కార్తీ ‘ఖైదీ’ టీజర్ ఎప్పుడంటే..!

Karthi New Movie, కార్తీ ‘ఖైదీ’ టీజర్ ఎప్పుడంటే..!

తమిళ హీరో కార్తీ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఖైదీ’. తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానున్న ఈ చిత్ర తెలుగు వెర్షన్ కు మరో టైటిల్ ను పరిశీలిస్తున్నారు చిత్ర యూనిట్. కాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ-లుక్ టీజర్‌ను ఈ నెల 30న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు వెల్లడించారు.

యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తిగా చీకట్లో జరిగిందని తెలుస్తోంది. డ్రీం వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రభు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే కార్తీ చేస్తున్న ఈ కొత్త ప్రయోగం ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *