కరోనా ఎఫెక్ట్: మూడు నెలల్లో 40వేల రిజిస్టర్ మ్యారేజ్‌లు..

కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. కరోనా లాక్ డౌన్ తో పలువురు రిజిస్టర్‌ మ్యారేజీల వైపు దృష్టి పెడుతున్నారు. ఈ ఏడాది మార్చి నుంచి జూన్‌ మధ్య

కరోనా ఎఫెక్ట్: మూడు నెలల్లో 40వేల రిజిస్టర్ మ్యారేజ్‌లు..
Follow us

| Edited By:

Updated on: Jul 18, 2020 | 8:24 PM

కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. కరోనా లాక్ డౌన్ తో పలువురు రిజిస్టర్‌ మ్యారేజీల వైపు దృష్టి పెడుతున్నారు. ఈ ఏడాది మార్చి నుంచి జూన్‌ మధ్య కర్ణాటకలో 40వేల కంటే ఎక్కువగా రిజిస్టర్‌ అయ్యాయి. కరోనా వైరస్‌ సంక్రమణతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించడంతో ఫంక్షన్‌ హాళ్లు కూడా మూతపడ్డాయి. లాక్‌డౌన్ అనంతరం షరతులతో పెళ్లి కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చినా వైరస్‌ వ్యాప్తి, ప్రభుత్వ నిబంధనలతో ఎక్కువ మంది రిజిస్టర్‌ మ్యారేజీ వైపు దృష్టి సారిస్తున్నారు.

కాగా.. గత మూడు నెలల్లో కర్ణాటకలో రిజిస్టర్‌ వివాహ నమోదులో సుమారు 40 వేలకు పైగా వివాహాలు నమోదయ్యాయి. ఇది రాష్ట్రంలోనే అత్యధికమని పలువురు అధికారులు తెలిపారు. అంతకు ముందు పెద్ద పెద్ద వేదికలు, హాళ్లలో వివాహాలకు అనుమతి ఉండడంతో అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు జరిగేవి. దీంతో రిజిస్టర్‌ మ్యారేజీలు తక్కువగా ఉండేవి. కరోనా మహమ్మారి, లాక్‌డౌన్‌ నేపథ్యంలో చాలా మందికి తప్పనిసరి పరిస్థితుల్లో రిజిస్టర్ చేసుకోవడం మినహా వేరే గత్యంతరం లేని పరిస్థితి నెలకొంది.