Breaking News
  • విశాఖలో లైట్‌మెట్రోకు డీపీఆర్‌లు రూపొందించాలని ఆదేశాలు. ఏఎంఆర్సీని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ. 79.91 కిలోమీటర్ల మేర లైట్‌మెట్రోకు ప్రతిపాదనలు. డీఎంఆర్సీ, రైట్స్, యూఎంటీసీ నుంచి సలహాలు తీసుకోవాలని ఆదేశం. 60.2 కి.మీ. మోడ్రన్‌ ట్రామ్‌ కారిడార్స్ ఏర్పాటుకు డీపీఆర్‌లు. డీఎంఆర్సీ, రైట్స్, యూఎంటీసీల నుంచి డీపీఆర్‌లు ఆహ్వానించాలని ఆదేశం.
  • నిర్భయ దోషులను విడివిడిగా ఉరితీయాలంటూ.. సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన కేంద్ర హోంశాఖ. ఇప్పటికే తీర్పును రిజర్వ్‌ చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం. రేపు తీర్పు ఇవ్వనున్న జస్టిస్‌ భానుమతి నేతృత్వంలోని.. ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం.
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి ఉచిత దర్శనానికి 5 గంటల సమయం. ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.67 కోట్లు. సాయంత్రం వరకు శ్రీవారిని దర్శించుకున్న 46,448 మంది భక్తులు.
  • విశాఖ: పాయకరావుపేటలో హెటిరో ఉద్యోగి ఒంటెద్దు రాజు ఉరి వేసుకుని ఆత్మహత్య, మృతుడు తూ.గో.జిల్లా పెదపట్నం లంక వాసి.
  • ఢిల్లీ చేరుకున్న ట్రంప్‌ దంపతులు. ఎయిర్‌పోర్ట్‌లో ట్రంప్‌ దంపతులకు ఘనస్వాగతం. ఐటీసీ మౌర్య హోటల్‌లో ట్రంప్‌ దంపతుల బస. ఢిల్లీలో భారీగా భద్రతా ఏర్పాట్లు. ట్రంప్‌ బస చేసిన హోటల్‌ దగ్గర పటిష్ట భద్రత.

త్వరలో రాజ్యసభకు కవిత.. కేసీఆర్ నిర్ణయం !

kcr to send kavita to rs, త్వరలో రాజ్యసభకు కవిత.. కేసీఆర్ నిర్ణయం !

తెలంగాణ జాగృతికి సారథ్యం వహించి స్వరాష్ట్ర కాంక్షను ఇనుడింపచేసి, ఆ తర్వాత పార్లమెంటులోను తన వాగ్ధాటితో తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణకు ప్రయత్నం చేసిన కేసీఆర్ తనయ, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితను త్వరలో జరిగే ద్వైపాక్షిక రాజ్యసభ ఎన్నికల్లో పెద్దలసభకు పంపాలని గులాబీ దళపతి నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. తెలంగాణ ప్రయోజనాలపై ఉభయ పార్లమెంటు సభల్లో గట్టిగా వాయిస్ వినిపించే నేత అవసరమని భావిస్తున్న కేసీఆర్, అందుకు కవితనే తగిన క్యాండిడేట్ అన్న అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఇందుకు ఇటీవల కాలంలో కవిత ప్రస్తావిస్తున్న అంశాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

తెలంగాణ ఉద్యమ కాలంలో జాగృతిని ఏర్పాటు చేసి, ప్రత్యేక రాష్ట్ర కాంక్షను రాష్ట్రం నలుమూలలతోపాటు వివిధ దేశాలలో వున్న తెలంగాణ ప్రజలకు చాటిన ఘనత కవితకు దక్కుతుంది. ఆ పనికి గుర్తింపుగా కవితను 2014 ఎన్నికల్లో నిజామాబాద్ లోక్‌సభ బరిలో నిలిపారు కేసీఆర్. కవిత ఘన విజయం సాధించి, ఆ తర్వాత అయిదేళ్ళు లోక్‌సభలో సందర్భం, అవకాశం వచ్చిన ప్రతిసారి తెలంగాణ ప్రయోజనాలపై మాట్లాడారు. వాగ్ధాటితో మెప్పించారు.

అయితే, 2019 మే నెలలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి రెండోసారి పోటీ చేసిన కవిత… అనూహ్యంగా బిజెపి అభ్యర్థి అరవింద్ చేతిలో ఓటమి పాలయ్యారు. కవిత ఓటమిని ఆమె ఒక్కరే కాదు.. టిఆర్ఎస్ శ్రేణులు, ఆమె అభిమానులు నేటికీ జీర్ణించుకోలేకపోతున్నారంటే కవిత ఎంతగా తన నియోజకవర్గంతో మమేకమయ్యారో అర్థమవుతుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తన లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో టిఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారంటే ఆ ఘనత కవితకే దక్కుతుంది.

ఓటమి పాలైన తర్వాత కొంత కాలం సైలెంట్‌గా వున్న కవిత తాజాగా జాతీయ అంశాలపై పెదవి విప్పుతున్నారు. జిడిపి గణనీయంగా తగ్గిన నేపథ్యంలో దేశ ఆర్థిక పరిస్థితిపై కవిత కొన్ని వివరాలతో ట్వీట్లు సంధించారు. తాజాగా ఈశాన్య భారతంలో రగులుతున్న ఆందోళనను ముందుగానే ప్రెడిక్ట్ చేసిన కవిత… సిటిజన్‌షిప్ (అమెండ్‌మెంట్) బిల్లులో లోపాలను ఎత్తిచూపారు. అదే సమయంలో తెలంగాణకు రావాల్సిన నిధులను విడుదల చేయడంతో మోదీ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యాన్ని కవిత ఎత్తి చూపారు.

ఇలా జాతీయ అంశాలపై సమగ్ర అవగాహన కలిగి వున్న కవితను రాజ్యసభకు పంపాలన్న ఒత్తిడి గులాబీ దళపతిపై పెరుగుతున్నట్లు సమాచారం. దాంతో కవిత పేరుతోపాటు తనకు బంధువైన కరీంనగర్ మాజీ ఎంపీ, ప్రస్తుతం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ పేరును కూడా కేసీఆర్ పరిశీలించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, వినోద్‌కు కేబినెట్ హోదా కలిగిన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి ఆల్‌రెడీ ఇచ్చినందున తాజాగా రాజ్యసభ అభ్యర్థుల పరిశీలనలో ఆయన పేరును పక్కన పెట్టారని, దాంతో కవితకు లైన్ క్లియర్ అయ్యిందని తెలుస్తోంది.

Related Tags