కన్నెపల్లి పంప్‌ హౌస్ ప్రారంభించిన కేసీఆర్

YS Jagan Mohan Reddy inaugurates Kannepalli Pump House, కన్నెపల్లి పంప్‌ హౌస్ ప్రారంభించిన కేసీఆర్

కాళేశ్వర మహోజ్వల ఘట్టం ఆవిష్కరణ కార్యక్రమం పూర్తైంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన కేసీఆర్.. ఈ ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేశారు. అనంతరం కన్నెపల్లికి వెళ్లిన కేసీఆర్ పంప్‌హౌస్‌ను ప్రారంభించారు. పంప్‌హౌస్ ప్రారంభోత్సవానికి ముందు పూర్ణాహుతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన ఏపీ సీఎం జగన్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌లతో పాటు గవర్నర్ కూడా కేసీఆర్ వెంట ఉన్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో తెలంగాణ రైతుల నీటి కష్టాలు కొంత మేర తీరనున్నాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాలను వీలైనంత ఎక్కువగా నిల్వచేసుకునే వెసులుబాటు ఉంటుంది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *