తెలంగాణ వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వేడుకలు.. శైవక్షేత్రాలకు పోటెత్తుతున్న భక్తులు.. కిటకిటలాడుతున్న ఆలయాలు..

తెలంగాణ వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వేడుకలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. కార్తీకపౌర్ణమిని పురస్కరించుకుని భక్తులు వేకువ జామునే..

తెలంగాణ వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వేడుకలు.. శైవక్షేత్రాలకు పోటెత్తుతున్న భక్తులు.. కిటకిటలాడుతున్న ఆలయాలు..
Follow us

|

Updated on: Nov 30, 2020 | 10:11 AM

తెలంగాణ వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వేడుకలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. కార్తీకపౌర్ణమిని పురస్కరించుకుని భక్తులు వేకువ జామునే పుణ్యస్నానాలు ఆచరించి ఆలయాలకు తరలి వెళ్తున్నారు. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన యాదగిరి లక్ష్మినరసింహ స్వామి ఆలయం, వరంగల్ భద్రకాళీ టెంపుల్, వేయి స్థంభాల గుడి, కొండగట్టు, బాసర, భద్రాద్రి రామాలయం, వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం సహా పుణ్యక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆదిదేవుడి దర్శనం కోసం ఆలయాల్లో భక్తులు బారులు తీరుతున్నారు. ఆలయాల్లో కార్తీక దీపాలను వెలిగించి దేవదేవుడి నామాన్ని స్మరించుకుంటున్నారు.

ఇక ప్రముఖ దివ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తున్నారు. నరసింహ స్వామి దర్శనం కోసం భక్తులు భారీగా తరలి రావడంతో క్యూలైన్లలో సందడి నెలకొంది. కాగా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆలయ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు ఆలయ ప్రాంగాణాన్ని శుభ్ర పరుస్తున్నారు. భక్తుల మధ్య సామాజిక దూరం ఉండేలా చూస్తున్నారు.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.