Kavitha generosity: ఆపన్నులకు ఆసరా.. వాహ్ కవితా జీ !

లాక్ డౌన్ డేస్‌లో ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకునేందుకు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఔదార్యం ప్రదర్శించారు. ఏకంగా ఆరు కేంద్రాల్లో అన్నదానం నిర్వహిస్తూ అన్నార్తులకు ఆసరాగా నిలిచారు.

Kavitha generosity: ఆపన్నులకు ఆసరా.. వాహ్ కవితా జీ !
Follow us

|

Updated on: Apr 02, 2020 | 5:44 PM

Former MP Kavitha generosity came into light: లాక్ డౌన్ డేస్‌లో ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకునేందుకు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఔదార్యం ప్రదర్శించారు. ఏకంగా ఆరు కేంద్రాల్లో అన్నదానం నిర్వహిస్తూ అన్నార్తులకు ఆసరాగా నిలిచారు. లాక్ డౌన్ రోజుల్లో దినసరి కూలీలు, తక్కువ వేతనం గల కుటుంబాలు రోజు గడవని స్థితికి చేరుకోవడం, ప్రభుత్వాల ఏర్పాట్లు అందరికీ అందకపోవడంతో కవిత స్వయంగా చొరవ చూపించి, ఈ ఆరు అన్నదాన కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

వేలాది మంది పేదలు, వలస కూలీల కడుపు నింపుతున్నారు కల్వకుంట్ల కవిత. వలస కూలీల కోసం కవిత ఆదేశాల మేరకు నిజామాబాద్ పట్టణంలో ‌అన్నదాన‌ కేంద్రాన్ని ప్రారంభించారు మేయర్ నీతూ కిరణ్. జగిత్యాలలో అన్నదాన ‌కేంద్రాన్ని ప్రారంభించారు జెడ్పీ ఛైర్మన్ వసంత, ఎమ్మెల్యే సంజయ్ కుమార్. అదే సమయంలో మెట్‌పల్లిలో అన్నదాన కేంద్రాన్ని ప్రారంభించారు తెలంగాణ జాగృతి ‌నాయకులు.

ఆరు అన్నదాన కేంద్రాల ద్వారా ప్రతిరోజు 2000 వేల మందికి పైగా భోజనం అందుతోంది. అన్నదాన కేంద్రాల దగ్గర సామాజిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. అందుబాటులో మాస్కులను ఏర్పాటు చేశారు. గత రెండు సంవత్సరాలుగా లక్షలాది మంది నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తున్న కవిత, ఇప్పుడు కరోనా వైరస్ నేపథ్యంలో పేదలు, వలస కూలీల ఆకలి తీర్చేందుకు మరో ముందడుగు వేసారు. గత రెండు సంవత్సరాలుగా నిజామాబాద్ , బోధన్, ఆర్మూర్ ప్రభుత్వాసుపత్రుల వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా కవిత. ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో పేదల ఆకలి తీర్చేందుకు గాను మరో మూడు కొత్త అన్నదాన కేంద్రాలను ఏర్పాటు చేసారు.

లాక్ డౌన్ నేపథ్యంలో పేదలు, వలస కూలీలు పడుతున్న ఇబ్బందులను స్థానిక ప్రజాప్రతినిధులు, తెలంగాణ జాగృతి నాయకులు, ప్రజలు కవిత దృష్టికి తీసుకొచ్చారు. దీంతో వెంటనే దీనిపై దృష్టి సారించిన కల్వకుంట్ల కవిత, ఆయా ప్రాంతాల్లో అన్నదాన కేంద్రాలు ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, తెలంగాణ జాగృతి నాయకులతో చర్చించి, అవసరమైన చోట అన్నదాన కేంద్రాలు ఏర్పాటు చేయించారు కవిత.

అన్నదాన కేంద్రాల నేపథ్యం

రెండు సంవత్సరాల క్రితం ఎంపీ హోదాలో ఒకసారి జిల్లా ఆసుపత్రిని సందర్శించిన సందర్భంగా రోగులతో పాటు అక్కడ ఉన్న సహాయకులు తమకు ఎదురవుతున్న భోజన ఇబ్బందులను ఆమె దృష్టికి తీసుకు రావడంతో ఈ కార్యక్రమానికి బీజం పడింది. అప్పటి నుంచి నిరాటంకంగా కొనసాగుతూ వస్తున్నది. కేవలం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మాత్రమే కాకుండా ఆర్మూర్, బోధన్ ప్రభుత్వాసుపత్రుల వద్ద కూడా ఈ అన్నదాన కార్యక్రమాలు కవిత ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. రెండు సంవత్సరాల కింద కల్వకుంట్ల కవిత ప్రారంభించిన ఈ అన్నదాన కార్యక్రమం ప్రస్తుత లాక్ డౌన్ లోనూ నిరాటంకంగా కొనసాగుతోంది. పది రోజుల కింద జనతా కర్ఫ్యూ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిలిపివేయడంతో అనేక మంది నిరుపేదలు ఆకలితో అలమటించారు. ఈ విషయం కవిత దృష్టికి రావడంతో తన కార్యాలయ సిబ్బందితో మాట్లాడి ప్రత్యేక ఏర్పాట్లు చేయించారు. స్థానిక జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డితో మాట్లాడి అన్నదానం కోసం కావాల్సిన సిబ్బందికి కావాల్సిన పాసులను ఏర్పాటు చేయించారు. దీంతో అన్నదాన కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతుంది.

తాజాగా, కరోనా మహమ్మారిని అరికట్టేందుకు లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో మెట్ పల్లి ప్రభుత్వ హాస్పిటల్ లోని పేషెంట్ లు, వారి సంబంధికులు భోజనం దొరక్క తీవ్ర ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలంగాణ జాగృతి జగిత్యాల జిల్లా నాయకులు కవిత దృష్టి కి తీసుకు వెళ్లడంతో, వెంటనే స్పందించి తన సొంత ఖర్చులతో మెట్ పల్లి ప్రభుత్వ హాస్పిటల్ లో భోజన సదుపాయాలు కల్పించాలని నిర్ణయించారు. దీంతో గురువారం నుండి ప్రభుత్వ హాస్పిటల్ లోని పేషెంట్ లు, వారి సంబంధికులు మరియు వైద్య సిబ్బంది భోజన సౌకర్యం కల్పించేలా అన్నదాన‌ కేంద్రాన్ని‌ ప్రారంభించారు.

ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్న అనేక మంది రోగుల సహాయకులకు మాత్రమే కాకుండా వందలాది మంది పేద ప్రజలకు ఇప్పుడు ప్రతి రోజు మధ్యాహ్నం ఉచితంగా భోజనం అందుతుంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి నిజామాబాద్ కు అత్యవసర పనులపైన వచ్చే వారికి ఇప్పుడు కడుపు నిండుతున్నది. ప్రస్తుతం ఎక్కడా ఆహారం దొరకని నేపథ్యంలో ఇక్కడ భోజనం చేసిన ప్రతి ఒక్కరు కవితను ఆశీర్వదించి వెళ్తున్న పరిస్థితి అన్నదాన కౌంటర్ల వద్ద నెలకొని ఉంది.