తిరుమలలో ఈనెల 30వ తేదీన కార్తీక దీప మహోత్సవం.. పాల్గొననున్న విజయేంద్ర సరస్వతి..

కార్తీక మాసం సందర్భంగా ఈనెల 30వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానంలో కార్తీక దీప మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి టీటీడీ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు.

  • Anil kumar poka
  • Publish Date - 10:57 am, Thu, 26 November 20

కార్తీక మాసం సందర్భంగా ఈనెల 30వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానంలో కార్తీక దీప మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి టీటీడీ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. తిరుపతిలో తొలిసారి నిర్వహిస్తున్న కార్తీక దీప మహోత్సవ కార్యక్రమాన్ని టీటీడీ పరిపాలన భవనం వెనుకవైపున ఉన్న క్రీడా మైదానంలో నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. కాగా, దీపోత్సవంలో కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి పాల్గొని అనుగ్రహ భాషణం చేస్తారని తెలిపారు.

ఇదిలాఉండగా, నివార్ తుపాన్ ప్రభావం తిరుమలపైనా పడింది. తుఫాను కారణంగా తిరుమలలో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో శ్రీవారి ఆలయ ప్రాంగణం అంతా జలమయం అయ్యింది. వర్షం కారణంగా శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు తిరుమల ఘాట్ రోడ్లలో కొండ చరియలు విరిగిపడ్డాయి. రెండో కనుమ దారి హరిణి ప్రాంతంలో బండరాళ్లు విరిగి ఓ కారు మీద పడ్డాయి. అయితే కారులో ప్రయాణికులెవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పినట్లైంది. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.