కర్నాటకం.. క్లైమాక్స్ నేడే..!

కర్ణాటకలో హైడ్రామా కొనసాగుతోంది. సీఎం కుమారస్వామికి గవర్నర్ వాజుభాయ్ వాలా లేఖ రాశారు. శుక్రవారం మధ్యాహ్నం 1.30 నిమిషాల్లోపు శాసనసభలో బలం నిరూపించుకోవాలని లేఖ ద్వారా సూచించారు. అయితే అంతకుముందు విశ్వాస పరీక్షను నిన్ననే పూర్తి చేయాలంటూ గవర్నర్ స్పీకర్‌కు సందేశం పంపారు. కాంగ్రెస్-జేడీఎస్ సభ్యుల ఆందోళన నేపథ్యంలో స్పీకర్ శుక్రవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు. అయితే సీఎం కుమారస్వామి, స్పీకర్ రమేష్ కుమార్ సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. విప్ పై […]

కర్నాటకం.. క్లైమాక్స్ నేడే..!
Follow us

| Edited By:

Updated on: Jul 19, 2019 | 10:00 AM

కర్ణాటకలో హైడ్రామా కొనసాగుతోంది. సీఎం కుమారస్వామికి గవర్నర్ వాజుభాయ్ వాలా లేఖ రాశారు. శుక్రవారం మధ్యాహ్నం 1.30 నిమిషాల్లోపు శాసనసభలో బలం నిరూపించుకోవాలని లేఖ ద్వారా సూచించారు. అయితే అంతకుముందు విశ్వాస పరీక్షను నిన్ననే పూర్తి చేయాలంటూ గవర్నర్ స్పీకర్‌కు సందేశం పంపారు. కాంగ్రెస్-జేడీఎస్ సభ్యుల ఆందోళన నేపథ్యంలో స్పీకర్ శుక్రవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు. అయితే సీఎం కుమారస్వామి, స్పీకర్ రమేష్ కుమార్ సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. విప్ పై స్పష్టత ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేయనున్నారని సమాచారం. మరోవైపు విశ్వాస పరీక్ష నిర్వహించకుండా సభను వాయిదా వేయడంపై బీజేపీ ఎమ్మెల్యేలు నిరసనగా అసెంబ్లీ హాల్‌లోనే రాత్రంతా ధర్నా చేశారు. గవర్నర్ సూచనలకు స్పీకర్ బదులివ్వకుండా వాయిదా వేయడం ఏంటని ప్రశ్నించారు. విశ్వాస పరీక్ష నిర్వహించాల్సిందేనని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.