చిన్నజీయర్ స్వామిని కలిసిన సీఎం కేసీఆర్

KCR in talks with Chinjeeyar Swamy over Yadadri temple opening, చిన్నజీయర్ స్వామిని కలిసిన సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్.. త్రిదండి చినజీయర్ స్వామిని కలిశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలంలోని ముచ్చింతల్‌ ఆశ్రమానికి వెళ్లిన సీఎంకు.. అక్కడి నిర్వాహకులు సాదరంగా ఆహ్వానించారు. కేసీఆర్ వెంట ఎంపీ సంతోష్‌కుమార్‌, మై హోం అధినేత రామేశ్వరరావు కూడా ఉన్నారు. యాదాద్రి పునర్నిర్మాణం జరిగిన తీరును, ఆలయ పరిసరాల అభివృద్ధి గురించి కేసీఆర్.. స్వామిజీకి వివరించారు. త్వరలో ఆలయ ప్రారంభం, విగ్రహ ప్రతిష్టాపనకు ముహూర్తానికి సంబంధించిన విషయాలపై భేటీలో చర్చించారు. మరోవైపు.. ముచ్చింతల్‌లో ఏర్పాటు చేసిన భారీ రామానుజాచార్యుల విగ్రహ ప్రారంభోత్సవం కూడా ఉంది. వీటన్నింటికి సంబంధించి కేసీఆర్, జీయర్ చర్చించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *