17 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు..స్పీకర్ అనూహ్య నిర్ణయం

కర్ణాటకలో నూతన సీఎం ఎదియూరప్ప ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కోవడానికి ఒకరోజు ముందు స్పీకర్ రమేష్ కుమార్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 17 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 మందిని, జేడీ-ఎస్ కు చెందిన ముగ్గురిని, ఓ స్వతంత్ర ఎమ్మెల్యేను అనర్హులుగా ఆదివారం ప్రకటించారు. ఇటీవలే మరో ముగ్గురిపై కూడా ఆయన అనర్హత వేటు వేశారు. కాంగ్రెస్ కు చెందిన శ్రీమంత్ పాటిల్, రోషన్ బేగ్, బస్వరాజు, […]

17 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు..స్పీకర్ అనూహ్య నిర్ణయం
Follow us

|

Updated on: Jul 28, 2019 | 1:17 PM

కర్ణాటకలో నూతన సీఎం ఎదియూరప్ప ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కోవడానికి ఒకరోజు ముందు స్పీకర్ రమేష్ కుమార్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 17 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 మందిని, జేడీ-ఎస్ కు చెందిన ముగ్గురిని, ఓ స్వతంత్ర ఎమ్మెల్యేను అనర్హులుగా ఆదివారం ప్రకటించారు. ఇటీవలే మరో ముగ్గురిపై కూడా ఆయన అనర్హత వేటు వేశారు. కాంగ్రెస్ కు చెందిన శ్రీమంత్ పాటిల్, రోషన్ బేగ్, బస్వరాజు, మునిరత్నం, సుధాకర్, శివరాం హెబ్బర్, సోమశేఖర్, ప్రతాప గౌడ, బీసీ పాటిల్, ఆనంద్ సింగ్, నాగరాజు, జేడీ-ఎస్ కు చెందిన గోపాలయ్య, నారాయణ గౌడ, విశ్వనాథ్, తాజాగా అనర్హతకు గురైనవారిలో ఉన్నారు. లోగడ స్వతంత్ర ఎమ్మెల్యే శంకర్ తో బాటు కాంగ్రెస్ కు చెందిన మరో ఇద్దరు రెబెల్ సభ్యులపై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ కాలపరిమితి ముగిసేవరకు వీరు అనర్హులే.. వీరి సభ్యత్వాన్ని రద్దు చేయడంతో శాసన సభలో సభ్యుల సంఖ్య 209 కి తగ్గింది. మెజారిటీ మార్క్ 105 మాత్రమే.. బీజేపీకి ఈ నెంబర్ ఎలాగూ ఉంది. దీంతో… అసెంబ్లీలో సోమవారం ఎదియూరప్ప ప్రభుత్వం సులువుగా బలపరీక్షలో నెగ్గుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఎదియూరప్ప సభలో తాను మెజారిటీని నిరూపించుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. నిజానికి ఆయనకు ఈ నెల 31 వరకు గడువు ఉన్నప్పటికీ.. రెండు రోజుల ముందే విశ్వాస పరీక్షను ఎదుర్కోవడానికి సిధ్ధపడ్డారు. మొత్తానికి ఓ దక్షిణాది రాష్ట్రంలో కమలనాథులు బలంగా పాగా వేయగలిగారు.