పాలిటిక్స్ లోకి బిగ్ బాస్ విన్నర్. ఇది నిజమా.?

హైదరాబాద్: బిగ్ బాస్ తో కౌశల్ మందా ప్రజల్లో ఒక సెన్సేషన్ అయ్యాడని చెప్పాలి. ఆయనకు ఆ సమయంలో హీరోలకు మించి క్రేజ్ వచ్చింది. బిగ్ బాస్ విన్నర్ అయిన కౌశల్.. బయటికి వచ్చి కౌశల్ ఆర్మీ నేతృత్వంలో పలు స్వచ్చంద కార్యక్రమాలు చేశాడు.  ఇది ఇలా ఉంటే ఆయన మీద ఒక రూమర్ ఇప్పుడు మీడియాలో హల్ చల్ చేస్తోంది. కొద్ది రోజుల్లో జరగబోయే ఏపీ ఎలక్షన్స్ లో ఆయన తన సొంత ఊరు వైజాగ్ నుండి […]

పాలిటిక్స్ లోకి బిగ్ బాస్ విన్నర్. ఇది నిజమా.?
Follow us

|

Updated on: Feb 25, 2019 | 8:38 PM

హైదరాబాద్: బిగ్ బాస్ తో కౌశల్ మందా ప్రజల్లో ఒక సెన్సేషన్ అయ్యాడని చెప్పాలి. ఆయనకు ఆ సమయంలో హీరోలకు మించి క్రేజ్ వచ్చింది. బిగ్ బాస్ విన్నర్ అయిన కౌశల్.. బయటికి వచ్చి కౌశల్ ఆర్మీ నేతృత్వంలో పలు స్వచ్చంద కార్యక్రమాలు చేశాడు.  ఇది ఇలా ఉంటే ఆయన మీద ఒక రూమర్ ఇప్పుడు మీడియాలో హల్ చల్ చేస్తోంది.

కొద్ది రోజుల్లో జరగబోయే ఏపీ ఎలక్షన్స్ లో ఆయన తన సొంత ఊరు వైజాగ్ నుండి పోటీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఒక పొలిటికల్ పార్టీ తో చర్చలు కూడా జరుపుతున్నారట కౌశల్. ఇంకా దీనిపై అధికారక ప్రకటన రావాల్సి ఉంది. ఏది ఏమైనా ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో ఆ పార్టీకు కౌశల్ ఆర్మీ ద్వారా భారీ మద్దతు వస్తుందనే చెప్పాలి.