కశ్మీర్ మా అంతర్గత సమస్య: పాక్‌పైనా రాహుల్ ఫైర్

జమ్ము కశ్మీర్‌ అంశంపై పాకిస్థాన్ చేస్తోన్న విమర్శలకు మొదటిసారిగా స్పందించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన కశ్మీర్ అంశం భారత అంతర్గత సమస్య అని.. ఈ విషయంలో పాక్‌తో పాటు మరే ఇతర దేశానికి జోక్యం చేసుకునే అర్హత లేదని అన్నారు. అంతేకాకుండా జమ్ముకశ్మీర్‌లో హింసకు పాకిస్థాన్‌నే కారణమని తెలిపారు. ‘‘చాలా విషయాల్లో ఈ ప్రభుత్వంతో నేను ఏకీభవించను. కానీ ఈ విషయంలో నేను ఓ స్పష్టతను ఇస్తున్నా. కశ్మీర్ […]

కశ్మీర్ మా అంతర్గత సమస్య: పాక్‌పైనా రాహుల్ ఫైర్
Follow us

| Edited By:

Updated on: Aug 28, 2019 | 10:20 AM

జమ్ము కశ్మీర్‌ అంశంపై పాకిస్థాన్ చేస్తోన్న విమర్శలకు మొదటిసారిగా స్పందించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన కశ్మీర్ అంశం భారత అంతర్గత సమస్య అని.. ఈ విషయంలో పాక్‌తో పాటు మరే ఇతర దేశానికి జోక్యం చేసుకునే అర్హత లేదని అన్నారు. అంతేకాకుండా జమ్ముకశ్మీర్‌లో హింసకు పాకిస్థాన్‌నే కారణమని తెలిపారు.

‘‘చాలా విషయాల్లో ఈ ప్రభుత్వంతో నేను ఏకీభవించను. కానీ ఈ విషయంలో నేను ఓ స్పష్టతను ఇస్తున్నా. కశ్మీర్ అన్నది భారత అంతర్గత సమస్య. ఈ విషయంలో  పాక్‌తో పాటు మరే ఇతర దేశానికి జోక్యం చేసుకునే అర్హత లేదు. జమ్ముకశ్మీర్‌లో హింస జరుగుతోంది. ఈ హింసకు పాకిస్తాన్‌నే కారణం. ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. ఇది అందరికీ తెలుసు’’ అని ట్వీట్ చేశారు.

కాగా జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370ను రద్దు చేయడంపై పాకిస్తాన్ విషం కక్కుతోంది. కశ్మీర్‌ ప్రజల హక్కులను భారత ప్రభుత్వం హరిస్తోందని.. ఈ విషయంపై అంతర్జాతీయంగా పోరాడతామంటూ పాక్ అధికారులు ప్రగల్బాలు పలుకుతున్న విషయం తెలిసిందే.