Breaking News
  • ఆల్ టైమ్ రికార్డ్సు స`ష్టిస్తున్న గోల్డ్ , సిల్వర్ . 10 గ్రాముల బంగారం రూ 58,330 . కేజీ వెండి రూ 78,300. ఈ వారంలోనే మూడు సార్లు పెరిగిన బంగారం ధర . ప్రతిసారీ 8వందల నుంచి వేయి పెరిగిన గోల్డు. 65 వేలకు చేరుకుంటుందంటున్న మార్కెట్ అంచనాలు.
  • ప్రముఖ మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పై అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వ్యక్తి అరెస్ట్.. పిడుగురాళ్ల మండలం చెందిన వందనపు నాగారాజు ఈ నెల 2వ తారీఖున క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్ట్ ముంబైలో కేసు నమోదు. ఐపీ అడ్రస్ పిడుగురాళ్ల గా గుర్తింపు. పోస్ట్ పెట్టిన వ్యక్తి ని అదుపులోకి తీసుకున్న ముంబై పోలీసులు.
  • టీవీ9 తో ఎ పి జైళ్ల శాఖ ఐ జి జయవర్ధన్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జైళ్లలో ఉన్న ఖైదీలకు కరోనా టెస్టులు చేయిస్తున్నాం. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 420 మంది ఖైదీలకు, 60 మంది స్టాఫ్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. నిన్న ఒక్కరోజే రాజమండ్రి సెంట్రల్ జైలు లో 245 మందికి పాజిటివ్ వచ్చింది. రాజమండ్రి సెంట్రల్ జైల్ లోనే ఐసోలేషన్ సెంటర్ ని ఏర్పాటు చేశాం. పాజిటివ్ వచ్చినవాళ్ళల్లో ఎక్కువశాతం మైల్డ్ కేసులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జైళ్లకు అప్రమత్తత చేశాం. ఐసోలేషన్ సెంటర్ నుంచి ఖైదీల పారిపోవడానికి ప్రయత్నిస్తే శిక్షలు కఠినంగా ఉంటాయి. ఖైదీలకు నాణ్యమైన ఆహారాన్ని వైద్య సౌకర్యాన్ని అందిస్తూ డాక్టర్ల పర్యవేక్షణ చేస్తున్నాం. పాజిటివ్ వచ్చిన ఖైదీల వివరాలు కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తున్నాము. ఖైదీల కుటుంబ సభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
  • అనంతపురం కన్సెప్ట్ సిటీ కన్సల్టెంట్ గా CBRE సౌత్ ఆసియా ప్రైవేట్ లిమిటెడ్ . భవిష్యత్ వ్యాపార అవసరాల కోసం రాష్ట్రం లో 3 కాన్సెప్ట్ సిటీలు ప్లాన్ చేసిన సర్కార్ . అనంతపురం కాన్సెప్ట్ సిటీకి కాన్సెప్టువల్ ప్లాన్, ఫీజబిలిటి రిపోర్ట్, బిజినెస్ స్ట్రాటజీ, ఫైనాన్సియల్ మోడల్ ప్రణాళిక సిద్దం చేసి అమలు చేయనున్న CBRE. ఇందుకోసం దాదాపు 85 లక్షల రూపాయలకు పరిపాలన అనుమతులు మంజూరు.
  • తమిళనాడు లో ఘోర రోడ్డు ప్రమాదం. కోయిఅంబత్తూర్ లోని ఆనకట్ట రహదారిలో చెట్టుని డీ కొట్టిన కారు . కారులో ప్రయాణిస్తున్న యువకులలో నలుగురు మృతి , ఒకరి పరిస్థితి విషమం . కారు అతివేగం గా నడపడం ప్రమాదానికి కారణం . ఫ్రెండ్స్ పుట్టినరోజు వేడుకలు వెళ్లివస్తుండగా జరిగిన ఘటన.
  • దేశవ్యాప్తంగా పాజిటివిటీ రేటు 8.87శాతం, రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 8.56శాతం, కర్ణాటకలో 9.88శాతం, తమిళనాడులో 9.26శాతం, మహారాష్ట్రలో 19.36శాతం, ఢిల్లీలో 12.75శాతం. మరణాల రేటు దేశంలో 2.07శాతం, ఏపీలో 0.89శాతం. కర్ణాటకలో 1.85శాతం, కర్ణాటకలో 1.85శాతం, తమిళనాడులో 1.63శాతం, మహారాష్ట్రలో 3.52శాతం. ప్రతి పదిలక్షల మందిలో 43,059 మందికి పరీక్షలు. శ్రీకాకుళం, కర్నూలు, కడప, కృష్ణా, నెల్లూరు, పశ్చిమగోదావరి, చిత్తూరులో రాష్ట్రం సగటుకన్నా ఎక్కువ పరీక్షలు.
  • ఈఎస్ఐ స్కామ్ లో అరెస్టైన ఏపీ సచివాలయ ఉద్యోగి మురళీ మోహన్ ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం . గత నెల 10 తేదీన సచివాలయంలో మురళీ మోహన్ ను అరెస్ట్ చేసిన ఏసీబీ. కార్మిక శాఖ మాజీ మంత్రికి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన కాలంలో ఈఎస్ఐ కుంభకోణంలో మురళీ పాత్ర ఉందని ఏసీబీ అభియోగం. అరెస్టైన నాటి నుంచి సస్పెన్షన్ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ఆదేశాలు. ప్రస్తుతం పట్టణాభివృద్ధి శాఖలో సెక్షన్ ఆఫీసరుగా విధులు నిర్వహిస్తోన్న మురళీ మోహన్.
  • భూముల విలువలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల సందడి . భుాముల విలువ పె౦పు అమలులోకి వస్తే భార౦ పడుతుందని ము౦దుగానే రిజిస్ట్రేషన్ లు వెలుతోన్న జిల్లా వాసులు.

‘దొంగ’ రివ్యూ

Donga telugu movie review, ‘దొంగ’ రివ్యూ

నటీనటులు: కార్తీ, జ్యోతిక, నిఖిల విమల్, సత్యరాజ్, సీత, షావుకారు జానకి, ఇళవరసు తదితరులు
దర్శకత్వం: జీతూ జోసెఫ్
నిర్మాతలు: వియాకమ్ 18 మోషన్ పిక్చర్స్, సూరజ్ సాధన
సంగీతం: గోవింద్ వసంత
సినిమాటోగ్రఫీ: ఆర్‌డీ రాజశేఖర్

కోలీవుడ్ నటుడే అయినప్పటికీ టాలీవుడ్‌లో మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు నటుడు కార్తి. సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటికీ.. తనకంటూ ఓ ఐడెంటిటీని తెచ్చుకున్న కార్తి.. డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తుంటాడు. ఇక దీపావళి సమయంలో ఖైదీ సినిమాతో హిట్ కొట్టిన కార్తీ ఇప్పుడు దొంగతో మరోసారి ప్రేక్షకులను పలకరించేందుకు వచ్చాడు. జీతూ జోసెఫ్(దృశ్యం ఫేమ్) దర్శకత్వం వహించడం.. రియల్ లైఫ్‌లో కార్తీ వదిన అయిన జ్యోతిక ఈ మూవీలో అతడి సోదరిగా నటించడంతో.. దొంగపై మొదటి నుంచి అంచనాలు మంచిగా ఉన్నాయి. మరి ఈ అంచనాలను దొంగ ఏ మేరకు అందుకుందో తెలియాలంటే సమీక్షలోకి వెళ్లాల్సిందే.

కథ:
సంపన్న కుటుంబానికి చెందిన ఙ్ఞాన మూర్తి(సత్య రాజ్) తప్పి పోయిన తన కుమారుడు శర్వా కోసం 15ఏళ్లుగా వెతుకుతుంటాడు. ఙ్ఞాన మూర్తి కుమార్తె పార్వతి(జ్యోతిక)కూడా తన తమ్ముడి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఈ విషయం తెలిసిన గోవా పోలీస్ అధికారి జీవానంద్(ఇళవరసు) డబ్బు కోసం విక్కీ(కార్తీ)ని శర్వాగా వారింట్లో ప్రవేశపెడతాడు. ఆ ఇంటికి రాకముందు గోవాలో చిన్న చిన్న దొంగతనాలు, చీటింగ్‌లు చేస్తూ బ్రతికేస్తుంటాడు విక్కీ. మరి శర్వాగా ఙ్ఞాన మూర్తి ఇంట్లోకి వెళ్లిన విక్కీ అక్కడ ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి..? ఙ్ఞాన మూర్తి కుటుంబం విక్కీని శర్వాగా నమ్మిందా..? చివరకు విక్కీ, పార్వతి, ఙ్ఞాన మూర్తిల కథ ఎలా ముగిసింది..? అనేది కథ.

కథనం:
దృశ్యంతో మంచి పేరు సాధించుకున్న జీతూ జోసెఫ్.. మరోసారి థ్రిల్లర్ కథనే ఎంచుకున్నారు. ఒక చిన్న పాయింట్‌నే తన కథగా తీసుకున్నప్పటికీ.. దానిని తెరకెక్కించడంలో చాలావరకు సక్సెస్ అయ్యారు. ఫస్టాఫ్‌ కాస్త బోర్‌గా తీసినప్పటికీ.. సెకడాంఫ్‌లో మాత్రం ట్విస్ట్‌లతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పుట్టించారు. అయితే తమిళ్‌లో ఈ మూవీకి తంబీ(తమ్ముడు)అనే టైటిల్ పెట్టడంతో.. సినిమా మొత్తం జ్యోతిక, కార్తీ మధ్య జరుగుతుందని ప్రేక్షకులు భావించారు. కానీ జ్యోతిక పాత్రను ఆయన కాస్త నిర్లక్ష్యం చేశారు. అలాగే అక్కడక్కడ అతడు ఛాయలు కూడా ఈ సినిమాలో కనిపిస్తాయి. దీంతో అందరినీ ఈ సినిమా మెప్పించకపోవచ్చు. కానీ క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

నటీనటులు:
ఈ సినిమాకు మొదటి అస్సెట్ కార్తీ. ఫస్టాఫ్‌లో తన కామెడీ టైమింగ్‌తో నవ్వించిన కార్తీ.. సెకండాఫ్‌లో యాక్షన్, ఎమోషన్లలో కూడా మెప్పించారు. ఇక కార్తీ తరువాత సత్యరాజ్‌కు ఈ సినిమాలో మంచి స్పేస్ లభించింది. భిన్న షేడ్స్‌లో తన పాత్రను పూర్తి న్యాయం చేశారు సత్యరాజ్. ఇక జ్యోతికకు మొదటి భాగంలో పెద్దగా సన్నివేశాలు లేకపోగా.. క్లైమాక్స్‌లో తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. వీరితో పాటు చాలా కాలం తరువాత తిరిగొచ్చిన తన ప్రియుడి కోసం తపించే అమ్మాయి పాత్రలో నిఖిల విమల్, కన్నింగ్ పోలీస్ అధికారిగా ఇళవరసి.. జ్యోతిక ట్యూషన్ స్టూడెంట్‌గా చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక విభాగం:
గోవింద వసంత అందించిన పాటలు మంచి టాక్‌ను తెచ్చుకోగా.. బీజీఎమ్ ఫర్వాలేదనిపిస్తుంది. ఇక సినిమాటోగ్రాఫర్ రాజశేఖర్ పనితనం ఈ సినిమాకు మరో అస్సెట్. అందమైన కొండ ప్రాంతంలో నడిచిన మూవీ సన్నివేశాలను ఆయన చక్కగా తెరకెక్కించారు. ఎడిటింగ్ పర్వాలేదనిపిస్తుంది.

తీర్పు:
థ్రిల్లర్ కథాంశాలను మెచ్చే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. అయితే కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడంతో.. బీ, సీ సెంటర్లలో ఇది పెద్దగా ఆడకపోవచ్చు. అందునా తెలుగులో తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ కార్తీ తన సినిమాను విడుదల చేశాడు. ఈ నేపథ్యంలో కమర్షియల్‌గా ఈ మూవీ ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

Related Tags