మెహబూబా ముఫ్తి, ఒమర్ అబ్దుల్లా హౌస్ అరెస్ట్.. శ్రీనగర్‌లో 144 సెక్షన్!

Mehbooba Mufti Omar Abdullah Section 144 imposed across Srinagar, మెహబూబా ముఫ్తి, ఒమర్ అబ్దుల్లా హౌస్ అరెస్ట్.. శ్రీనగర్‌లో 144 సెక్షన్!

జమ్మూకాశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. శ్రీనగర్‌లో ఆదివారం అర్ధరాత్రి 144 సెక్షన్ విధించారు. తదుపరి ఆదేశాలు జారీ అయ్యేవరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది. అటు మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తి, ఒమర్ అబ్దుల్లాలను నిన్న రాత్రి నుంచి హౌస్ అరెస్ట్ చేశారు. అంతేకాకుండా ప్రధాన రాజకీయ నాయకులందరూ కూడా ఇంటి నుంచి కదలకూడదని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

కాగా ఇప్పటికే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించగా.. టూరిస్టులను కూడా జమ్మూకాశ్మీర్ నుంచి పంపిన విషయం తెలిసిందే. అటు జమ్మూ డిస్ట్రిక్ట్‌లో కూడా సోమవారం ఉదయం 6 గంటల నుంచి 144 సెక్షన్ అమల్లోకి వస్తుందని డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ సుష్మ చౌహన్ తెలిపారు. జమ్మూ యూనివర్సిటీకి సోమవారం కూడా సెలవును ప్రకటించారు. మరోవైపు జమ్మూకాశ్మీర్‌ను మూడు భాగాలుగా విభజిస్తారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *