Breaking News
  • చెన్నై: ఐఐటీ విద్యార్థిని ఫాతిమా లతీఫ్‌ ఆత్మహత్య కేసు. ఫాతిమా లతీఫ్‌ ఆత్మహత్యపై విద్యార్థి సంఘాల ఆందోళనలు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పద్మనాభన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌. నేడు ఐఐటీ ముట్టడికి విద్యార్థి సంఘాల పిలుపు.
  • కరీంనగర్‌: అలుగునూరులో రోడ్డుప్రమాదం. లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి. మృతులు సాయికిరణ్‌, సాయికృష్ణగా గుర్తింపు.
  • నిజామాబాద్‌: భీమ్‌గల్‌ మండలం లింబాద్రిగుట్ట జాతరలో ప్రమాదం. డ్యాన్సింగ్‌ వీలుపై నుంచి పడి రవి అనే వ్యక్తికి తీవ్రగాయాలు. నిజామాబాద్‌ ఆస్పత్రికి తరలింపు.
  • ప్రభుత్వం 50 మంది కార్మికులను చంపేసింది. తప్పుడు విధానాలతో భవన నిర్మాణ కార్మికులు ఆకలితో చనిపోతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నా. వ్యక్తిగతంగా విమర్శించను.. తప్పుడు విధానాలపైనే ప్రశ్నిస్తున్నా. కార్మికుల కష్టాలను సీఎం జగన్‌ పట్టించుకోవాలి-పవన్‌కల్యాణ్‌.
  • విశాఖ: ఏజెన్సీలో తగ్గిన ఉష్ణోగ్రతలు. అరకులో 13, చింతపల్లిలో 8, మినుములూరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రత. పాడేరులో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.
  • కర్నూలు: విజయానికేతన్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌, డైరెక్టర్‌ అరెస్ట్. సాంబార్‌ గిన్నెలో పడి విద్యార్థి మృతి చెందిన ఘటనలో అరెస్ట్‌. కరస్పాండెంట్ నాగమల్లేశ్వరరెడ్డి, డైరెక్టర్ విజయకుమార్‌రెడ్డిని.. రహస్యంగా రిమాండ్‌కు తరలించిన పాణ్యం పోలీసులు. హాస్టల్‌కు అనుమతి లేదని తేల్చిన విద్యాశాఖ అధికారులు. ఇంత వరకు బయటకు రాని సీసీఫుటేజ్‌. హాస్టల్‌లో సీసీ కెమెరాలు లేవంటున్న యాజమాన్యం.
  • హైదరాబాద్‌: మాదాపూర్‌లో రోడ్డుప్రమాదం. అయ్యప్ప సొసైటీలో అదుపుతప్పి స్కూల్‌ బస్సు బోల్తా. బస్సులో విద్యార్థులెవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం.

కర్ణాటక బలపరీక్ష: ఓటింగ్ జరిగే ఛాన్స్ లేదు.. కేపీసీసీ చీఫ్ గుండూరావు

ఉత్కంఠగా సాగుతున్న కన్నడ రాజకీయంలో ఇవాళ మరోసారి బలపరీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, జేడీఎస్ పక్షాలు ఎవరికి వారే శాసనసభాపక్ష సమావేశాలు నిర్వహించాయి. అయితే బలపరీక్ష సందర్భంగా అనుసరించాల్సి వ్యూహాలపై ఇరుపార్టీలు చర్చించాయి కూడా. అయితే కాంగ్రెస్ పక్ష సమావేశం ముగిసిన తర్వాత కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావు షాకింగ్ కామెంట్స్ చేశారు.

సోమవారం అసలు ఓటింగ్ జరిగే ఛాన్స్ లేదన్నారు. సుప్రీం కోర్టు నిర్ణయం కోసం తాము ఎదురుచూస్తున్నామన్నారు. ఇప్పటివరకు రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు ససేమిరా అనడంపై ఆయన మాట్లాడుతూ వారంతా తర్వాత పశ్చాత్తాప పడతారని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే తాను అనారోగ్యంతో హాస్పిటల్‌లో చేరానని వస్తున్న వార్తలను సీఎం కుమారస్వామి ఖండించారు. సోమవారం జరిగే సభకు హాజరవుతానని కూడా ప్రకటించారు.

మరోవైపు కర్ణాటకలో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ శతవిధాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది. బెంగళూరులోని రమద హోటల్‌లో బీజేపీ శాసనసభాపక్షం తాజా పరిణామాలపై చర్చించింది.