రణరంగమైన ప్రెస్‌‌క్లబ్‌… ఏం జరిగింది.. ?

సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎస్సీ,ఎస్టీ పరిరక్షణ సమితి నేత కర్నె శ్రీశైలం మీడియాతో మాట్లాడుతుండగా.. స్వేరో మెంబర్లు దాడి చేశారు. ప్రెస్‌క్లబ్‌లో న్యూస్ కవర్ చేస్తున్న వారిపై కూడా దాడికి పాల్పడ్డారు. తెలంగాణ గురుకుల స్కూల్స్‌ కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌ అక్రమాలు బయటపెడతానని కర్నె శ్రీశైలం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఇది ప్రారంభమైన కొద్ది సేపటికే స్వేరో మెంబర్లు వచ్చి ఆయనపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన అక్కడి రిపోర్టర్లపై కూడా దాడికి పాల్పడ్డారు. వెంటనే అప్రమత్తమైన శ్రీశైలం అనుచరులు ఆయన్ని బయటికి తీసుకెళ్లారు. అయినప్పటికీ అతనిని వెంటాడి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పంజాగుట్ట పీఎస్‌లో స్వేరో మెంబర్లు అంటూ ఓయూకు సంబంధించిన కొంతమంది తనపై దాడికి పాల్పడ్డారంటూ కర్నె శ్రీశైలం ఫిర్యాదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *