Breaking News
  • చెన్నై: ఐఐటీ విద్యార్థిని ఫాతిమా లతీఫ్‌ ఆత్మహత్య కేసు. ఫాతిమా లతీఫ్‌ ఆత్మహత్యపై విద్యార్థి సంఘాల ఆందోళనలు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పద్మనాభన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌. నేడు ఐఐటీ ముట్టడికి విద్యార్థి సంఘాల పిలుపు.
  • కరీంనగర్‌: అలుగునూరులో రోడ్డుప్రమాదం. లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి. మృతులు సాయికిరణ్‌, సాయికృష్ణగా గుర్తింపు.
  • నిజామాబాద్‌: భీమ్‌గల్‌ మండలం లింబాద్రిగుట్ట జాతరలో ప్రమాదం. డ్యాన్సింగ్‌ వీలుపై నుంచి పడి రవి అనే వ్యక్తికి తీవ్రగాయాలు. నిజామాబాద్‌ ఆస్పత్రికి తరలింపు.
  • ప్రభుత్వం 50 మంది కార్మికులను చంపేసింది. తప్పుడు విధానాలతో భవన నిర్మాణ కార్మికులు ఆకలితో చనిపోతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నా. వ్యక్తిగతంగా విమర్శించను.. తప్పుడు విధానాలపైనే ప్రశ్నిస్తున్నా. కార్మికుల కష్టాలను సీఎం జగన్‌ పట్టించుకోవాలి-పవన్‌కల్యాణ్‌.
  • విశాఖ: ఏజెన్సీలో తగ్గిన ఉష్ణోగ్రతలు. అరకులో 13, చింతపల్లిలో 8, మినుములూరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రత. పాడేరులో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.
  • కర్నూలు: విజయానికేతన్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌, డైరెక్టర్‌ అరెస్ట్. సాంబార్‌ గిన్నెలో పడి విద్యార్థి మృతి చెందిన ఘటనలో అరెస్ట్‌. కరస్పాండెంట్ నాగమల్లేశ్వరరెడ్డి, డైరెక్టర్ విజయకుమార్‌రెడ్డిని.. రహస్యంగా రిమాండ్‌కు తరలించిన పాణ్యం పోలీసులు. హాస్టల్‌కు అనుమతి లేదని తేల్చిన విద్యాశాఖ అధికారులు. ఇంత వరకు బయటకు రాని సీసీఫుటేజ్‌. హాస్టల్‌లో సీసీ కెమెరాలు లేవంటున్న యాజమాన్యం.
  • హైదరాబాద్‌: మాదాపూర్‌లో రోడ్డుప్రమాదం. అయ్యప్ప సొసైటీలో అదుపుతప్పి స్కూల్‌ బస్సు బోల్తా. బస్సులో విద్యార్థులెవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం.

ఆర్టికల్ 370 రద్దుపై ఇవాళ సుప్రీంలో విచారణ

Kashmir media restrictions, political detentions: SC to hear multiple pleas on Article 370 today

జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో సోమవారం విచారణ జరగనుంది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన, ఆంక్షలు కొనసాగింపు వంటి అంశాలతో సహా సుప్రీం కోర్టు విచారణ జరపనుంది. జమ్ము కశ్మీర్‌ విషయంలో రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ బిల్లును సవాల్ చేస్తూ జమ్ము కశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు సజ్జాద్ లోన్ పిటిషన్ దాఖలు చేశారు. అదే విధంగా రద్దు తర్వాత కశ్మీర్‌లో చిన్నారులను అక్రమంగా నిర్భంధించాని, బాలల హక్కుల కార్యకర్త ఇనాక్షి గంగూలీ, ప్రొఫెసర్ శాంతాసిన్హా కూడా పిటిషన్ దాఖలు చేశారు. వీటితో పాటు జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఫారూక్ అబ్దుల్లా గృహనిర్భందంపై తమిళనాడుకు చెందిన ఎంపీ, ఎండీఎంకే అధినేత వైగో , తమ కుటుంబ సభ్యులను కలవకుండా అధికారులు అడ్డుకుంటున్నారని తెలియజేస్తూ కాంగ్రెస్ ఎంపీ గులాం నబీ ఆజాద్ మరో పిటిషన్ వేశారు. అదే విధంగా కశ్మీర్ లోయలో మీడియాపై ఉన్న ఆంక్షల్ని సవాలు చేస్తూ కశ్మీర్ టైమ్స్ ఎడిటర్ అనురాధా భాసిన్ పిటిషన్ వేశారు. రాజకీయ పార్టీలకు సంబంధం లేని పలు రంగాలకు చెందిన వారు ఆర్టికల్ 370 రద్దు పరిస్థితులపై దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.