Breaking News
  • చైనీస్ గేమింగ్ కేసుల్లో కొత్త కోణాలు . గేమింగ్ లో బెట్టింగ్ పెట్టి ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు వ్యక్తులు . ఎస్ఆర్ నగర్ లో 6 లక్షలు , అదిలాబాద్ లో 15 లక్షలు పోగొట్టుకున్న యువకుడు సూసైడ్ . తాము కూడా లక్షలు పోగొట్టుకున్నామని సైబర్ క్రైమ్ కు క్యూ కడుతున్న బాధితులు . టెలిగ్రామ్ యాప్ లో గ్రూప్స్ ఫై సైబర్ క్రైమ్ పొలిసుల విచారణ . టెలిగ్రామ్ యాప్ లో గ్రూప్ ల ద్వారా వస్తున్న రిఫెరల్ కోడ్ , ప్రెడిక్షన్ ల ఫై కేసు నమోదు చేయనున్న సైబర్ క్రైమ్ పోలీసులు . చైనా దేశస్థుడు యాహువో, దిల్లీకి చెందిన ధీరజ్‌ సర్కార్‌, అంకిత్‌ కపూర్‌, నీరజ్‌ లను కస్టడీ తీసుకోనున్న పోలీసులు . బెట్టింగ్ యాప్ లో ద్వారా 110 కోట్లు వసూళ్లు . పెమా , మని ల్యాండరింగ్ జరిగినట్టు ప్రాధమిక అంచనా . కంపెనీ డైరెక్టర్ ల లావాదేవీ ల ఫై ఈడీ కి లేక రాయనున్న సీసీఎస్ పోలీసులు.
  • చెన్నై : ప్రముఖ నటి నిక్కీగల్రనికి కరోనా సోకినట్టు నిర్ధారణ . తెలుగు తమిళ్ మలయాళం లో పలు చిత్రాలలో నటించిన నటి నిక్కీగల్రని. తనకు వైద్యపరీక్షల అనంతరం కరోనా సోకినట్టు వైద్యులు నిర్ధారించారని , ప్రస్తుతం తన ఆరోగ్యం మెరుగ్గానే ఉందని తన ట్విట్టర్ లో వెల్లడి
  • తెలంగాణ పోలీస్ శాఖ లో కరోనా కలకలం . తెలగాణలో 4259 మంది పోలీసులకు కరోనా . ఎక్కువగా హైదరాబాద్ కమిషనరేట్ లిమిట్స్ లో 1946 మంది పోలీస్ ల కి కరోనా . తెలంగాణ వ్యాప్తం గా కరోనా తో 39 మంది పోలీసులు మృతి . హైద్రాబాద్ కమీషనరేట్ లిమిట్స్ లో 26 మంది మృతి . పోలీస్ కరోనా కేసుల్లో హైద్రాబాద్ తర్వాత వరంగల్ , రాజన్న సిరిసిల్ల , నల్గొండ లో పోలిసులకు ఎక్కువ కరోనా కేసులు.
  • అమీన్పూర్ అనాధ ఆశ్రమంలో.. మైనర్ బాలిక అత్యాచారం ఘటనలో కొత్త కోణం. ఆలస్యంగా వెలుగులోకి మారుతీ అనాధ ఆశ్రమ ఆగడాలు. మరోమైనర్ బాలికపై సైతం నిందితుడు వేనుగోపాల్ లైంగికదాడి. కుటుంబ సభ్యులు నిలదీయడంతో నిర్వాకుల బెదిరింపులు. ఆలస్యంగా వెలుగులోకి మారుతీ అనాధ ఆశ్రమ ఆగడాలు. సంగారెడ్డి చైల్డ్ వెల్ఫేర్ సభ్యురాలితో నిందితులకు సన్నిహిత సంభందాలు. జిల్లా చెల్డ్ వెలిఫేర్ కమిటీ సభ్యురాలి సహకారంతో అక్రమాలు. లాక్డౌన్ సమయంలో రెస్కూచేసిన మైనర్లను ఇక్కడికే పంపాలనీ సిబ్బందిపై ఒత్తిడి. కమిటీ సమావేశాలకు సైతం నేరూగా హాజరైన నిందితుడు వేణుగోపాల్. హైపవర్ కమిటీ విచారణలో వెలుగులోకి వస్తున్న మారుతీ అనాధ ఆశ్రమం ఆగడాలు. అనాధ ఆశ్రమంలోని 70మందిని విచారించనున్న అధికారులు. రాష్ట్రం లోని ఇతర అనాధ ఆశ్రమలాల్లో సైతం తనిఖీలకు అధికారుల ఆదేశం. రాష్ట్ర వ్యాప్తంగా 400ఆశ్రమాలు,19వేల మంది అనాధలు.
  • టాలీవుడ్ లో మరో పొలిటికల్ డ్రామా ఫిల్మ్ రూపొందుతోంది. నారా చంద్రబాబు నాయుడు, వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ల స్నేహాన్ని, రాజకీయ శతృత్వాన్ని తెరకెక్కిస్తున్నారు. "ఇంద్రప్రస్థం" పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా కు దర్శకుడు దేవా కట్టా. రీసెంట్ గా కథా చౌర్యం వివాదంలో పడిన ఈ కథ ఇప్పుడు టాక్ ఆప్ ద టాలీవుడ్.
  • మర్డర్ సినిమా విడుదల నిలిపివేయాలని అమృత వేసిన పిటిషన్ పై ఇవాళ నల్గొండ SC, ST కోర్టులో విచారణ.
  • స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం పై విచారణ వేగవంతం చేసిన పోలీసులు. స్వర్ణ ప్యాలెస్ ఘటనలో అరెస్ట్ అయిన ముగ్గురు నిందితులను కస్టడీ కి కోరుతు కోర్టు లో పిటిషన్ దాఖలు చేసిన పోలీసులు. ముగ్గురు నుండి మరికొన్ని విషయాలు సేకరించేందుకు వారం రోజుల పాటు కస్టడీ కి ఇవ్వాలని విజయవాడ 3rd ఏసిఎమ్ఎమ్ కోర్టు లో పిటిషన్ దాఖలు చేసిన పోలీసులు. కౌంటర్ పిటిషన్ దాఖలు చేయనున్న నిందితుల తరుపున న్యాయవాది.

90ఎంఎల్ రివ్యూ.. కిక్ ఏ మేరకు ఎక్కిందంటే..!

Karthikeya Latest movie review, 90ఎంఎల్ రివ్యూ.. కిక్ ఏ మేరకు ఎక్కిందంటే..!

సినిమా:90ఎంఎల్
దర్శకత్వం: శేఖర్ రెడ్డి యర్ర
నిర్మాత: అశోక్‌రెడ్డి గుమ్మకొండ
నటీనటులు: కార్తికేయ, నేహా సోలంకి, రవి కిషన్, రావు రమేష్, సత్యప్రకాష్, ప్రగతి, పోసాని కృష్ణమురళి తదితరులు
సంగీతం: అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ: యువరాజ్
ఎడిటింగ్: ఎస్‌ఆర్ శేఖర్

‘ఆర్ఎక్స్ 100’ వంటి సెన్సేషనల్ చిత్రంతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన కార్తికేయ.. ఆ తరువాత ‘హిప్పీ’, ‘గుణ 369’తో ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. ఈ మధ్యలోనే నాని ‘గ్యాంగ్‌లీడర్’ కోసం విలన్‌గా మారి మంచి మార్కులే కొట్టేశాడు. ఇక ఇప్పుడు’90ఎమ్‌ఎల్‌’లో నటించాడు. అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో వివాదం నడిచినప్పటికీ.. సెన్సార్ నుంచి ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది.? ప్రేక్షకులకు 90ఎంఎల్ కిక్కు ఏ మేరకు ఎక్కింది..? అన్నది తెలియాలంటే సమీక్షలోకి వెళ్లాల్సిందే.

కథ:
దేవదాసుకు (కార్తికేయ) ఒక అరుదైన జబ్బు ఉంటుంది. అదేంటంటే ఒక్కపూట తాగకపోయిన అతడు చచ్చిపోతాడు. దాంతో తల్లిదండ్రులు దేవదాసుకు మందు అలవాటు చేస్తారు. ఈ క్రమంలో అసలు మందు వాసన కూడా పడని సువాసన(నేహా సోలంకి) ప్రేమలో పడతాడు. సువాసన కూడా దేవదాసును ఇష్టపడుతుంది. కానీ దేవదాసు వింత జబ్బు ఉందని తెలియని సువాసన.. అతడు ఒక్కరోజు కూడా తాగకుండా ఉండటాన్ని చూసి ద్వేషించడం మొదలుపెడుతుంది. అదే సమయంలో జాన్ విక్(రవి కిషన్) అనే వ్యాపారవేత్త సువాసనను ప్రేమిస్తానని వస్తాడు. మరి దేవదాసు ఏం చేశాడు..? తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు..? అన్నది మిగిలిన కథ.

Karthikeya Latest movie review, 90ఎంఎల్ రివ్యూ.. కిక్ ఏ మేరకు ఎక్కిందంటే..!

కథనం:
‘భలే భలే మగాడివోయ్’, ‘రంగస్థలం’, ‘రాజా ది గ్రేట్’ వంటి హిట్ చిత్రాల్లో హీరోలకు డిసీజ్‌లు ఉంటాయి. ఈ సినిమాలు హిట్ అవ్వడంతో.. మిగిలిన హీరోలు కూడా లోపం ఉండే కారెక్టర్‌ కథల్లో నటించేందుకు ఆసక్తిని చూపుతున్నారు. ఈ క్రమంలోనే కార్తికేయ ఈ కథకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే హీరో మందు తాగకపోతే చచ్చిపోవడం అనే కొత్త పాయింట్‌ను దర్శకుడు తీసుకున్నప్పటకీ.. కథనంలో మాత్రం రొటీన్ ఫార్ములానే ఫాలో అయ్యాడు దర్శకుడు. ఇక విలన్ కారెక్టర్‌ను ఏమనుకొని డిజైన్ చేశాడో అస్సలు అర్థం కాదు. ఇక దేవదాసుతో మందు మానిపించే సన్నివేశంలో ఏం చెప్తున్నాడో దర్శకుడు తికమక పడ్డాడు. ఇక ఫస్టాఫ్ కాస్త పర్వాలేదనిపించినా.. సెకండాఫ్ మాత్రం బాగా సాగదీశాడు దర్శకుడు.

నటీనటులు:
దేవదాసు పాత్రలో కార్తికేయ బాగా నటించాడు. సరదా సన్నివేశాలతో పాటు ఎమోషనల్ సీన్లతో మెప్పించాడు. హీరోయిన్ నేహా సోలంకి అందాలు ఆరబోసినప్పటికీ.. కథలో పెద్దగా ఇమడలేకపోయింది. అందంగా ఉన్నా, అభినయం అంతగా చూపించలేకపోయింది. రవికిషన్‌ కూడా విలన్ పాత్రకు న్యాయం చేశాడు. వీరితో పాటు రావు రమేష్, అజయ్, రఘు, ప్రగతి, సత్యప్రకాష్ తదితరులు తమ పాత్రల మేర ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

సాంకేతిక విభాగం:
ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ అందించిన పాటలలో సింగిల్ సింగిల్ మినహా.. మిగిలిన పెద్దగా ఆకట్టుకోలేదు. సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. సినిమాకు మైనస్‌లలో ఎడిటింగ్ ఒకటి అని చెప్పొచ్చు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక కొత్త పాయింట్‌ను తీసుకున్నప్పటికీ.. స్క్రీన్‌ప్లే సరిగా లేకపోవడంతో ప్రేక్షకులను అనుకున్నంతమేర మెప్పించలేకపోయాడు.

ఫైనల్‌గా:
ప్రేక్షకులకు అంతగా ఎక్కని 90ఎంఎల్ కిక్కు

Related Tags