కర్ణాటకలో అదే హై డ్రామా ! ఇక స్పీకర్ చేతిలో ఫైనల్ డెసిషన్ !

కర్ణాటకలో పొలిటికల్ డ్రామా రోజుకో మలుపు తిరుగుతోంది. కుమారస్వామి నేతృత్వంలోని దాదాపు 10 నెలల కాంగ్రెస్, జేడీ(ఎస్) సంకీర్ణ ప్రభుత్వం దాదాపు కుప్పకూలే స్థితికి చేరుకుంది. 13 మంది శాసన సభ్యుల రాజీనామాలను స్పీకర్ రమేష్ కుమార్ ఆమోదించిన పక్షంలో కుమారస్వామి సర్కార్ మైనారిటీలో పడిపోతుంది.రాజీనామాలు చేసిన వారి లేఖలను ఆయన పరిశీలించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు. గతనెలలోనే మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో బీజేపీ మెల్లగా […]

కర్ణాటకలో అదే హై  డ్రామా ! ఇక స్పీకర్ చేతిలో ఫైనల్ డెసిషన్ !
Follow us

|

Updated on: Jul 09, 2019 | 1:58 PM

కర్ణాటకలో పొలిటికల్ డ్రామా రోజుకో మలుపు తిరుగుతోంది. కుమారస్వామి నేతృత్వంలోని దాదాపు 10 నెలల కాంగ్రెస్, జేడీ(ఎస్) సంకీర్ణ ప్రభుత్వం దాదాపు కుప్పకూలే స్థితికి చేరుకుంది. 13 మంది శాసన సభ్యుల రాజీనామాలను స్పీకర్ రమేష్ కుమార్ ఆమోదించిన పక్షంలో కుమారస్వామి సర్కార్ మైనారిటీలో పడిపోతుంది.రాజీనామాలు చేసిన వారి లేఖలను ఆయన పరిశీలించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు. గతనెలలోనే మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో బీజేపీ మెల్లగా తెరచాటు ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. మంగళవారం బెంగుళూరులోని విధానసౌధ లో జరిగిన సీఎల్ఫీ సమావేశానికి 14 మంది కాంగ్రెస్ సభ్యులు విప్ ను ధిక్కరించి గైర్ హాజరయ్యారు. వీరిలో ముగ్గురు ‘ అనారోగ్య కారణాలపై ‘ తాము రాలేమని డుమ్మా కొట్టినట్టు సమాచారం.ముఖ్యంగా ఈ పార్టీ సీనియర్ నేత అయిన రామలింగారెడ్డి ఈ మీటింగ్ కి హాజరు కాకపోగా… ఆయన కుమార్తె సౌమ్యారెడ్డి అటెండ్ కావడం విశేషం. దాదాపు అరగంటసేపు జరిగిన సీఎల్ఫీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిధ్ధరామయ్య … ఈ నెల 21 న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని తెలిపారు. గత ఎన్నికల్లో తమ పార్టీయే ఎక్కువ శాతం ఓట్లు సాధించిందని అన్నారు.

ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. కాగా-తనకు అందిన రాజీనామా లేఖలు జెన్యూన్ గా (అసలైనవిగా) ఉన్నాయని తాను భావిస్తే.. తగిన నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ రమేష్ కుమార్ పేర్కొన్నారు. ఇదిలాఉండగా.ముంబైలోని లగ్జరీ హోటల్లో బస చేసిన కాంగ్రెస్, జేడీ-ఎస్ రెబల్ సభ్యులు ఆ హోటల్ వదిలి అజ్ఞాత ప్రదేశానికి వెళ్లారు. వారిని కాంటాక్ట్ చేయడానికి ఈ పార్టీల సీనియర్ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇదిలా ఉండగా-224 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్-జేడీ-ఎస్ పార్టీలకు చెందిన 118 మంది సభ్యులున్నారు. సభలో ఈ సంఖ్య103 కు తగ్గిపోయిన పక్షంలో.. మెజారిటీ మార్క్ 113 నుంచి 105 కు తగ్గుతుంది. 105 మంది బీజేపీ సభ్యులుండగా.. ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు పలికితే ఈ సంఖ్య 107 అవుతుంది అది కమలం పార్టీకి ప్లస్ పాయింట్ అవుతుంది. . ఇక-జేడీ-ఎస్ నేతలు తమ సభ్యులు ‘ జారిపోకుండా ‘ చూసేందుకు వారిని బెంగుళూరు శివారులోని కొడగులో గల రిసార్టుకు చేర్చారు. వారికోసం 35 గదులు బుక్ చేశారు.