మైనర్‌ బాలికపై అత్యాచారం.. వృద్దుడికి ఉరి ఖరారు!

బెంగళూరులోని కోలారు జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన వృద్దుడికి మరణశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పును వెలువరించింది. వెంకటేశప్ప అనే 65 ఏళ్ళ వృద్ధుడు 2018 మే 1వ తేదీన భైరండహళ్లి గ్రామానికి చెందిన మైనర్ బాలికకు మాయ మాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై వేమగళ్ పోలీసులు వెంకటేశప్పపై పోక్సో కేసు దాఖలు చేశారు. ఇక విచారణలో నేరం రుజువు కావడంతో కోలారు రెండవ సెషన్స్ కోర్టు ఉరి శిక్షను […]

మైనర్‌ బాలికపై అత్యాచారం.. వృద్దుడికి ఉరి ఖరారు!
Follow us

|

Updated on: Jan 19, 2020 | 1:46 PM

బెంగళూరులోని కోలారు జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన వృద్దుడికి మరణశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పును వెలువరించింది. వెంకటేశప్ప అనే 65 ఏళ్ళ వృద్ధుడు 2018 మే 1వ తేదీన భైరండహళ్లి గ్రామానికి చెందిన మైనర్ బాలికకు మాయ మాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై వేమగళ్ పోలీసులు వెంకటేశప్పపై పోక్సో కేసు దాఖలు చేశారు. ఇక విచారణలో నేరం రుజువు కావడంతో కోలారు రెండవ సెషన్స్ కోర్టు ఉరి శిక్షను విధిస్తూ తీర్పును వెల్లడించింది. అటు చిక్కమగళూరు జిల్లా శృంగేరిలో కాలేజీ విధ్యార్ధినిపై అఘాయిత్యం చేసి ప్రాణాలు తీసిన ఇద్దరు దోషులకు కూడా ఆ జిల్లా ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.

2016 ఫిబ్రవరి 16న శృంగేరి తాలూకా మెణసె గ్రామానికి చెందిన ఓ కాలేజీ విద్యార్థినిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసి ఆపై హత్య చేశారు. ఇక ఆమె శవాన్ని ఓ పాడుపడిన బావిలో పడేసి పరారయ్యారు. సదరు విద్యార్థిని పీయుసి పరీక్ష రాసి తిరిగి వస్తుండగా మెణసెకు చెందిన సంతోష్, ప్రదీప్‌లు ఈ ఘాతుకానికి పాల్పడి ప్రాణాలు తీసినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేశారు. కాగా, ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన చిక్కమగళూరు కోర్టు.. నిందితులు నేరం చేసినట్లు రుజువు కావడంతో శనివారం తుదితీర్పును వెలువరించింది.