Breaking News
  • విజయవాడ: ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర ఉద్రిక్తత. ధర్నాచౌక్‌ నుంచి మందడం బయల్దేరిన కర్నాటక రైతులు. అనుమతిలేదంటూ ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర అడ్డుకున్న పోలీసులు.
  • చంద్రబాబుతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ భేటీ. అమరావతి కార్యాచరణపై చర్చ.
  • మైలవరం ఫారెస్ట్ అధికారిపై వైసీపీ మండలాధ్యక్షుడు దాడికియత్నం. అటవీ భూమిని చదును చేస్తుండగా అడ్డుకున్న ఫారెస్ట్ అధికారి . ఫారెస్ట్‌ అధికారితో వాదనకు దిగిన వైసీపీ నేత పామర్తి శ్రీను.
  • ప.గో: చంద్రబాబుది యూటర్న్‌ గవర్నమెంట్‌ అయితే.. జగన్‌ది రద్దుల గవర్నమెంట్‌. మంగళగిరిలో లోకేష్‌ ఓడిపోయి.. మండలిలోకి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలు అడుకుంటున్నారు. రాజకీయ పునరావాసానికి మండలి వేదికగా మారింది-బీజేపీ నేత అంబికా కృష్ణ.
  • తూ.గో: తునిలో కారులో ఇరుక్కున్న మూడేళ్ల బాలుడు. మూడేళ్ల బాబును కారులో వదిలి వెళ్లిన తల్లిదండ్రులు. కారు డోర్లు లాక్‌ కావడంతో ఉక్కిరిబిక్కిరైన బాలుడు. కారు అద్దాలు పగలగొట్టి చిన్నారిని కాపాడిన స్థానికులు.

రాజమౌళి సినిమాలో నన్ను పెట్టాలి.. ఫ్యామిలీ ‘దొంగ’ అదరగొట్టాడు..!

Karthi Donga Movie Trailer, రాజమౌళి సినిమాలో నన్ను పెట్టాలి.. ఫ్యామిలీ ‘దొంగ’ అదరగొట్టాడు..!

తమిళ హీరో కార్తీ అంటే.. అతని నుంచి ఏదో ఒక డిఫరెంట్ ఫిల్మ్ వస్తుందనే చెప్పాలి. అతను ఎంచుకునే ప్రతీ కథ డిఫరెంట్‌ యాంగిల్లో ఉంటాయి. అలాగే.. దొంగ సినిమా కూడా ఉండబోతుందనడంలో ఆశ్చర్యం లేదు. ఈ నేపథ్యంలోనే.. ఖైదీ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన యాంగ్రీ హీరో కార్తీ ఇప్పుడు ‘దొంగ’గా రానున్నాడు. ఈ సినిమాలో.. హీరో సూర్య భార్య జ్యోతిక.. కార్తీకి.. అక్కగా కీలక పాత్రలో నటించారు. అయితే.. కాసేపటి క్రితమే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్‌ అయ్యింది.

ట్రైలర్ టాక్:  అన్ని ఎమోషన్స్‌ని క్యారీ చేస్తూ.. ట్రైలర్‌ అద్భుతంగా ఉంది. ‘న్యాయంగా రాజమౌళి సినిమాలో నన్ను పెట్టాలి.. కానీ ఎవర్నెవర్నో పెడుతున్నారు’ అంటూ కార్తీ చెప్పే డైలాగ్స్ కామెడీగా ఉన్నాయి. అలాగే.. ఇంట్లో ఒక అక్క అంటే ఇద్దరి అమ్మలతో సమానం.. అన్న డైలాగ్స్ ఎంతో ఎమోషన్‌గా.. హార్ట్ టచ్‌గా ఉన్నాయి.

చాలా రోజుల తరువాత.. జ్యోతికాకి పవర్ ఫుల్ క్యారెక్టర్ దొరికింది. ఇందులో జ్యోతిక యాంగ్రీ ఉమెన్ పాత్రలో కనిపించింది. 15 సంవత్సరాల తరువాత.. కుటుంబం ఇబ్బందుల్లో ఉందని.. శర్వా అలియాస్ కార్తీ ఇంటికి వస్తాడు. అయితే.. తాను.. కార్తీనేనా అని అందరూ అనుమానిస్తూంటారు. కాగా.. ఎమెషన్స్, యాక్షన్, సెంటిమెంట్, కామెడీ ఇలా అన్ని వాటిని ఎలివేట్స్ చేస్తూ.. ట్రైలర్ ఉంది. అయితే.. కార్తీ.. నిజంగానే ఆ ఇంటిలోని సభ్యుడా.. లేక దొంగ రూపంలో ఉండి.. యాక్టింగ్ చేస్తున్నాడా అనేది.. సినిమా రిలీజ్ అయ్యాకనే తెలుస్తుంది.

ఈ చిత్రానికి జోసెష్ దర్శకత్వం వహిస్తుండగా.. వయాకామ్ 18 స్టూడియోస్‌, ప్యారలల్ మైండ్స్ ప్రొడక్షన్ పతాకాలపై తెరకెక్కించారు.  అయితే ఇప్పటికే వచ్చిన ఈ సినిమా ఈ పోస్టర్స్‌కి, టీజర్స్‌కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా.. ఈ సినిమా డిసెంబర్ 20న అన్ని భాషల్లోనూ… ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.