రిటర్న్ జర్నీ.. కశ్మీర్ టు తెలుగు రాష్ట్రాలు

Kashmiri students in state panicky over chaos in valley, రిటర్న్ జర్నీ..  కశ్మీర్ టు తెలుగు రాష్ట్రాలు

కశ్మీర్‌లో ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 109 మంది విద్యార్ధులను స్వస్థలాలకు తీసుకెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే ఆ రాష్ట్ర అధికారులు, దౌత్య అధికారులతో కేంద్ర, రాష్ట్ర మంత్రులు, అధికారులు.. చర్చలు జరిపి విద్యార్ధులను స్వస్థలాలకు చేర్చాలని కోరినట్లు తెలుస్తోంది.

జమ్మూలోని ప్రత్యేక పరిస్థితులు నేపథ్యంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చదువుతున్న 5వేల మంది విద్యార్ధులకు సెలవులు ప్రకటించింది. ఈ నేపథ్యంలో విద్యార్ధులను వారి వారి స్వస్థలాలకు క్షేమంగా తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల నేతలు. నిన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కశ్మీర్ దౌత్య అధికారితో మాట్లాడి కశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు ప్రత్యేక బస్సులను ఏర్పాట్లు చేయిస్తే.. తాజాగా కేంద్ర సహాయమంత్రి కిషన్ రెడ్డి ఏర్పాట్లపై సమీక్షించారు.

జమ్ముకశ్మీర్‌లో ఉన్న తెలుగు విద్యార్ధులను స్వస్థలాలకు తీసుకొచ్చే ఏర్పాట్లు కేంద్ర సహాయ మంత్రి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. పార్టీ ఎంపీలు బండి సంజయ్, సోయం బాబూరావు, ధర్మపురి అరవింద్‌లతో కలిసి జమ్మూకశ్మీర్ అధికారులతో మాట్లాడిన కిషన్ రెడ్డి.. బస్సుసర్వీసులతో పాటు.. విద్యార్ధులకు స్వస్థలాలకు చేరేందుకు వీలుగా విమాన, రైల్వే సర్వీసులు ప్రారంభించాలని జమ్మూలో విమాన, రైల్వే శాఖ అధికారులను ఆయన ఆదేశించినట్లు తెలుస్తోంది.

109 మంది తెలుగు విద్యార్ధులు స్వస్థలాలకు చేరే విషయంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు.. తెలంగాణకు చెందిన ఎంపీలు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. స్వయంగా విద్యార్ధులతో మాట్లాడి ఇబ్బందులు తెలుసుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *