Breaking News
  • దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై మహిళా సంఘాల అభ్యంతరం. ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా హైకోర్టుకు లేఖ రాసిన మహిళా సంఘాలు. కస్టడీలో ఉన్న నిందితులను ఎలా ఎన్‌కౌంటర్‌ చేస్తారని లేఖ. కోర్టులో కేసు నడుస్తుండగా చట్టాన్ని ఎలా చేతుల్లోకి తీసుకుంటారు. ఎన్‌కౌంటర్‌ చేసిన వారిపై చర్యలు తీసుకునేలా డీజీపీని ఆదేశించాలి. మృత దేహాలకు ఫోరెన్సిక్‌ నిపుణులతో పోస్టుమార్టం చేయించాలి. పోస్టుమార్టం వీడియో తీయించాలి-లేఖలో మహిళా సంఘాలు. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అందుబాటులో లేకపోవడంతో సోమవారం విచారిస్తామన్న హైకోర్టు.
  • కేంద్రీయ సైనిక్‌ బోర్డ్‌కు పవన్‌కల్యాణ్‌ విరాళం. కోటి రూపాయలు విరాళం ప్రకటించిన పవన్‌కల్యాణ్‌. స్వయంగా ఢిల్లీ వెళ్లి డీడీ అందిస్తా-పవన్‌కల్యాణ్‌.
  • ఎన్‌కౌంటర్లు సమస్యకు పరిష్కారం కాదు-ట్విట్టర్‌లో ఆర్జీవీ. సమాజంలో ఉద్రేకాలను తగ్గించేందుకు ఎన్‌కౌంటర్లు దోహదం చేయొచ్చు-ట్విట్టర్‌లో రామ్‌గోపాల్‌వర్మ.
  • తూ.గో: ఆంధ్రా పాలిటెక్నిక్‌ కాలేజ్‌లో విద్యార్థులపై దాడి. విద్యార్థులపై దాడి చేసిన బయటి వ్యక్తులు. ఇద్దరు విద్యార్థులకు గాయాలు పోలీసులకు ఫిర్యాదు, కేసు నమోదు.
  • గుంటూరు: పిడుగురాళ్ల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు. లెక్కలు చూపని రూ.56,700 స్వాధీనం, కేసు నమోదు.
  • ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైంది-చంద్రబాబు ట్వీట్‌. ఉల్లి ధరలతో జనం అల్లాడుతుంటే దేశమంతా ధరలు పెరిగాయని వైసీపీ మంత్రులు చెప్పడం హాస్యాస్పదం-ట్విట్టర్‌లో చంద్రబాబు. ఆరు నెలల్లోనే రాష్ట్రాన్ని దళారుల రాజ్యంగా మార్చారు. ఒక్క ఉల్లి మాత్రమే కాదు.. నిత్యావసరాల ధరలన్నీ చుక్కలనంటాయి. రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అన్నారు.. ఏమైంది. ఉల్లి కోస్తే వచ్చే కన్నీళ్లు.. ఉల్లిని కొంటున్నప్పుడే వస్తున్నాయి. ఉల్లి ధరల తడాఖా ఏంటో స్థానిక సంస్థల్లో మహిళలు చూపిస్తారు -ట్విట్టర్‌లో చంద్రబాబు
  • మహబూబ్‌నగర్‌: దిశ నిందితుల మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తి. రాత్రికి మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాస్పత్రిలోనే నిందితుల మృతదేహాలు. రేపు మహబూబ్‌నగర్ ఆస్పత్రికి వెళ్లనున్న ఎన్‌హెచ్ఆర్సీ ప్రతినిధులు. ఎన్‌హెచ్‌ఆర్సీ ప్రతినిధుల బృందం పరిశీలించిన తర్వాతే నిందితుల మృతదేహాలకు అంత్యక్రియలు. మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాస్పత్రి దగ్గర భారీగా పోలీస్‌ బందోబస్తు.

హైదరాబాద్ కార్వీకి ఏమైంది ? ఇన్వెస్టర్లలో ఆందోళన..

karvy delays broking payouts.. investors send sos to centre, హైదరాబాద్ కార్వీకి ఏమైంది ? ఇన్వెస్టర్లలో ఆందోళన..

హైదరాబాద్ లోని కార్వీ ఒక్కసారిగా లిక్విడిటీ క్రంచ్ ( సంక్షోభ దిశ) ను ఎదుర్కొంటున్నట్టు కనిపిస్తోంది. ఆముదం విత్తనాల కాంట్రాక్టుల్లో కమోడిటీ ట్రేడింగ్ క్లయింట్లు చెల్లింపులు జరపలేక చేతులెత్తేసినట్టు తెలుస్తోంది. ఇన్వెస్టర్లు సోషల్ మీడియా వేదికగా ఏకంగా ప్రధాన మంత్రి కార్యాలయానికి, ఆర్ధిక మంత్రిత్వ శాఖకు, సెబీకి ఎస్ ఓ ఎస్ మెసేజ్ లు పంపడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ చెల్లింపుల సమస్య మరింత ‘ విషమించి ‘ ఇతర ఇన్వెస్టర్లు కూడా కార్వీ తమకు పే మెంట్లు చేయడంలేదంటూ ఫిర్యాదులు చేస్తున్నట్టు సమాచారం. తన ట్రేడింగ్ ఖాతా నుంచి ప్రస్తుతమున్న సొమ్మును తన అకౌంటుకు బదిలీ చేయాలంటూ ఎన్నిసార్లు కోరినా సర్వర్ సమస్య ఉందంటూ జాప్యం చేస్తున్నారని దీపక్ ముంద్రా అనే ఇన్వెస్టర్ ట్వీట్ చేశారు. ఇలాగే బిందియాషా, ఎం కె ఆర్, గీతేష్, సతీష్ పవార్ వంటి పలువురు ఇన్వెస్టర్లు ట్వీట్లు చేశారు. అయితే చాలా వరకు ‘ ఇష్యు ‘ లను పరిష్కరిస్తున్నామని కార్వీ కూడా ట్వీట్ చేసింది. పైగా ఎవరికైనా సమస్యలుంటే వారు 040.. 33216400 అనే నెంబరును కాంటాక్ట్ చేయాలని సూచించింది. మరోవైపు మార్కెట్ పై ఎలాంటి తీవ్ర ప్రభావం లేకుండా చూసేందుకు సెబీ ఈ అంశాన్ని సున్నితంగా పరిష్కరించేందుకు యత్నిస్తున్నట్టు తెలుస్తోంది. నిజానికి కార్వీ క్లయింట్ల ‘ పే అప్ ‘ తో నిమిత్తం లేకుండా ఈ బ్రోకింగ్ సంస్థ చెల్లింపులు జరపవలసిందే. ప్రతి సంస్థకూ క్లియరింగ్ కార్పొరేషన్ వద్ద డిపాజిట్ల రూపంలో ఫండ్స్ ఉంటాయని, తన క్లయింట్ల నుంచి బ్రోకింగ్ సంస్థ ఫండ్స్ ను సేకరించలేకపోయి.. ఔట్ స్టాండింగ్ ట్రేడ్స్ ని సెటిల్ చేయలేకపోయిన పక్షంలో..ఈ కార్పొరేషన్ బ్రోకింగ్ సంస్థ డిపాజిట్ చేసిన నిధులను డిడక్ట్ చేసి దాన్ని ఇతరులకు చెల్లించాల్సి ఉంటుందని అంటున్నారు.

లిక్విడిటీ క్రంచ్ కారణంగా కార్వీకి చెందిన ఇతర కస్టమర్లు పది రోజులైనప్పటికీ చెల్లింపులు అందుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో ఈ సంస్థ ఉద్యోగుల జీతాలకు కూడా ఇబ్బంది ఏర్పడినట్టు తెలిసింది. అయితే దీపావళి సెలవుల కారణంగా చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని కార్వీ అధికారి ఒకరు ‘ మనీ కంట్రోల్ ‘ కు ఫోన్ ద్వారా తెలిపారు. లిక్విడిటీ క్రంచ్ సంక్షోభంలో తమ సంస్థ లేదని, సిబ్బందికి వేతనాల చెల్లింపుల్లో ఆలస్యం జరగడంలేదని చెప్పారు. స్టాక్ ఎక్స్ చేంజ్ రెగ్యులేషన్స్ ప్రకారం బకాయిలనన్నీ క్లియర్ చేస్తున్నామని ఆయన అన్నారు. అయితే మరో ఇన్వెస్టర్ 10 రోజులైనప్పటికీ తనకు సొమ్ము రాలేదని, తన లెడ్జర్ లో ఉన్నట్టు చూపుతున్నా యాక్సెస్ కాలేకపోతున్నానని ‘ భోరు ‘ మన్నారు. ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతో మంది తమ ఫండ్స్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి సెబీ గానీ ప్రధాన మంత్రి కార్యాలయం లేదా ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుందో చూడాలి. కార్వీ నిజంగా సంక్షోభంలో ఉందా అన్నది కూడా త్వరలో తేలనుంది.