కార్తీ ప్రయోగం ఫలిస్తుందా..!

తమిళ హీరో కార్తీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ప్రయోగాత్మక చిత్రం ‘ఖైదీ’. జైలు శిక్ష పడిన ఓ ఖైదీ.. అక్కడ నుంచి ఎలా తప్పించుకున్నాడు.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి అనేది ఈ చిత్ర నేపధ్యం. ఈ సినిమా షూటింగ్ 62 రోజుల్లో పూర్తయింది. అంతేకాదు 62 రోజులూ నైట్ మాత్రమే షూటింగ్ చేశారట. ఇలా నిర్విరామంగా నైట్ షూట్ చేసిన సినిమా బహుశా ఇది ఒక్కటే అయి ఉంటుంది. రీసెంట్‌గా రిలీజైన ఈ చిత్రం ప్రీ-లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. మరి కార్తీ చేస్తున్న ఈ ప్రయోగం బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమేరకు విజయం సాధిస్తుందో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *