నో మొబైల్ సర్వీసెస్… ప్రశాంత కాశ్మీరం!

ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో మొబైల్ సేవలు లేని పరిస్థితులను ఓ సారి పరిశీలిస్తే… మొబైల్ నెట్ వర్క్ లేవీ పనిచేయని పరిస్థితిలో మనం కూడా అక్కడే ఉన్నట్లుగా ఊహించుకుంటే… మొబైల్ లేకుంటే ఇంత ప్రశాంత వాతావరణంలో హ్యాఫీగా లైఫ్ ను లాగించేయొచ్చన్న భావన మాత్రం కలిగి తీరుతుంది. నిజమే మరి… నిత్యం ఉరుకులు పరుగుల లైఫ్ లో ఈ మొబైల్ ఫోన్ ఎంట్రీతో మన లైఫ్ మరింత స్పీడందుకుంది. ఈ స్పీడు లైఫ్ లోనే లెక్కలేనన్ని […]

నో మొబైల్ సర్వీసెస్... ప్రశాంత కాశ్మీరం!
Follow us

| Edited By: Srinu

Updated on: Oct 14, 2019 | 5:07 PM

ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో మొబైల్ సేవలు లేని పరిస్థితులను ఓ సారి పరిశీలిస్తే… మొబైల్ నెట్ వర్క్ లేవీ పనిచేయని పరిస్థితిలో మనం కూడా అక్కడే ఉన్నట్లుగా ఊహించుకుంటే… మొబైల్ లేకుంటే ఇంత ప్రశాంత వాతావరణంలో హ్యాఫీగా లైఫ్ ను లాగించేయొచ్చన్న భావన మాత్రం కలిగి తీరుతుంది. నిజమే మరి… నిత్యం ఉరుకులు పరుగుల లైఫ్ లో ఈ మొబైల్ ఫోన్ ఎంట్రీతో మన లైఫ్ మరింత స్పీడందుకుంది. ఈ స్పీడు లైఫ్ లోనే లెక్కలేనన్ని అనారోగ్యాలు – కొత్త కొత్త రుగ్మతలకు మనకు మనమే స్వాగతం పలుకుతున్నాం. మరి ఈ బిజీ లైఫ్ లో కాస్తంత రిలాక్స్ అవ్వాలంటే ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్  లోని పరిస్థితిని చూసి ముచ్చటపడుతున్నారు. మన వద్ద కూడా ఎంచక్కా కాశ్మీర్ లాగా మొబైల్ సేవలను రద్దు చేస్తే… హ్యాపీగా లైఫ్ ను ఎంజాయ్ చేయొచ్చు అన్న భావన బలంగా వినిపిస్తోంది. నిజమే… ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో ప్రశాంత వాతావరణం నెలకొందనే చెప్పాలి.

పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం నేపథ్యంలో నిత్యం నిప్పుల కుంపటిలా కొనసాగిన కాశ్మీర్… 370 ఆర్టికల్ రద్దు నేపథ్యంలో కేంద్రం అక్కడ మొబైల్ సేవలను నిలిపివేయడంతో ప్రశాంతంగానే ఉంది. ఎప్పుడు కాల్పుల మోతతో మారుమోగిన కాశ్మీర్ ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. దీనికి మొబైల్ సేవల నిలిపివేతే ముఖ్య కారణమని చెప్పక తప్పదు. మొబైల్ సేవల నిలిపివేతతో ఉగ్రవాదుల ఆగడాలకు – స్వైర విహారానికి అడ్డుకట్ట పడింది. నిత్యం ఎక్కడో ఒక చోట కాల్పులు జరిగే కాశ్మీరంలో ఇప్పుడు అసలు గొడవలే లేవంటే అతిశయోక్తి కాదేమో. ఈ దిశగా ఆలోచిస్తే… మొబైల్ సేవల నిలిపివేతతోనే కాశ్మీర్ లో అల్లర్లు సద్దుమణిగాయన్నది ఏ ఒక్కరూ కాదనలేని సత్యమే. అయితే మొబైల్ సేవల నిలిపివేతతో సామాన్య జనం ఇబ్బందులు పడటం లేదా? అన్న ప్రశ్నలూ ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొబైల్ సేవలకు అలవాటు పడిపోయిన మనకు ఆ సేవలు లేకపోతే ఇబ్బందికరమేనని చెప్పక తప్పదు.

అయితే చేతిలో మొబైల్ లేకుంటే… పరిస్థితి ఎంత ప్రశాంతంగా ఉంటుందన్న కోణంలో ఆలోచిస్తే మాత్రం… ఆ ఫోన్ చేతిలో లేకుండా నిజంగానే నిశ్చింతగా లైఫ్ ను లాగేయొచ్చు కదా అని భావన కూడా ఆసక్తి రేకెత్తించేదే. మన లైఫ్ మొబైల్ సేవలు లేని సమయంలోనూ సాఫీగానే సాగింది. కాకపోతే.. మొబైల్ సేవలు అందుబాటులోకి వచ్చాక… లైఫ్ మరింత ఈజీగా మారిపోయిందని చెప్పాలి. అదే సమయంలో మన లైఫ్ లో మొబైల్ ఒత్తిడిని కూడా పెంచిందని కూడా ఒప్పుకోక తప్పదు. మొబైల్ కు అలవాటు పడిపోయిన మనకు ఎక్కడున్నా ఏం చేస్తున్నా… చేతిలో మొబైల్ లేకపోతే పిచ్చెక్కడం ఖాయమే.

అయితే మొబైల్ సేవలు అందుబాటులోకి రాని రోజుల్లోకి వెళ్లి చూస్తే.. మొబైల్ మన జీవితాన్ని ఎంతగా ఒత్తిడిమయం చేసిందో ఇట్టే తెలిసిపోతుంది. మొబైల్ వచ్చాక… బిజీ లైఫ్ మరింత బిజీగా మారిపోగా మానసిక ఒత్తిడి కూడా ఎన్నో రెట్ల మేర పెరిగిపోయింది. ఈ క్రమంలోనే చాలా మానసిక రుగ్మతలు మనల్ని చుట్టుముట్టేశాయి. ఈ వ్యాధుల బారి నుంచి తప్పించుకునేందుకు చాలానే ఖర్చు పెడుతున్నాం. అంటే… కొని తెచ్చుకుని చేతిలో పెట్టేసుకున్న మొబైల్ కారణంగా వ్యాధులనూ కొనితెచ్చుకున్నామన్న మాట. మరి మొబైల్ లేకుండానే గడిపేస్తే.. ఈ ఒత్తిడికి మానసిక ఆందోళనకు చెక్ పెట్టేయొచ్చు కదా. ఇది అంత ఈజీగా జరిగే సమస్య కాదు గానీ… ఆచరిస్తే మాత్రం లైఫ్ ఎంత ప్రశాంతంగా ఉంటుందన్న విషయాన్ని కొత్త కాశ్మీరం మనకు తెలియజేసిందనే చెప్పాలి.