కరోనా నుంచి కోలుకుని సిద్ధరామయ్య డిశ్చార్జ్

మాయదారి కరోనాను కర్నటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య కోలుకున్నారు. కరోనా వైరస్‌ బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సిద్ధ రామయ్య కోలుకుని గురువారం డిశ్చార్జ్ అయ్యారు. రెండోసారి ఆయనకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగిటివ్‌ గా తేలడంతో ఆయనను డిశ్చార్జ్‌ చేసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

కరోనా నుంచి కోలుకుని సిద్ధరామయ్య డిశ్చార్జ్
Follow us

|

Updated on: Aug 13, 2020 | 6:55 PM

మాయదారి కరోనాను కర్నటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య కోలుకున్నారు. కరోనా వైరస్‌ బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సిద్ధ రామయ్య కోలుకుని గురువారం డిశ్చార్జ్ అయ్యారు. రెండోసారి ఆయనకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగిటివ్‌ గా తేలడంతో ఆయనను డిశ్చార్జ్‌ చేసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. వైద్యుల సూచన మేరకు మరో వారం రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండనున్నారు. ఆగస్టు 3 తేదీన కరోనా బారిన పడ్డ సిద్ద రామయ్య బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. కాగా, గత పది రోజులుగా తనకు వైద్య సేవలు అందించిన ఆస్పత్రి సిబ్బందికి, త్వరగా కోలుకోవాలని తన కోసం ప్రార్ధించిన పార్టీ కార్యకర్తలకు ఆయన ట్విటర్‌ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.

మరో కర్నాటకలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసలు సంఖ్య 1,96,494కి చేరింది. అటు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడీయూరప్ప కూడా కరోనా వైరస్ బారిన పడి ఇటీవలనే కోలుకున్నారు. అటు ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీరాములు సైతం కరోనా సోకి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.