also read: సముద్రంలో బోటు గల్లంతు

 

Related Tags