Breaking News
  • అసెంబ్లీ సాక్షిగా ఐదు కోట్ల ఆంధ్రులను మోసం చేశారు. న్యాయం చేయమని రోడ్డుపైకి వచ్చిన మహిళను అరెస్ట్ చేస్తున్నారు. మహిళలపై లాఠీచార్జ్‌ దారుణం-నారా లోకేష్‌. మండలిలో రేపు ఏం జరుగుతుందో ప్రజలే చూస్తారు-లోకేష్‌.
  • బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఎన్నిక సంతోషకరం. తెలంగాణ తరపున అభినందనలు తెలిపాం. తెలంగాణపై దృష్టిపెట్టాలని కోరాం-టీఎస్‌ బీజేపీ చీఫ్‌ డా.లక్ష్మణ్‌. త్వరలో తెలంగాణలో జేపీ నడ్డా పర్యటిస్తారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ ఒక గూటి పక్షులే-డా.లక్ష్మణ్‌.
  • అమరావతి: పవన్‌తో పోలీసుల మంతనాలు. రాజధాని గ్రామాల పర్యటన వాయిదా వేసుకోవాలంటున్న పోలీసులు.
  • కరీంనగర్‌లో గంజాయి ముఠా గుట్టురట్టు. రూ.30 లక్షల విలువైన గంజాయి పట్టివేత. ముగ్గురు అరెస్ట్‌, ట్రక్‌ స్వాధీనం.
  • చెన్నై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత. అబుదాబి నుంచి చెన్నైకి తరలిస్తున్న 3.7 కేజీల బంగారం పట్టివేత. ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న కస్టమ్స్ అధికారులు.

మీవి రాజకీయ విమర్శలు.. మావి వ్యక్తిగత విమర్శలా..? ‘కత్తి’ కౌంటర్

Kathi Mahesh counter to Pawan Kalyan and Nadendla Manohar, మీవి రాజకీయ విమర్శలు.. మావి వ్యక్తిగత విమర్శలా..? ‘కత్తి’ కౌంటర్

ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఇంగ్లీష్ విద్యావిధానంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్షాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మాతృభాషకు సీఎం జగన్ తూట్లు పొడుస్తున్నాడంటూ వారు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్షాల విమర్శలకు ఘాటుగా స్పందించిన జగన్.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినందుకు విమర్శలు చేస్తున్న వారు.. వారి పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారని చురకలంటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, వెంకయ్య నాయుడు, పవన్ కల్యాణ్ ముగ్గురి పేర్లు చెప్పిన జగన్… వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దీంతో సోషల్ మీడియాలో పవన్ అభిమానులు జగన్‌పై కామెంట్లు చేయగా.. మరోవైపు వైసీపీ అభిమానులు కూడా వారికి అంతే కౌంటర్ ఇస్తున్నారు. ఇలా రెండు పార్టీల అభిమానుల దూషణలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. ‘జనసైనికులు సంయమనం పాటించండి’ అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.

ఇక ఈ కామెంట్లకు సినీ క్రిటిక్ కత్తి మహేష్, మరింత అగ్గి రాజేశారు. పవన్‌పైనా, నాదెండ్ల మనోహర్‌పైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “వ్యక్తిగత విమర్శలేమిట్రా మనోహర్! పెళ్లాల సంఖ్య గుప్తమా లేక పిల్లలు ఎందరో తెలియకపోవడం తట్టుకోలేని తికమకా? అయినా ఒరేయ్! జగన్ ని ఆర్ధిక ఉగ్రవాది అన్నప్పుడు. జగన్ రెడ్డి…రెడ్డి అని కులాన్ని ఒత్తి ఒత్తి సాడిస్టిక్ ఆనందం పొందినప్పుడు. కడప రౌడీలు అని మాటిమాటికీ వాగినప్పుడు. కోడికత్తి అని వెక్కిరించిన్నప్పుడు. కోర్టుకెళ్లే నేరస్తుడు అని కూసినప్పుడు. అవన్నీ వ్యక్తిగతం కాదా? మీరు అంటే రాజకీయ విమర్శ…మేము అంటే వ్యక్తిగత విమర్శ. అంతేగా…సరే కానీ.. నాలుగో భార్య నాదేండ్లని మర్చిపోయినందుకు జగన్ గారు క్షమాపణలు చెప్పాలి కాబోలు!” అని సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. కాగా జగన్ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ ఈ సాయంత్రం ప్రెస్‌మీట్ పెట్టబోతున్నారు.

వ్యక్తిగత విమర్శలేమిట్రా మనోహర్! పెళ్లాల సంఖ్య గుప్తమా లేక పిల్లలు ఎందరో తెలియకపోవడం తట్టుకోలేని తికమకా?అయినా ఒరేయ్!…

Mahesh Kathi यांनी वर पोस्ट केले सोमवार, ११ नोव्हेंबर, २०१९