కేసీఆర్ సార్!..నెక్ట్స్ ఏంటి?

KCR in dilemma after exit polls, కేసీఆర్ సార్!..నెక్ట్స్ ఏంటి?

సీఎం కేసీఆర్ ప్రస్తుతం డైలమాలో ఉన్నారు. ఫెడరల్ ప్రెండ్ స్థాపించి దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పులు తీసుకురావాలనుకున్న ఆయన ఆశలకు ఎగ్జిట్ పోల్స్ గండి కొట్టాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ కూటమి తిరిగి మంచి మెజారిటీతో అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పాయి. పోల్స్ ముందు వరకు పలు రాష్ట్రాల్లో పర్యటనలు చేసి జోష్‌లో కనిపించిన కేసీఆర్ ప్రస్తుతం స్థబ్ధుగా ఉన్నారు.

కనీసం ఎన్డీఏకు పూర్తి అధిక్యం రాకున్నా టీఆర్‌ఎస్‌ తమతో వచ్చే మిత్ర పక్షాలతో కలిపి నేషనల్ పాలిటిక్స్ ‘కీ’ రోల్ పోషించే అవకాశం వచ్చేది. కానీ ఆ ఛాన్స్ కూడా ప్రస్తుతం లేనట్లుగానే కనిపిస్తోంది. కాగా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో గులాబి బాస్ కేసీఆర్ ఈ నెల 23న పార్టీ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో నాయకులతో చర్చించిన అనంతరం కీలక నిర్ణయం తీసుకుంటారని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *