ఆప్యాయం.. అనురాగం.. అదీ అన్నాచెల్లెళ్ల బంధం!

Kavith Celbrates Raksha bandhan

అన్నా చెల్లెళ్లకు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉండే ఆత్మీయ బంధానికి ప్రతీకగా నిలిచే పవిత్రమైన రోజు రాఖీ పౌర్ణమి. ఈ పర్వదినాల్లో అక్కలు, చెల్లెల్లు తమ సోదరులకు రాఖీలు కట్టి తమకు అండగా, రక్షగా నిలవాలని కోరుకుంటారు. దేశవ్యాప్తంగా పేద, ధనిక, కుల, మత, వర్ణ వైషమ్యాలకు అతీతంగా ఈ పండగను జరుపుకుంటారు. ఇకపోతే తమకు రాఖీలు కట్టిన అక్కలు, చెల్లెళ్లకు బహుమతులు ఇచ్చి సంతోషపెడతారు.

భారతీయ సంస్కృతికి అద్దంపట్టే ఈ రాఖీ పండుగను రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఘనంగా జరుపుకుంటారు. ఈ తరుణంలో టీఆర్‌ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆయన చెల్లెలు కల్వకుంట్ల కవిత గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇద్దరూ రాజకీయ పరంగా వివిధ శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తున్నా.. కుటుంబ పరంగా ఇద్దరి మధ్య విడదీయరాని అనుబంధం ఉంది. అంతేకాకుండా కవిత.. తన అన్న కేటీఆర్‌కు ప్రతి ఏడాది క్రమం తప్పకుండా రాఖీ కడుతూ తన ప్రేమను చాటుకుంటుంది. అటు కేటీఆర్ కూడా చెల్లెలిపై ఉన్న అమితమైన ప్రేమను పలు సందర్భాల్లో బహిర్గతం చేసిన సంగతి తెలిసిందే. గతంలో కేటీఆర్‌కు కవిత హెల్మెట్ ను గిఫ్ట్ గా అందించిన సంగతి తెలిసిందే. అన్నాచెల్లెళ్ల అసలైన ప్రేమకు వారు ప్రతిబింబంగా నిలిచారు. ఒకనాడు ఆర్మర్‌లో జరిగిన జనహిత కార్యక్రమంలో ఈ అన్నాచెల్లెళ్లు తమ ఆత్మీయతను చాటుకున్నారు కూడా. తన సోదరి రాజకీయంగా, కుటుంబపరంగా తనకు ఎంతో అండగా ఉంటోందని కేటీఆర్.. కవితపై ప్రశంసల వర్షం కురిపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *