Breaking News
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి ఉచిత దర్శనానికి 10 గంటల సమయం. ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.92 కోట్లు. సాయంత్రం వరకు శ్రీవారిని దర్శించుకున్న 45,143 మంది భక్తులు.
  • హైదరాబాద్‌: గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సన్నీబాబు ఆత్మహత్య. ఆత్మహత్య చేసుకుంటున్నట్టు బావ సంపత్‌కు సన్నీబాబు ఈ మెయిల్‌. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
  • ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో గానాబజానా వ్యవహారంపై ప్రభుత్వం ఆగ్రహం. ఆరుగురు సిబ్బందిపై శాఖాపరమైన విచారణ చేపట్టిన వైద్యారోగ్యశాఖ. హెడ్‌ నర్సులు, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌లు, ఫార్మాసిస్ట్‌లపై.. చర్యలు తీసుకుంటూ ఆదేశాలు జారీ.
  • వరంగల్‌: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర హుండీల లెక్కింపు. 436 హుండీల లెక్కింపు పూర్తి. రూ.10.29 కోట్ల ఆదాయం.
  • రామాయపట్నం పోర్టు పరిధిని నిర్ధారిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు. పోర్టు జియో కోఆర్డినేట్స్‌ను నోటిఫై చేసిన మౌలిక వనరులకల్పన శాఖ. పోర్టు నిర్మించిన ప్రాంతానికి 30 కి.మీ. పరిధిలో.. మరో ఓడరేవు నిర్మించేందుకు వీల్లేకుండా అంగీకారం. రామాయపట్నం పోర్టు నిర్మాణంపై.. డీపీఆర్‌ రూపకల్పనలో భాగంగా పోర్టు పరిధి నిర్ధారిస్తూ ఉత్తర్వులు. ప్రభుత్వానికి వివిధ ప్రతిపాదనలు పంపిన ఏపీ మారిటైమ్‌ బోర్డు. నాన్‌ మేజర్‌ పోర్టుగా రామాయపట్నంను అభివృద్ధి చేయనున్న ప్రభుత్వం.
  • హైదరాబాద్‌: సీసీఎస్‌ పోలీసులకు కరాటే కల్యాణి ఫిర్యాదు. సోషల్ మీడియాలో శ్రీరెడ్డి తనను అసభ్యపదజాలంతో దూషించిందని ఫిర్యాదు. శ్రీరెడ్డిపై 506, 509 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు. సోషల్‌ మీడియాలో అసభ్య కామెంట్స్ చేయడం చట్టరీత్యా నేరం. సపోర్టింగ్‌ కామెంట్స్ చేసినవారిపై కూడా చర్యలు తీసుకుంటాం -సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ ఏసీపీ ప్రసాద్.

‘ఇంటర్నెట్‌ను పునరుధ్ధరిస్తే బూతు సినిమాలు చూస్తున్నారు’

kashmir people misusing internet says niti aayog member vk. saraswat, ‘ఇంటర్నెట్‌ను పునరుధ్ధరిస్తే బూతు సినిమాలు చూస్తున్నారు’

జమ్మూకాశ్మీర్ లో ఇంటర్నెట్ ను ప్రభుత్వం ఇటీవలే పునరుధ్ధరించింది. ఇందుకు అంతా ఎంతో సంతోషించారు. ముఖ్యంగా యువత కేరింతలు కొట్టింది. అయితే ఈ సర్వీసును నిషేధిస్తూ ఇన్నాళ్ళూ కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైనదేనంటున్నారు నీతిఆయోగ్ సభ్యుడు వి.కె. సారస్వత్. కాశ్మీర్ ప్రజలు ఇప్పుడు బూతు చిత్రాలను చూసేందుకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని వినియోగిస్తున్నారని ఆయన ఫైరయ్యాడు. ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో ఈ సదుపాయాన్ని నిషేధించినంత మాత్రాన ఆర్థికపరిస్థితిపై పెద్ద ప్రభావమేమీ పడలేదని ఆయన అభిప్రాయపడ్డారు.

నీతి ఆయోగ్ సభ్యుని సంచలన ఆరోపణ

కాశ్మీర్లో ధీరూభాయ్ అంబానీ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ  నిర్వహించిన వార్షిక స్నాతకోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఇక్కడ ఇంటర్నెట్ పునరుధ్ధరణ  మంచిదే అంటున్నారని, కానీ ముఖ్యంగా దీనినుపయోగించి యువకులు ‘గలీజ్ మూవీలు’ చూస్తున్నారని సారస్వత్ పేర్కొన్నారు. అలాగే ఢిల్లీ వంటి నగరాల్లో జరిగిన నిరసన ప్రదర్శనలను ‘రీక్రియేట్’ చేసే ఉద్దేశంతో పలువురు రాజకీయ నాయకులు ఈ కేంద్రపాలిత ప్రాంతానికి చేరుకుంటున్నారని, ఈ నిరసనలను రెచ్ఛగొట్టేందుకు సోషల్ మీడియాను వినియోగించుకుంటున్నారని ఆయన చెప్పారు. నిజానికి ఈ లోయలో టెర్రరిస్టులు ఇంటర్నెట్ ను దుర్వినియోగం చేయగలరన్న భయంతో కేంద్రం ఈ సౌకర్యాన్ని నిషేధించింది.  ఈ మధ్యే మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ సదుపాయాలపై ఆంక్షలను దశలవారీగా ఎత్తివేసేందుకు కేంద్రం నడుం కట్టిన సంగతి తెలిసిందే.kashmir people misusing internet says niti aayog member vk. saraswat, ‘ఇంటర్నెట్‌ను పునరుధ్ధరిస్తే బూతు సినిమాలు చూస్తున్నారు’

 

 

Related Tags